నాకొక స్నేహితుడున్నాడు / Naa Koka Snehithudu unnadu

నాకొక స్నేహితుడున్నాడు.

నేనున్నాను భయపడకన్నాడు

ఆయనే యేసు-నాప్రియ యేసు

1. నా పాపం కొరకు

ఆ సిల్వ మోసాడు

తన ప్రాణమునిచ్చి

నాకు జీవం పోసాడు                       ॥ఆయనే॥

2. ఆపద వేళల్లో

నా వెంట ఉంటాడు.

నా ఆనందంలో పాలు

పంచుకుంటాడు                               ॥ఆయనే॥

3. నేనేది అడిగినా

వెనువెంటనే ఇస్తాడు

నిదురే పోకుండా

తను కావలి కాస్తాడు                        ॥ఆయనే॥

నమ్మకమైన నా స్నేహితుడు / Nammakamaina Naa Snehithudu

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

నమ్మకమైన నా స్నేహితుడు
నా ప్రభు యేసుడు (2)
ఎడబాయనివాడు విడువనివాడు (2)
నిన్న నేడు ఒకటిగనున్నవాడు           ||నమ్మకమైన||

ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2)
వ్యాధిలో భాధలో (2)
నను స్వస్థపరచువాడు
అనుక్షణం నా ప్రక్కన నిలచి
ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2)
అన్నివేళలా నన్నాదరించువాడు (2)
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2)     ||నమ్మకమైన||

కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2)
కలతలలో కన్నీళ్ళలో (2)
నను ఓదార్చువాడు
కన్నతల్లిని మించిన ప్రేమతో
అరచేతిలో నను దాచినవాడు (2)
ఎన్నడు నన్ను మరువనివాడు (2)
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2)    ||నమ్మకమైన||

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Nammakamaina Naa Snehithudu
Naa Prabhu Yesudu (2)
Edabaayanivaadu Viduvanivaadu (2)
Ninna Nedu Okatiganunnavaadu         ||Nammakamaina||

Aapadalo Aanandamulo Nanu Veedanivaadu (2)
Vyaadhilo Bhaadhalo (2)
Nanu Swasthaparachuvaadu
Anukshanam Naa Prakkana Nilachi
Prathikshanam Naa Praanam Kaachi (2)
Annivelala Nannaadarinchuvaadu (2)
Naa Priya Snehithudu Naa Praana Hithudu (2)       ||Nammakamaina||

Kalimilo Lemilo Nanu Karuninchuvaadu (2)
Kalathalalo Kanneellalo (2)
Nanu Odaarchuvaadu
Kanna Thallini Minchina Prematho
Arachethilo Nanu Daachinavaadu (2)
Ennadu Nannu Maruvanivaadu (2)
Naa Priya Snehithudu Naa Praana Hithudu (2)        ||Nammakamaina||