నీతో స్నేహం చేయాలని / Neetho Sneham Cheyaalani

నీతో స్నేహం చేయాలని
నీ సహవాసం కావాలని (2)
నీ లాగే నేను ఉండాలని
నిను పోలి ఇలలో నడవాలని (2)
యేసయ్యా… యేసయ్యా…
నీ స్నేహం నాకు కావాలయ్యా (2)     ||నీతో||

శాశ్వతమైన నీ కృపతో నింపి
నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
నన్ను నీకు అర్పింతును (2)
యేసయ్యా… యేసయ్యా…
నీ కృపయే నాకు చాలునయ్యా (2)

మధురమైన నీ ప్రేమతో నన్ను పిలచి
నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావా (2)
ఏమివ్వగలను నీ ప్రేమకు యేసు
నన్ను నీకు అర్పింతును (2)
యేసయ్యా… యేసయ్యా…
నీ ప్రేమే నాకు చాలునయ్యా (2)

బలమైన నీ ఆత్మతో నన్ను నింపి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
ఏమివ్వగలను నీ కొరకు నేను
నన్ను నీకు అర్పింతును (2)
యేసయ్యా… యేసయ్యా…
నీ తోడే నాకు చాలునయ్యా (2)     ||నీతో||

Neetho Sneham Cheyaalani
Nee Sahavaasam Kaavaalani (2)
Nee Laage Nenu Undaalani
Ninu Poli Ilalo Nadavaalani (2)
Yesayyaa… Yesayyaa…
Nee Sneham Naaku Kaavalayyaa (2)      ||Neetho||

Shaashwathamaina Nee Krupatho Nimpi
Nee Rakshana Naaku Ichchaavayyaa (2)
Emivvagalanu Nee Krupaku Nenu
Nannu Neeku Arpinthunu (2)
Yesayyaa… Yesayyaa…
Nee Krupaye Naaku Chaalunayyaa (2)

Madhuramaina Nee Prematho Nannu Pilachi
Nee Sevakai Nannu Erparachukunnaava (2)
Emivvagalanu Nee Premaku Yesu
Nannu Neeku Arpinthunu (2)
Yesayyaa… Yesayyaa…
Nee Preme Naaku Chaalunayyaa (2)

Balamaina Nee Aathmatho Nannu Nimpi
Nee Saakshigaa Nannu Nilipaavayyaa (2)
Emivvagalanu Nee Koraku Nenu
Nannu Neeku Arpinthunu (2)
Yesayyaa… Yesayyaa…
Nee Thode Naaku Chaalunayyaa (2)      ||Neetho||

నా స్నేహితుడా / Naa Snehithudaa

పాట రచయిత: డేవిడ్సన్ గాజులవర్తి
Lyricist: Davidson Gajulavarthi

నీతో స్నేహం నే మరువగలనా
నిన్ను విడచి నేను ఉండగలనా
నీతో స్నేహం నే మరువగలనా
నా స్నేహితుడా… నా యేసయ్యా (2)
విడువక నను ఎడబాయని నేస్తమా         ||నీతో||

నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా
శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా
శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా
లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా
కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా
ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా           ||నా స్నేహితుడా||

నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా
కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా
అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా
ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా
ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా
ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా          ||నా స్నేహితుడా||

పాట రచయిత: డేవిడ్సన్ గాజులవర్తి
Lyricist: Davidson Gajulavarthi

Neetho Sneham Ne Maruvagalanaa
Ninnu Vidachi Nenu Undagalanaa
Neetho Sneham Ne Maruvagalanaa
Naa Snehithudaa… Naa Yesayyaa (2)
Viduvaka Nanu Edabaayani Nesthamaa          ||Neetho||

Naa Needagaa Neevundagaa – Bhayamemi Ledugaa
Shodhanakainaa Baadhalakainaa Bhayapadiponugaa
Shathruvu Nannu Vedhinchinaa – Naa Dhairyam Neevegaa
Lokam Nannu Dooshinchinaa – Nannu Viduvavugaa
Kanneeru Thudiche Naa Nestham Neevegaa
Odaarchi Nadipinche Snehithudavu Neevegaa            ||Naa Snehithudaa||

