భజియింతుము నిను జగదీశా / Bhajiyinthumu Ninu Jagadeeshaa

పాట రచయిత: అద్దంకి రంజిత్ ఓఫిర్
Lyricist: Addanki Ranjith Ophir

భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి (2)          ||భజియింతుము||

విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే (2)
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే (2)           ||శరణు||

ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)
నీ భజనలు మా జీవనాధారం
చేకొనవే మా స్తుతి గీతం (2)         ||శరణు||

పాట రచయిత: అద్దంకి రంజిత్ ఓఫిర్
Lyricist: Addanki Ranjith Ophir

Bhajiyinthumu Ninu Jagadeeshaa Shree
Yesaa Maa Rakshana Karthaa (2)
Sharanu Sharanu Maa Deva Yehovaa
Mahimaanvitha Chira Jeevanidhi (2)         ||Bhajiyinthumu||

Vimala Seraapulu Dootha Ganambulu
Choodaga Leni Thejonidhive (2)
Maa Yadhamulakai Siluva Mraanupai
Deenudavai Maraninchithive (2)         ||Sharanu||

Prapradhamuda Mari Kadapati Vaadaa
Mruthudai Brathikina Niratha Nivaasi (2)
Nee Bhajanale Maa Jeevaadhaaram
Chekonave Maa Sthuthi Geetham (2)         ||Sharanu||

ఎండిన ఎడారి బ్రతుకులో/Endina Edaari Brathukulo

ఎండిన ఎడారి బ్రతుకులో
నిండైన ఆశ నీవేగా
యేసు.. నిండైన ఆశ నీవేగా
తడబడెడు నా పాదములకు
తోడు నీవే గదా
యేసు.. తోడు నీవే సదా       ||ఎండిన||

ఎండమావులు చూచి నేను
అలసి వేసారితి (2)
జీవ జలముల ఊట నీవై
సేద దీర్చితివి
నా బలము నీవైతివే
యేసు.. బలము నీవైతివే

నిత్య మహిమకు నిలయుడా నీ
దివ్య కాంతిలోన (2)
నీదు ఆత్మతో నన్ను నింపి
ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే
యేసు.. సారధి నీవైతివే

అంధకార లోయలెన్నో
ఎదురు నిలచినను (2)
గాయపడిన నీ హస్తమే నన్ను
గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా
యేసు.. శరణు నీవే గదా       ||ఎండిన||

Endina Edaari Brathukulo
Nindaina Aasha Neevegaa
Yesu.. Nindaina Aasha Neevegaa
Thadabadedu Naa Paadamulaku
Thodu Neeve Gadaa
Yesu.. Thodu Neeve Sadaa        ||Endina||

Endamaavaulu Choochi Nenu
Alasi Vesaarithi (2)
Jeeva Jalamula Oota Neevai
Seda Deerchithive
Naa Balamu Neevaithive
Yesu.. Balamu Neevaithive

Nithya Mahimaku Nilayudaa Nee
Divya Kaanthilona (2)
Needu Aathmatho Nannu Nimpi
Phalimpa Jesithive
Naa Saaradhi Neevaithive
Yesu.. Saaradhi Neevaithive

Andhakaara Loyalenno
Eduru Nilachinanu (2)
Gaayapadina Nee Hasthame Nannu
Gamyamu Cherchunu
Naa Sharanu Neeve Gadaa
Yesu.. Sharanu Neeve Gadaa        ||Endina||

నమ్మదగిన దేవుడవు / Nammadagina Devudavu

పాట రచయిత: శ్రీనివాస్ బండారు
Lyricist: Srinivas Bandaru

నమ్మదగిన దేవుడవు యేసయ్యా
నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా (2)
నా తేజోమయుడా నాదు రక్షకా
నను విడిపించిన నా విమోచకా (2)
నీ శరణు జొచ్చితి ఆదరించుము
సేదదీర్చి నీ అక్కున చేర్చుము
యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము     ||నమ్మదగిన||

నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే
నీ కృపా వార్తను వినిపించుము (2)
నా పూర్ణ హృదయముతో ఆత్మతో
కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2)         ||నీ శరణు||

నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే
నను రక్షించుటకై చేయి చాచితివే (2)
పదితంతుల సితారతో గానముతో
స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2)         ||నీ శరణు||

