నీ ప్రేమా ఎంతో / Nee Premaa Entho

నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం (2) యేసు
యేసయ్యా నీ ప్రేమ మధురం
యేసయ్యా మధురాతి మధురం (2)     ||నీ ప్రేమా||

మరచిపోనిది నీ ప్రేమా
నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా
జీవ కాలముండును నీ ప్రేమా (2)      ||నీ ప్రేమా||

సిలువకెక్కెను నీ ప్రేమా
నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా
నాకై మరణించెను నీ ప్రేమా
నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2)     ||నీ ప్రేమా||

తల్లికుండునా నీ ప్రేమా
సొంత చెల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమా
కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2)       ||నీ ప్రేమా||

త్యాగమున్నది నీ ప్రేమలో
దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో
గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2)         ||నీ ప్రేమా||

Nee Premaa Entho Entho Madhuram (2) Yesu
Yesayyaa Nee Prema Madhuram
Yesayyaa Madhuraathi Madhuram (2)   ||Nee Premaa||

Marachiponidi Nee Premaa
Nannu Maarchukunnadi Nee Premaa
Kannu Reppa Laantidi Nee Premaa
Jeeva Kaalamundunu Nee Premaa (2)      ||Nee Premaa||

Siluvakekkenu Nee Premaa
Naaku Viluva Nichchenu Nee Premaa
Naakai Maraninchenu Nee Premaa
Naakai Thirigi Lechenu Nee Premaa (2)        ||Nee Premaa||

Thallikundunaa Nee Premaa
Sontha Chellikundunaa Nee Premaa
Annakundunaa Nee Premaa
Kanna Thandrikundunaa Nee Premaa (2)     ||Nee Premaa||

Thyaagamunnadi Nee Premalo
Deergha Shaanthamunnadi Nee Premalo
Balamunnadi Nee Premalo
Goppa Bhaagyamunnadi Nee Premalo (2)    ||Nee Premaa||

నీ జల్దరు వృక్షపు / Nee Jaldaru Vrukshapu

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని (2)
బలు రక్కసి వృక్షపు గాయములు (2)
ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2)     ||నీ జల్దరు||

నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి (2)
నీ శిరము వానకు తడిచినను (2)
నను రక్షించుటకు వేచితివి (2)    ||నీ జల్దరు||

నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి (2)
ద్రాక్షా రస ధారల కన్న మరి (2)
నీ ప్రేమే ఎంతో అతి మధురం (2)     ||నీ జల్దరు||

ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2)
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2)
నీ సొగసును నాకు నొసగితివి (2)      ||నీ జల్దరు||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Nee Jaldaru Vrukshapu Needalalo
Nenaananda Bharithudanaithini (2)
Balu Rakkasi Vrukshapu Gaayamulu (2)
Premaa Hasthamulatho Thaaku Prabhu (2)      ||Nee Jaldaru||

Naa Hrudayapu Vaakili Theeyumani
Palu Dinamulu Manchulo Nilachithivi (2)
Nee Shiramu Vaanaku Thadichinanu (2)
Nanu Rakshinchutaku Vechithivi (2)      ||Nee Jaldaru||

Nee Parimala Pushpa Sugandhamulu
Naa Rotha Hrudayumunu Nimpinavi (2)
Draakshaa Rasa Dhaarala Kanna Mari (2)
Nee Preme Entho Adthi Madhuram (2)      ||Nee Jaldaru||

O Priyudaa Naa Athi Sundarudaa
Davala Varnudaa Naakathi Priyudaa (2)
Vyasanaa Kraanthudugaa Maarchabadi (2)
Nee Sogasunu Naaku Nosagithivi (2)      ||Nee Jaldaru||

నా యేసు ప్రభువా / Naa Yesu Prabhuvaa

నా యేసు ప్రభువా నిన్ను నేను
ఆరాధించెదను స్తుతియింతును (2)
నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచు
ఆనందించెదను చిరకాలము నీలో (2)

నీ స్నేహమే నా బలము
నీ ఊపిరే నా జీవము
నీ వాక్యమే ఆధారము
నాకు ధైర్యమిచ్చును (2)       ||నీ ప్రేమా||

నా ప్రాణమైన యేసయ్యా
నీవుంటే నాకు చాలును
నీ కోసమే నే జీవింతున్
నిజమైన ప్రేమికుడా (2)       ||నీ ప్రేమా||

