నమ్మకు ఇలలో / Nammaku Ilalo

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

నమ్మకు ఇలలో ఎవరిని
సాయం చేస్తారనుకొని (2)
నమ్ముకో రక్షకుడేసుని (2)
కార్యం చూడు నిలుచొని (2)        ||నమ్మకు||

సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు
చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు
అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2)
శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2)        ||నమ్మకు||

నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే
మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే
నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2)
దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2)        ||నమ్మకు||

నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి
జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి
సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2)
రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2)        ||నమ్మకు||

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Nammaku Ilalo Evarini
Saayam Chesthaaranukoni (2)
Nammuko Rakshakudesuni (2)
Kaaryam Choodu Niluchoni (2)        ||Nammaku||

Sahaayamu Chesthaamani Vasthaaru Endaro Nee Chenthaku
Cheyoothanu Isthaamani Chepthaaru Enno Kaburlu Neeku
Akkaraladdam Pettukoni Laabham Ponduthuntaaru (2)
Shavaalapai Kaasuleraalani Kaachukoni Choosthuntaaru (2)        ||Nammaku||

Nee Aapadanu Thelusukoni Prathyakshmauthaaru Venuventane
Memundagaa Neekemani Vennanti Untaaru Nee Intane
Neekunna Avasarathalanni Vaaripai Vesukuntaaru (2)
Dochukoni Nee Sarvasvam Irukulona Peduthuntaaru (2)        ||Nammaku||

Nee Aapthulam Memenani Raabattukuntaaru Nee Sangathi
Jawaabunu Choopisthaamani Pelusthu Untaarule Kumpati
Samasya Roopam Maarchesi Leni Rangu Poosthuntaaru (2)
Rahasyaalanu Bayatesi Ninu Allari Chesthuntaaru (2)        ||Nammaku||

ఎవరికి ఎవరు ఈ లోకంలో/Evariki Evaru Ee Lokamlo

పాట రచయిత: బాబన్న

ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||

ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||

ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||

మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||

Lyricist: c

Evariki Evaru Ee Lokamlo
Chivariki Yese Paralokamlo (2) ||Evariki||

Evarevaro Edurauthuntaaru
Praanaaniki Naa Praanam Antaaru (2)
Kashtaalalo Vaaru Kadili Pothaaru
Karuna Gala Yesu Naatho Untaadu (2) ||Evariki||

Dhanamu Neekunte Andaru Vasthaaru
Daridrudavaithe Darikevvaru Raaru (2)
Evarini Nammina Phalithamu Leduraa
Yesuni Nammithe Moksham Undiraa (2) ||Evariki||

Manushula Saayam Vyardhamuraa
Raajula Nammina Vyardhamuraa (2)
Yehovaanu Aashrayinchuta
Entha Melu Entho Melu (2) ||Evariki||