పేద నరుని రూపము / Pedha Naruni Roopamu

పేద నరుని రూపము ధరించి
యేసు రాజు నీ చెంత నిలచె
అంగీకరించు-మాయనను (2)       ||పేద నరుని||

కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్
ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2)
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందే తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

తల వాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను (2)       ||పేద నరుని||

ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2)
నీ వ్యాధిని వేదన తొలగించ
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందే (2)       ||పేద నరుని||

మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిల (2)
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో (2)       ||పేద నరుని||

తామసించెదవేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2)
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

Pedha Naruni Roopamu Dharinchi
Yesu Raaju Nee Chentha Nilache
Angeekarinchu-maayananu (2)       ||Pedha Naruni||

Kaalla Chethulandu Seelal Kottabaden
Mulla Makutamu Shirassuna Pettabaden (2)
Ninda Vedana Shramalanu Sahinchenesu
Chinde Thanadu Rakthamu Nee Paapamukai
Deenudai Ninnu Pilachuchunde (2)       ||Pedha Naruni||

Thala Vaalchutaku Ila Sthalame Ledu
Dappi Theerchukona Neeru Dorakaledu (2)
Thannu Aadarinchu Vaarevaru Leru
Priya Rakshakudu Siluvalo Vrelaade
Paatlupade Ninnu Vidipimpanu (2)       ||Pedha Naruni||

Prabhu Saathaanu Thalanu Chithuka Drokken
Paapa Daagulan Rakthamutho Kadigen (2)
Nee Vyaadhini Vedhana Tholagincha
Nee Shaapamu Nundi Vidipimpa
Siluvalo Vijayamu Pondhe (2)       ||Pedha Naruni||

Maaya Lokamunu Neevu Nammakumu
Manushyula Manassu Maaripovunila (2)
Nithya Devuni Premanu Nammi Neevu
Nischayamugaa Prabhuvulo Aanandimpa
Nede Rammu Vishwaasamutho (2)       ||Pedha Naruni||

Thaamasinchedhavela O Priyudaa
Priya Yesuni Yoddaku Lechi Rammu (2)
Ee Lokamu Neekivvani Shaanthini
Ee Diname Prabhuvu Neekosaga
Prematho Ninnu Pilachuchunde (2)       ||Pedha Naruni||

నీ రూపు చూడ / Nee Roopu Chooda

నీ రూపు చూడ నేనాశపడితి
నీ దర్శనమునే నే కోరుకుంటి (2)
నీ సుందర రూపము చూపించు దేవా
నీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)

పదివేలమందిలో అతి సుందరుడా
పరలోకనాథా అతికాంక్షనీయుడా (2)
నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి (2)
మధురాతి మధురంబు నీ స్వరము వినాలి (2)         ||హల్లెలూయా||

నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికే
నీ మాటతోనే జీవంబు కలిగే (2)
నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి (2)
నీ దరహాసములో నేనెదిగి పోవాలి (2)          ||నీ రూపు||

Nee Roopu Chooda Nenaashapadithi
Nee Darshanamune Ne Korukunti (2)
Nee Sundara Roopamu Choopinchu Devaa
Nee Mellani Swaramunu Vinipinchu Prabhuvaa
Hallelooya Hallelooya Hallelooya Hallelooya
Aamen Hallelooya Aamen Hallelooya (2)

Padivelamandilo Athi Sundarudaa
Paralokanaathaa Athikaankshaneeyudaa (2)
Naa Aasha Theeraganu Ninnu Nenu Choodaali (2)
Madhuraathi Madhurambau Nee Swaramu Vinaali (2)       ||Hallelooya||

Nee Sannidhilo Sukha Shaanthi Dorike
Nee Maatathone Jeevambu Kalige (2)
Nee Thodu Needalo Naa Brathuku Saagaali (2)
Nee Darahaasamulo Nenedigi Povaali (2)        ||Nee Roopu||

నీ రూపం నాలోన / Nee Roopam Naalona

నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2)
రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2)
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2)
నీ రూపము నాలో ముద్రించనీ (2)      ||నీ రూపం||

నా ముందు నీవు ఎడారులన్ని
నీటి ఊటలుగా మార్చెదవే (2)
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2)
ఆశీర్వాదము నీవే రాజా (2)      ||నీ రూపం||