యేసయ్యా నా రక్షకా
యేసయ్యా నా జీవమా
యేసయ్యా నా స్నేహమా
నాదు ప్రాణ ప్రియుడా (2)       ||నీ ప్రేమా||

Naa Yesu Prabhuvaa Ninnu Nenu
Aaraadhinchedanu Sthuthiyinthunu (2)
Nee Premaa Sannidhilo Nee Mukhamu Nenu Choochuchu
Aanandinchedanu Chirakaalamu Neelo (2)

Nee Snehame Naa Balamu
Nee Oopire Naa Jeevamu
Nee Vaakyame Aadhaaramu
Naaku Dhairyamichchunu (2)        ||Nee Premaa||

Naa Praanamaina Yesayyaa
Neevunte Naaku Chaalunu
Nee Kosame Ne Jeevinthun
Nijamaina Premikudaa (2)        ||Nee Premaa||

Yesayyaa Naa Rakshakaa
Yesayyaa Naa Jeevamaa
Yesayyaa Naa Snehamaa
Naadu Praana Priyudaa (2)        ||Nee Premaa||

ఎల్లలు లేనిది/Ellalu Lenidi

పాట రచయిత: జాన్ వెస్లీ

ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
అవధులు లేనిది – యేసుని ప్రేమ
నిశ్చలమైనది ఎన్నడు మారనిది
మాటే తప్పనిది – యేసుని ప్రేమ
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. నా యేసు ప్రేమా (2)         ||ఎల్లలు||

జీవిత యాత్రలో నీ కలలో చెదరినా
జీవన పయనంలో అందరు విడచినా (2)
విడువనిది మరువనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా          ||ఎల్లలు||

కల్వరి పయనంలో రక్తపు ధరలు
దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2)
తరగనిది చెదరనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా         ||ఎల్లలు||

Lyricist: John Wesley

Ellalu Lenidi Sarihaddulu Lenidi
Avadhulu Lenidi – Yesuni Prema
Nischalamainadi Ennadu Maaranidi
Maate Thappanidi – Yesuni Prema
Premaa.. Yesuni Premaa
Premaa.. Naa Yesu Premaa (2)       ||Ellalu||

Jeevitha Yaathralo Nee Kalalo Chedarinaa
Jeevana Payanamlo Andaru Vidachinaa (2)
Viduvanidi Maruvanidi (2)
Yesuni Prema.. Shree Yesuni Prema (2)
Premaa.. Yesuni Premaa
Premaa.. Kalvari Premaa         ||Ellalu||

Kalvari Payanamlo Rakthapu Dhaaralu
Devuni Premaku Rujuve Nesthamaa (2)
Tharaganidi Chedaranidi (2)
Yesuni Prema.. Shree Yesuni Prema (2)
Premaa.. Yesuni Premaa
Premaa.. Kalvari Premaa         ||Ellalu||

చాలునయ్యా చాలునయ్యా / Chaalunayyaa Chaalunayyaa

చాలునయ్యా చాలునయ్యా
నీ కృప నాకు చాలునయ్యా (2)
ప్రేమామయుడివై ప్రేమించావు
కరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)          ||చాలునయ్యా||

జిగటగల ఊభిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా
హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)      ||చాలునయ్యా||

బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనే లేదయ్యా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ
నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)        ||చాలునయ్యా||

Chaalunayyaa Chaalunayyaa
Nee Krupa Naaku Chaalunayyaa (2)
Premaamayudivai Preminchaavu
Karunaamayudivai Karuninchaavu (2)
Thalliga Laalinchi Thandriga Preminche (2)
Premaa Karunaa Nee Krupa Chaalu (2)      ||Chaalunayyaa||

Jigatagala Oobhilo Padiyundagaa
Naa Adugulu Sthiraparachi Nilipithivayyaa (2)
Hissoputho Nannu Kadugumu Yesayyaa
Himamu Kantenu Thellaga Maarchayyaa
Neekemi Chellinthu Naa Manchi Messeeya
Naa Jeevithamantha Arpinthu Neekayyaa
Premaa Karunaa Nee Krupa Chaalu (2)         ||Chaalunayyaa||

Bandhuvulu Snehithulu Throsesinaa
Thallidandrule Nannu Velivesinaa (2)
Nannu Neevu Viduvane Ledayyaa
Minnaga Preminchi Rakshinchinaavayyaa
Neekemi Chellinthu Naa Manchi Messeeya
Nee Saakshigaa Nenu Ila Jeevithunayyaa
Premaa Karunaa Nee Krupa Chaalu (2)          ||Chaalunayyaa||