సాగిపోవుచున్నది దీర్ఘయాత్ర / Saagipovuchunnadi Deergha yaatra

సాగిపోవుచున్నది దీర్ఘయాత్ర

కనానులోనికి ఆ మంచి భూమికి

అ.ప: ముందుకే పయనము

వెనుకకు తిరిగి చూడము

యెహోవా తోడుండ

భయము లేదుగా

1. ఆకలైన వేళలో

మన్నా కురిపించును

దాహమైన వేళలో

బండ పొర్లి పారును    ॥ముందు॥

2. అడ్డగించు సంద్రము

పాయలుగా చీలును

తరిమికొట్టు సైన్యము

నాశనమై పోవును                           ॥ముందు॥