Naa Thodugaa Neevundagaa – Koduvemi Ledugaa
Kashtamulainaa Nashtamulainaa – Thadabadiponugaa
Apaayamemi Raakundagaa – Kaachevaadavu Neevegaa
Ennatikaina Maarani Needu – Snehame Madhuramugaa
Premanu Panchina Naa Nestham Neevegaa
Praananne Ichchina Snehithudavu Neevegaa          ||Naa Snehithudaa||

నా స్నేహం యేసుతోనే / Naa Sneham Yesu Thone

నా స్నేహం యేసుతోనే

నా గమ్యం క్రీస్తులోనే

నా తల్లిదండ్రులు నన్ను విడిచిన

యేసు నన్ను విడువడు

నా హితులందరు నన్ను మరచిన

యేసు నన్ను మరువడు

1. జగతికి రూపము లేనప్పుడు

నను సృజియించెను

పిండముగా నేనున్నప్పుడు

నను ఏర్పరచెను

చేయి పట్టి నడిపే దేవుడుండగా

భయమిక నన్ను చేరదు

తన కంటిపాపల నన్ను కాయును

శ్రమయు నన్నేమి చేయదు

2. నా ప్రభు అరచేతిలో నేను

చెక్కబడియుంటిని

తన కరముల నీడలో నిలచి

స్తోత్రము చేయుదును

నేను చేయు స్తుతుల మూలముగా

ఒక దుర్గమును స్థాపించెను

ఆయువు మొదలు జీవితాంతము

చంకనెత్తుకును ప్రియప్రభువే

నా ప్రాణానికి ప్రాణం / Naa Praanaaniki Praanam

నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా
స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా         ||నా ప్రాణానికి||

ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
కన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2)
ఆస్తులున్న వేళలో అక్కున చేరారు
ఆపద సమయాలలో అంతు లేకపోయారు
జంటగా నిలిచితివి నా ప్రాణమా
కన్నీరు తుడిచితివి నా స్నేహమా
కన్నీరు తుడిచితివి నా స్నేహమా
కన్నీరు తుడిచితివి …            ||నా ప్రాణానికి||

నీవే నా ప్రాణమని కడవరకు విడువనని
బాసలన్ని మరచి అనాథగా నను చేసారు (2)
నేనున్నానంటూ నా చెంతన చేరావు
ఎవరు విడచినా నను విడవనన్నావు
జంటగా నిలిచితివి నా ప్రాణమా
కన్నీరు తుడిచితివి నా స్నేహమా
కన్నీరు తుడిచితివి నా స్నేహమా
కన్నీరు తుడిచితివి …            ||నా ప్రాణానికి||

Naa Praanaaniki Praanam Neevenayyaa
Snehaaniki Nija Sneham Neevenayyaa
Nija Snehaaniki Nirvachanam Neeve Yesayyaa       ||Naa Praanaaniki||

Praana Snehithulamani Bandhuvulu Snehithulu
Kanneeti Samayamulo Ontarini Chesaaru (2)
Aasthulunna Velalo Akkuna Cheraaru
Aapada Samayaalalo Anthu Lekapoyaaru
Jantagaa Nilichithivi Naa Praanamaa
Kanneeru Thudichithivi Naa Snehamaa
Kanneeru Thudichithivi Naa Snehamaa
Kanneeru Thudichithivi…               ||Naa Praanaaniki||

Neeve Naa Praanamani Kadavaraku Viduvanani
Baasalanni Marachi Anaathagaa Nanu Chesaaru (2)
Nenunnaanantoo Naa Chenthana Cheraavu
Evaru Vidachinaa Nanu Vidavanannaavu
Jantagaa Nilichithivi Naa Praanamaa
Kanneeru Thudichithivi Naa Snehamaa
Kanneeru Thudichithivi Naa Snehamaa
Kanneeru Thudichithivi…       ||Naa Praanaaniki||