యేసు ప్రభును స్తుతించుట( సీయోను  పిల్లలు పాటలు) / Yesu Prabhuni Sthuthinchuta

యెహోవా… నా ఉన్నత దుర్గము… కీర్తన 18:2

పల్లవి:  యేసు ప్రభును స్తుతించుట

యెంతో యెంతో మంచిది  (2)

1. మహోన్నతుడా – నీ నామమును (2)

    స్తుతించుటయే – బహుమంచిది (2)

అ.ప.:  హల్లెలూయా – హల్లెలూయా

హల్లెలూయా – హల్లెలూయా (2)        ॥యేసు॥

2. విలువైన రక్తము – సిలువలో కార్చి

    కలుషాత్ముల మమ్ము – ప్రభు కడిగెను             ॥హల్లె॥

3. ఎంతో గొప్ప – రక్షణనిచ్చి

    వింతైన జనముగా – మము చేసెను               ॥హల్లె॥

4. మా శైలము – మా కేడెము

    మా కోటయు ‌- మా ప్రభువే                        ॥హల్లె॥

5. ఉన్నత దుర్గము – రక్షణ శృంగము

    రక్షించువాడు – మన దేవుడు                      ॥హల్లె॥

6. అతి సుందరుడు – అందరిలోన

    అతి కాంక్షణీయుడు – అతి ప్రియుడు             ॥హల్లె॥

7. రాత్రింబవళ్లు – వేనోళ్లతోను

    స్తుతించుటయే – బహుమంచిది                  ॥హల్లె॥