నీ దీర్ఘశాంతమే / Nee Deergha Shaanthame

నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము

నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2)

యేసయ్యా… కనిపించరే
నీలాగా ప్రేమించే వారెవరు (2)    ||నీ దీర్ఘ||

కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను

వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2)

(ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో
ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2)

యేసయ్యా… కనిపించరే
నీలాగా దీవించే వారెవరు (2)    ||నీ దీర్ఘ||

ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని

ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2)

తృణీకరింపబడిన నా బ్రతుకును
కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2)

యేసయ్యా… కనిపించరే
నీలాగా కృప చూపే వారెవరు (2)    ||నీ దీర్ఘ||

నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో

జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను (2)

మధురమైన నీ సహవాసముతో
నా జీవ నాథుడా నీ మమతను పంచావు (2)

యేసయ్యా… కనిపించరే
నీలాంటి జీవము గల దేవుడెవ్వరు(2)    ||నీ దీర్ఘ||

Nee Deergha Shaanthame Naa Hrudayaaniki Dhairyamu
Nee Karunaa Kataakshamule Naa Brathukuku Aadhaaramu (2)
Yesayyaa.. Kanipinchare
Neelaagaa Preminche Vaarevvaru (2)       ||Nee Deergha||

Kadu Peda Sthithilone Karuve Naa Bandhuvaayenu
Vayasochchina Tharunamulo Vasthra Heenathe Krungadeesenu (2)
(Ae) Aadhaaramu Kanipinchani Naa Brathukulo
Aishwaryavanthuda Nannaadhukunnaavu (2)
Yesayyaa.. Kanipinchare
Neelaagaa Deevinche Vaarevaru (2)       ||Nee Deergha||

Ee Loka Gnaanuloalo Verrivaanigaa Untini
Ennikaina Vaarilo Vyardhunigaa Migili Untini (2)
Thruneekarimpabadina Naa Brathukunu
Karunaa Sampannudaa Nannennukunnaavu (2)
Yesayyaa.. Kanipinchare
Neelaagaa Krupa Choope Vaarevvaru (2)       ||Nee Deergha||

Naa Praanamu Naalo Krungivunna Samayamulo
Jeevamu Gala Neekai Naa Praanamu Parithapinchenu (2)
Madhuramaina Nee Sahavaasamutho
Naa Jeeva Naathudaa Nee Mamathanu Panchaavu (2)
Yesayyaa.. Kanipinchare
Neelaanti Jeevamu Gala Devudevvaru (2)       ||Nee Deergha||

నా తండ్రి / Naa Thandri

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards

నా తండ్రి నన్ను మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరు (2)
లోకం నాదే అని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను

నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2)
నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది         ||లోకం||

నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించినా ప్రేమా – ఎక్కడ కనరాలేదు (2)
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివె      ||నా తండ్రి||

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards

Naa Thandri Nannu Manninchu
Neekanna Preminche Vaarevaru (2)
Lokam Naade Ani Ninnu Vidichaanu
Ghora Paapini Nenu Yogyathe Ledu
O Mosapoyi Thirigi Vachchaanu
Nee Premane Kori Thirigi Vachchaanu

Needu Biddagaa Perigi – Nee Premane Choodalekapoyaanu
Ne Choochina Ee Lokam – Nannentho Muripinchindi (2)
Nee Bandham Thenchukoni – Dooraanike Parigetthaanu
Ne Nammina Ee Lokam – Shokamune Choopinchindi       ||Lokam||

Nee Kannulu Naa Koraku -Enthaga Eduru Choochinavo
Ninnu Minchinaa Prema – Ekkada Kanaraaledu (2)
Ne Chanipoyi Brathikaanani – Thirigi Neeku Dorikaanani
Gundelaku Hatthukontive – Nee Premaa Entho Choopithive       ||Naa Thandri||