నీ ప్రేమే నాకు చాలయ్యా / Nee Preme Naaku Chaalayyaa

నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2)
నీ దీవెనా నాకు చాలయ్యా (2)
ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

నన్ను ప్రేమించి నన్నాదరించి
నీ సన్నిధిలో నను నిలిపితివి (2)         ||నీ దీవెనా||

ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా
నీవు నన్ను మరువని దేవుడవు (2)           ||నీ దీవెనా||

కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా
నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2)
నీ సువార్తను నే చాటెదను (2)
ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

Nee Preme Naaku Chaalayyaa O Yesayyaa
Nee Krupaye Naaku Thodayyaa O Messaiah (2)
Nee Deevenaa Naaku Chaalayyaa (2)
O Karunaamayaa (4)       ||Nee Preme||

Nannu Preminchi Nannaadarinchi
Nee Sannidhilo Nanu Nilapithivi (2)         ||Nee Deevenaa||

Ee Loka Manushulu Nannu Dweshinchinaa
Neevu Nannu Maruvani Devudavu (2)         ||Nee Deevenaa||

Karuvulu Bhookampaalu Yuddhaalu Vachchinaa
Nee Raakadaku Gurthulugaa Unnavi (2)
Nee Suvaarthanu Ne Chaatedanu (2)
O Karunaamayaa (4)        ||Nee Preme||

నన్ను కాదనవని / Nannu Kaadanavani

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

నన్ను కాదనవని – నను కాదనలేవని
నీ చెంతకు నే చేరినా (2)
నీ ప్రేమే చాలని – నిను ప్రేమించాలని
నీ మనసే నే కోరినా (2)          ||నన్ను||

లోకాన్ని చూసి నే – పాపాన్ని చేసి నే
అలసి నీ చెంత చేరినా (2)
సాతానుకు దొరికిన – లోకానికి లొంగిన
నీవే నా దిక్కని ఎంచినా – (2)          ||నన్ను||

లాభాన్నాశించి నే – లోపాలు చేసి నే
సొలసి నీ శరణు కోరినా (2)
శోధనలు లొంగిన – వంచనలకు ఒరిగిన
నీవే ఆధారమని యెంచినా – (2)          ||నన్ను||

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Nannu Kaadanavani – Nanu Kaadanalevani
Nee Chenthaku Ne Cherinaa (2)
Nee Preme Chaalani – Ninu Preminchaalani
Nee Manase Ne Korinaa (2)          ||Nannu||

Lokaanni Choosi Ne – Paapaanni Chesi Ne
Alasi Nee Chentha Cherinaa (2)
Saathaanuku Dorikina – Lokaaniki Longinaa
Neeve Naa Dikkani Enchinaa – (2)          ||Nannu||

Laabhaannaashinchi Ne – Lopaalu Chesi Ne
Solasi Nee Sharanu Korinaa (2)
Shodhanalaku Longina – Vanchanalaku Vorigina
Neeve Aadhaaramani Yenchinaa – (2)          ||Nannu||

కలలా ఉన్నది / Kalalaa Unnadi

కలలా ఉన్నది నేనేనా అన్నది
నిజమౌతున్నది నీవు నాతో అన్నది
నిరాశల నిధిలోన – ఉషోదయం వచ్చింది
యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2)      ||కలలా||

మనుష్యులంతా మనసే గాయపరిచి
పురుగల్లె నను నలిపేయ జూచినా (2)
శూరుడల్లె వచ్చినావు
నాకు ముందు నిలచినావు
నాకు బలము ఇచ్చినావు
ఆయుధంగా మార్చినావు
చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ      ||కలలా||

శూన్యములో నాకై సృష్టిని చేసి
జీవితాన్ని అందముగా మలచేసి (2)
మాట నాకు ఇచ్చినవారు
దాన్ని నెరవేర్చువారు
నిన్ను పోలి ఎవరున్నారు
నన్ను ప్రేమించువారు
యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ      ||కలలా||

Kalalaa Unnadi Nenenaa Annadi
Nijamauthunnadi Neevu Naatho Annadi
Niraashala Nishilona – Ushodayam Vachchindi
Yesu Nee Preme Nanu Brathikinchenu (2)         ||Kalalaa||

Manushyulantha Manase Gaayaparchi
Purugalle Nanu Nalipeya Joochinaa (2)
Shoorudalle Vachchinaavu
Naaku Mundu Nilachinaavu
Naaku Balamu Ichchinaavu
Aayudhamgaa Maarchinaavu
Challani Nee Needalo Nithyamu Niluvanee        ||Kalalaa||

Shoonyamulo Naakai Srushtini Chesi
Jeevithaanni Andamugaa Malachesi (2)
Maata Naaku Ichchinavaaru
Daanni Neraverchuvaaru
Ninnu Poli Evarunnaaru
Nannu Preminchuvaaru
Yesu Nee Premanu Prathi Dinam Paadanee       ||Kalalaa||