గమ్యం చేరాలని / Gamyam Cheraalani

గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనా
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)       ||గమ్యం చేరాలని||

భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో         ||సాగిపోతున్నాను||

అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండినా
నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని       ||సాగిపోతున్నాను||

Gamyam Cheraalani Neetho Undaalani
Pagaluu Reyi Paravashinchaalani
Ee Ningi Nela Kanumarugainaa
Shaashwatha Jeevam Pondaalani
Saagipothunnaanu Ninnu Choodaalani
Nirekshisthunnaanu Ninnu Cheraalani (2)         ||Gamyam Cheraalani||

Bhuvi Anthaa Thirigi Jagamanthaa Nadachi
Nee Gnaanamuku Spandinchaalani
Naakunnavanni Samastham Vechchinchi
Nee Prema Entho Kolavaalani
Adi Entha Eththuna Undo – Adi Entha Lothuna Undo
Adi Ae Roopamlo Undo – Adi Ae Maatallo Undo         ||Saagipothunnaanu||

Alalenno Reginaa Shramalenno Vachchinaa
Shiramunu Vanchi Sahinchaalani
Vedana Bhaadhalu Gundenu Pindinaa
Needu Siluvane Moyaalani
Naa Gunde Kovelalonaa – Ninne Ne Prathishtinchi
Nee Sevalone Ilalo – Naa Thudi Shwaasanu Vidavaalani  ||Saagipothunnaanu||

కనురెప్ప పాటైన / Kanureppa Paataina

కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)
ప్రేమను మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ         ||కనురెప్ప||

Kanureppa Paataina Kanu Mooyaledu Prema Prema
Nirupeda Sthithilonu Nanu Daatipoledu Prema Prema
Pagalu Reyi Palakaristhondi
Paramunu Vidichi Nanu Variyinchindi (2)
Kalavaristhondi Premaa
Praanamichchina Kaluvari Prema          ||Kanureppa||

Prema Chethilo Nanu Chekkukunnadi
Prema Rooputho Nanu Maarchiyunnadi (2)
Premanu Minchina Daivam Ledani
Premanu Kaligi Jeevinchamani (2)
Eduru Choosthondi Premaa
Kalavaristhondi Kreesthu Prema         ||Kanureppa||

Prema Logiliki Nanu Piluchuchunnadi
Prema Kougililo Bandhinchuchunnadi (2)
Premaku Preme Thodavuthundani
Premaku Saati Lene Ledani (2)
Paravashisthondi Premaa
Kalavaristhondi Kreesthu Prema        ||Kanureppa||