నా పాప స్వభావం తొలగించుమయ్యా
నీ మంచి ప్రేమ నాకీయుమా (2)
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2)
హృదయాసీనుడా నా యేసయ్యా (2)      ||నీ రూపం||

అంధకారము వెలుగుగా మార్చి
శాంతి మార్గములో నడిపెదవే (2)
భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2)
భుజమును తట్టి నడిపెదవే (2)      ||నీ రూపం||

Nee Roopam Naalona – Prathibimbamai Velugani
Nee Premaa Nee Karunaa – Naa Hrudilona Pravahinchani (2)
Raajuvu Neeve Kadaa – Nee Daasuda Nene Kadaa (2)
Prabhu Nee Kosam Prathi Kshanam Jeevinchani (2)
Nee Roopamu Naalo Mudrinchani (2)      ||Nee Roopam||

Naa Mundu Neevu Edaarulanni
Neeti Ootalugaa Maarchedave (2)
DUkhamulo Shaanthini Ichchina Yesayyaa (2)
Aasheervaadamu Neeve Raajaa (2)      ||Nee Roopam||

Naa Paapa Swabhaavam Tholaginchumayyaa
Nee Manchi Prema Naakeeyumaa (2)
Neevu Koreti Aalayamai Nenu Undaali (2)
Hrudayaaseenudaa Naa Yesayyaa (2)      ||Nee Roopam||

Andhakaaramu Veluguga Maarchi
Shaanthi Maargamulo Nadipedave (2)
Bhayapadina Velalo Thoduga Nilichedave (2)
Bhujamunu Thatti Nadipedave (2)      ||Nee Roopam||

హోసన్నా హల్లెలూయా / Hosannaa Hallelooyaa

హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా (2)
స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము (2)
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2)           ||హోసన్నా||

కెరూబులు సెరూపులు
ఇరువది నలుగురు పెద్దలతో (2)
నాలుగు జీవుల గానాలతో (2)
స్తుతియింపబడుచున్న యేసునకు (2)           ||హోసన్నా||

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
సర్వ సృష్టికి మూలకారకుడు (2)
మృతుడై మరలా బ్రతికినవాడు (2)
మేఘముపై రానున్న యేసునకు (2)           ||హోసన్నా||

Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa (2)
Sthothra roopamu Krottha Geethamul Noraara Paadedamu (2)
Rakshakudau Prabhu Yesu Kreesthuku
Sthuthi Sthothramul Chellinthumu (2)         ||Hosannaa||

Keroobulu Seroopulu
Iruvadi Naluguru Peddalatho (2)
Naalugu Jeevula Gaanaalatho (2)
Sthuthiyimpabaduchunna Yesunaku (2)         ||Hosannaa||

Parishuddhudu Athi Parishuddhudu
Sarva Srushtiki Moolakaarakudu (2)
Mruthudai Maralaa Brathikinavaadu (2)
Meghamupai Raanunna Yesunaku (2)         ||Hosannaa||

కని విని ఎరుగని కరుణకు / Kani Vini Erugani Karunaku

కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
నీవే ఆధారం తండ్రి (2)
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
నీ రూపము కనిపించే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)       ||కని||

నీ పద ధూళులు రాలిన నేలలో
మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిమి నీ రూపం
మనసారా వింటిమి నీ మాట
ఇది అపురూపం – ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం          ||హల్లెలూయా||

Kani Vini Erugani Karunaku Neeve Aakaaram Thandri
Neeve Aadhaaram Thandri (2)
Dayaamayaa Nee Choopulatho
Daaveedu Thanayaa Nee Pilupulatho
Nee Roopamu Kanipinche
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2)         ||Kani||

Nee Pada Dhoolulu Raalina Nelalo
Memunnaamante – Bhaagyam Undaa Inthakante
Challani Nee Chethulu Thaaki
Pulakithamipoye – Brathuke Puneethamaipoye
Kanulaaraa Kantimi Nee Roopam
Manasaara Bintimi Nee Maata
Idi Apuroopam – Idi Adrushtam
Emi Chesinaamo Punyam
Maa Jeevithaalu Dhanyam          ||Hallelooyaa||