పాట రచయిత: శ్రీనివాస్ బండారు
Lyricist: Srinivas Bandaru

Nammadagina Devudavu Yesayyaa
Nithya Jeevamichchu Devudavu Neevayyaa (2)
Naa Thejomayudaa Naadu Rakshakaa
Nanu Vidipinchina Naa Vimochakaa (2)
Nee Sharanu Jochchithi Aadarinchumu
Sedadeerchi Nee Akkuna Cherchumu
Yesayyaa… Sedadeerchi Nee Akkuna Cherchumu        ||Nammadagina||

Naa Praanamu Dappigoni Aashapadene
Nee Krupaa Vaarthanu Vinipinchumu (2)
Naa Poorna Hrudayamutho Aathmatho
Kruthagnthaa Sthuthulu Chellinchedan (2)       ||Nee Sharanu||

Naa Praanamu Aapadalo Chikkubadene
Nanu Rakshinchutakai Cheyi Chaachithive (2)
Padi Thanthula Sithaaratho Gaanamutho
Sthuthi Gaanam Chesi Keerthinchedan (2)       ||Nee Sharanu||

దేవునికి భయపడవా / Devuniki Bhayapadavaa

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

దేవునికి భయపడవా మానవా
నీ దేవునికి భయపడవా మానవా (2)
పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా (2)
యేసయ్యను నీవు శరణు వేడుమా (2)       ||దేవునికి||

ఐగుప్తు మంత్రసానుల గమనించితివా
రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2)
దేవునికి విధేయత చూపిరి
వంశాభివృద్ధిని పొందిరి (2)      ||దేవునికి||

నినెవె ప్రజలను గమనించితివా
దేవుని మాటకు లోబడినారు (2)
పాపమును విడిచి ఉపవాసముండి
ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2)       ||దేవునికి||

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Devuniki Bhayapadavaa Maanavaa
Nee Devuniki Bhayapadavaa Maanavaa (2)
Paapaanni Viduvumaa – Prabhu Chentha Cherumaa (2)
Yesayyanu Neevu Sharanu Vedumaa (2)      ||Devuniki||

Aigupthu Manthrasaanula Gamaninchithivaa
Raajaagnanu Saithamu Athikraminchiri (2)
Devuniki Vidheyatha Choopiri
Vamshaabhivrudhdhini Pondiri (2)       ||Devuniki||

Neeneve Prajalanu Gamaninchithivaa
Devuni Maataku Lobadinaaru (2)
Paapamunu Vidichi Upavaasamundi
Praarthinchi Prabhu Deevena Pondiri (2)       ||Devuniki||

హీనమైన బ్రతుకు నాది / Heenamaina Brathuku Naadi

హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)
దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు      ||హీనమైన||

మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)
కరుణించి నన్ను కష్టాలు బాపు (2)
కరుణామయా క్రీస్తేసువా      ||హీనమైన||

తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ
భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)
పాపి కొరకు ప్రాణమర్పించిన (2)
త్యాగ శీలివి నీకే స్తోత్రము        ||హీనమైన||

నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు
లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2)
వెరువను జడియను (2)
నీ కంటి పాపను నను కాచే దైవమా         ||హీనమైన||

Heenamaina Brathuku Naadi – Ghora Paapini (2)
Daapu Jerithini Sharanu Korithini
Dikku Neeve Naaku Ilalo
Leru Evvaru Naayanu Vaaru        ||Heenamaina||

Manishiki Mamatha Unnandukaa – Gunde Kotha
Madilo Ninnu Nimpukunnandukaa – Vidhi Raatha (2)
Karuninchi Nannu Kashtaalu Baapu (2)
Karunaamayaa Kreesthesuvaa          ||Heenamaina||

Thalli Thandri Kanna Minna – Nee Madhura Prema
Bhaarya Bharthala Kanna Minna – Maarani Nee Prema (2)
Paapi Koraku Praanamarpinchina (2)
Thyaaga Sheelivi Neeke Sthothramu        ||Heenamaina||

Ninna Nedu Repu Yesu – Maarane Maaravu
Lokulantha Maaripoyina – Sthiramaina Vaadavu (2)
Veruvanu Jadiyanu (2)
Nee Kanti Paapanu Nanu Kaache Daivamaa        ||Heenamaina||