మన మధ్యనే ఉన్నది / Mana Madhyane Unnadi

పాట రచయిత: పి ఐసాక్
Lyricist: P Isaac

మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం
మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2)
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు లేనే లేదు
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు అసలే లేవు
నీ రాజ్యం మాకొచ్చును గాక
నీ చిత్తం భువిపై జరుగును గాక
పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము
ఇప్పుడే అనుభవిస్తాము – (2)
ఇక్కడే అనుభవిస్తాము

సిలువలో మన శాపం తొలగిపోయెను
ఆశీర్వాదముకు మనము వారసులం
దారిద్య్రముతో లేదు మాకు సంబంధం
ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మాకిక సొంతము
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మా సొంతము           ||నీ రాజ్యం||

ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై
కలసి జీవించుటయే పరలోక రాజ్యం
కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు
సంతోషముతో మేము సాగిపోతాము
ఈ తరానికి మాదిరిగా మేముంటాము
పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2)         ||నీ రాజ్యం||

పాట రచయిత: పి ఐసాక్
Lyricist: P Isaac

Mana Madhyane Unnadi Paraloka Raajyam
Mana Madhyane Unnadi Devuni Raajyam (2)
Paapamu Ledu Paralokamlo
Vyadhulu Baadhalu Lene Ledu
Paapamu Ledu Paralokamlo
Vyadhulu Baadhalu Asale Levu
Nee Raajyam Maakochchunu Gaaka
Nee Chittham Bhuvipai Jarugunu Gaaka
Paraloka Raajyaanni Ee Bhuvipai Memu
Ippude Anubhavisthaamu – (2)
Ikkade Anubhavisthaamu

Siluvalo Mana Shaapam Tholagipoyenu
Aasheervaadamuku Manamu Vaarasulam
Daaridryamutho Ledu Maaku Sambandham
Aathmalo Phaliyinchi Vardhilledam
Annitilo Soukhyamugaa Memundumu
Krupa Kshemamule Maakika Sonthamu
Annitilo Soukhyamugaa Memundumu
Krupa Kshemamule Maa Sonthamu         ||Nee Raajyam||

Aalu Magalu Okariki Okaru Thyaaga Moorthulai
Kalasi Jeevinchutaye Paraloka Raajyam
Kalathalu Levu Maaku Kanneeru Theliyadu
Santhoshamutho Memu Sagipothaamu
Ee Tharaaniki Maadirigaa Memuntaamu
Paraloka Prematho Kalisi Jeevisthaam (2)          ||Nee Raajyam||

పరలోక రాజ్యం చేరాలంటే(సీయోను పిల్లల పాటలు)/ Paraloka Raajyam Cheralante

Our Vision:

Empowered by the holy spirit, the vision of our new Jerusalem ministries is to passionately spread the love and good news of Jesus Christ to our own communities, our country and to the ends of the earth as ambassadors for Jesus Christ.

మా దృష్టి :

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా అధికారం పొంది, నూతన యేరూషలేము పరిచర్యలు ద్వారా అనేకులను మన స్వంత సమాజాలకు, మన దేశానికి మరియు ప్రభువైన యేసుక్రీస్తునకు రాయబారులుగా భూదింగతముల వరకు యేసుక్రీస్తు ప్రేమను మరియు ఆయన శుభవార్తను ఉద్రేకపూర్వకంగా విస్తరించడం.

Our Mission:

We gather to glorify and praise God gloriously, to hear and respond obediently to what He has commanded.
We are apostles teaching one another in Jesus Christ. Come together in prayer, love, faith, obedience and compassion. 
We are committed to serving as ambassadors to tell others about Jesus Christ. 
we pursue God’s righteousness, justice, and peace in every place and time
Our ministry has no FCRA and no foreign funds. This is totally 100% Indian and indigenous ministry

మా మిషన్ :

మేము దేవునిని మహికరముగా ఘనపరచి, స్తుతించడానికి, ఆయన ఆజ్జాపించినవన్ని వినుటకును మరియు విధేయత కలిగి ప్రతిస్పందించడానికి సమావేశమవుతాము. 
మేము యేసుక్రీస్తు నందు ఒకరినొకరు అపోస్తులుల బోధ. ప్రార్థన, ప్రేమ, విశ్వాసం, విధేయత మరియు కరుణతో కలిసిమెలసియుందుము.
యేసుక్రీస్తును గురించి ఇతరులకు చెప్పడానికి రాయబారులుగా పనిచేయడానికి మేము కట్టుబడి ఉంటాము. 
మేము ప్రతి స్థలమునందు, సమయములలో దేవుని నీతి, న్యాయం, శాంతిని అనుసరిస్తాము 
ప్రార్థన టవర్లు, మ్యాగజైన్ల ద్వారా ఈ మిషన్ నెరవేరుతుంది.
నూతన యేరూషలేము పరిచర్యలు FCRA లేదు మరియు విదేశీ నిధులు లేవు. ఇది పూర్తిగా 100% భారతీయ మరియు స్వదేశీ పరిచర్యలు

నాలాంటి చిన్నలంటే / Naalaanti Chinnalante

నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం
మాలాంటి వారిదే పరలోక రాజ్యం (2)

మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే
పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2)       ||నాలాంటి||

నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని
ముద్దాడి ముచ్చటించి దీవించెను (2)       ||నాలాంటి||

Naalaanti Chinnalante Yesayyakishtam
Maalaanti Vaaride Paraloka Raajyam (2)

Manasu Maari Chinna Pillala Vanti Vaaralaithene
Paraloka Raajyamani Yesu Cheppenu (2)        ||Naalaanti||

Naalaanti Chinnavaarini Yesayya Etthukoni
Muddhaadi Muchchatinchi Deevinchenu (2)        ||Naalaanti||