పువ్వులాంటిది జీవితం / Puvvu Laantidi Jeevitham

పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)
ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)
రాలిపోతుంది నేస్తమా
ఆ.. వాడిపోతుంది నేస్తమా (2)

పాల రాతపైన నడిచినా గాని
పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)
అందలము పైన కూర్చున్నా గాని
అందనంత స్థితిలో నీవున్నా గాని
కన్ను మూయడం ఖాయం
నిన్ను మోయడం ఖాయం (2)
కళ్ళు తెరచుకో నేస్తమా
ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2)          ||పువ్వు||

జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని
డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా
డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణము రాకముందే
అది నిన్ను చేరకముందే (2)
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)         ||పువ్వు||

ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా
ఏది నీతో రాదనీ తెలుసా
వాడిపోయి రాలకముందే
ఎత్తి పారవేయక ముందే (2)
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)        ||పువ్వు||

Puvvulaantidi Jeevitham Raalipothundi
Gaddilaantidi Jeevitham Vaadipothundi (2)
Ae Dinamandainaa Ae Kshanamainaa (2)
Raalipothundi Nesthamaa
Aa Vaadipothundi Nesthamaa (2)

Paala Raathpaina Nadachinaa Gaani
Pattu Vasthraale Neevu Thodiginaa Gaani (2)
Andalamu Paina Koorchunnaa Gaani
Andanantha Sthithilo Neevunnaa Gaani
Kannu Mooyadam Khaayam
Ninnu Moyadam Khaayam (2)
Kallu Therachuko Nesthamaa
Aa.. Kalusuko Yesuni Mithramaa (2)       ||Puvvu||

Gnaanamunnadani Neevu Brathikinaa Gaani
Dabbutho Kaalaanni Gadipinaa Gaani (2)
Gnaanamu Ninnu Thappinchadu Thelusaa
Dabbu Ninnu Rakshinchadu Thelusaa
Maranamu Raakamunde
Adi Ninnu Cherakamunde (2)
Paapaalu Viduvu Nesthamaa
Aa.. Prabhuni Cheru Mithramaa (2)       ||Puvvu||

Ilalo Neevu Nenu Sthiramu Kaadugaa
Dharalo Manakedi Sthiramu Kaadugaa (2)
Entha Sampaadinchinaa Vyardhamu Thelusaa
Aedi Neetho Raadani Thelusaa
Vaadipoyi Raalakamunde
Etthi Paaraveyaka Munde (2)
Paapaalu Viduvu Nesthamaa
Aa.. Prabhuni Cheru Mithramaa (2)     ||Puvvu||

పువ్వు విరిసి రాలినా / Puvvu Virisi Raalinaa

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును (2)
జీవ నీవే తెలుసుకో
నీ జీవితం ఏపాటిదో     ||పువ్వు||

ధరలో కలిమి లేములు
దరి చేరగానే కరగిపోవును (2)
దూరపర్చుమా లౌకికం
చేరు యేసును శీఘ్రమే     ||పువ్వు||

పుడమిలో ఫలియించుమా
ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2)
నేల రాలిన పువ్వులా
తేలిపోకుమా గాలిలోన     ||పువ్వు||

భువిలో బ్రతుకుట కన్నను
భగవంత సన్నిధి పెన్నిధి (2)
భారమనక పిలువవే
కోరుకో నువ్వు క్రైస్తవా     ||పువ్వు||

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu (2)
Jeeva Neeve Thelusuko
Nee Jeevitham Epaatido      ||Puvvu||

Dharalo Kalimi Lemulu
Dari Cheragaane Karagipovunu (2)
Dooraparchumaa Loukikam
Cheru Yesunu Sheeghrame      ||Puvvu||

Pudamilo Phaliyinchumaa
Phalamichchu Draakshaa Vallilaa (2)
Nela Raalina Puvvulaa
Thelipokumaa Gaalilona      ||Puvvu||

Bhuvilo Brathukuta Kannanu
Bhagavantha Sannidhi Pennidhi (2)
Bhaaramanaka Piluvave
Koruko Nuvvu Kraisthavaa      ||Puvvu||