నీదు ప్రేమ నాలో / Needhu Prema Naalo

నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు
నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు
మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు
మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు
ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో
మరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2)

తోడువైనావు నా నీడవైనావు
నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు
మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా
ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా
జీవితమంతా మరువలేనయ్యా           ||నీదు ప్రేమ||

ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు
అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు
నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా
కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా
నేను నిన్ను విడువలేనయ్యా           ||నీదు ప్రేమ||

Needhu Prema Naalo Unchi Jeevamunichchaavu
Needhu Roopame Naalo Unchi Nannu Chesaavu
Mantivaadanu Nannu Neevu Mahimaparichaavu
Maranapaathrudanaina Nannu Paramu Cherchaavu
Entha Prema Yesayyaa – Neekentha Naapai Karunayo
Maruvagalanaa Nee Krupa – Brathukanthayu (2)

Thoduvainaavu Naa Needavainaavu
Neevu Naaku Undagaa Naaku Ee Digilenduku
Manchi Kaapari Neevenayyaa Naa Yesayyaa
Enchalenayyaa Nee Vaathsalyam O Messayyaa
Jeevithamanthaa Maruvalenayyaa          ||Needhu Prema||

Praanamainaavu Neeve Dhyaanamainaavu
Annee Neevai Cheradeesi Aashrayamainaavu
Neethisooryudaa Paripoornudaa Nithya Devudaa
Keerthaneeyudaa Krupapoornudaa Sathyajeevudaa
Nenu Ninnu Viduvalenayyaa            ||Needhu Prema||

నీ ప్రేమ ఎంతో మధురం / Nee Prema Entho Madhuram

నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)            ||నీ ప్రేమ||

రాతి గుండెలే మారును
నీ మాట సెలవిస్తే (2)
రమణీయము నీ మాటలే
వెదజల్లును సుమగంధమే (2)           ||యేసయ్యా||

వ్యాధి బాధలే పోవును
నీ మాట సెలవిస్తే (2)
బలమైనది నీ మాటయే
తొలగించును కారు చీకటులే (2)           ||యేసయ్యా||

నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)            ||నీ ప్రేమ||

రాతి గుండెలే మారును
నీ మాట సెలవిస్తే (2)
రమణీయము నీ మాటలే
వెదజల్లును సుమగంధమే (2)           ||యేసయ్యా||

వ్యాధి బాధలే పోవును
నీ మాట సెలవిస్తే (2)
బలమైనది నీ మాటయే
తొలగించును కారు చీకటులే (2)           ||యేసయ్యా||

నీ ప్రేమా ఎంతో / Nee Premaa Entho

నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం (2) యేసు
యేసయ్యా నీ ప్రేమ మధురం
యేసయ్యా మధురాతి మధురం (2)     ||నీ ప్రేమా||

మరచిపోనిది నీ ప్రేమా
నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా
జీవ కాలముండును నీ ప్రేమా (2)      ||నీ ప్రేమా||

సిలువకెక్కెను నీ ప్రేమా
నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా
నాకై మరణించెను నీ ప్రేమా
నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2)     ||నీ ప్రేమా||

తల్లికుండునా నీ ప్రేమా
సొంత చెల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమా
కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2)       ||నీ ప్రేమా||

త్యాగమున్నది నీ ప్రేమలో
దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో
గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2)         ||నీ ప్రేమా||

Nee Premaa Entho Entho Madhuram (2) Yesu
Yesayyaa Nee Prema Madhuram
Yesayyaa Madhuraathi Madhuram (2)   ||Nee Premaa||

Marachiponidi Nee Premaa
Nannu Maarchukunnadi Nee Premaa
Kannu Reppa Laantidi Nee Premaa
Jeeva Kaalamundunu Nee Premaa (2)      ||Nee Premaa||

Siluvakekkenu Nee Premaa
Naaku Viluva Nichchenu Nee Premaa
Naakai Maraninchenu Nee Premaa
Naakai Thirigi Lechenu Nee Premaa (2)        ||Nee Premaa||

Thallikundunaa Nee Premaa
Sontha Chellikundunaa Nee Premaa
Annakundunaa Nee Premaa
Kanna Thandrikundunaa Nee Premaa (2)     ||Nee Premaa||

Thyaagamunnadi Nee Premalo
Deergha Shaanthamunnadi Nee Premalo
Balamunnadi Nee Premalo
Goppa Bhaagyamunnadi Nee Premalo (2)    ||Nee Premaa||

నీ కృప చాలును / Nee Krupa Chaalunu

నీ కృప చాలును
నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)
నీవు లేని జీవితం అంధకార బంధురం (2)
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో
నన్ను కృంగదీయు సంకటములెన్నియో (2)
నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2)
నా జీవితాంతము నీలోనే నిలిచెదన్
నా జీవితాంతము నీతోనే నడిచెదన్
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)
నిను పోలి నేను ఈ లోకమందు
నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2)
నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్
నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)

Nee Krupa Chaalunu
Nee Prema Chaalunu
Neevu Naaku Thodunte Chaalunu Yesu (2)
Neevu Leni Jeevitham Andhakaara Bandhuram (2)
Neevu Naaku Thodunte Chaalunu Yesu (2)

Shodhanalu Enniyo Vedhanalu Enniyo
Nannu Krungadeeyu Sankatamulenniyo (2)
Nee Prema Varsham Naa Sthithini Maarchegaa (2)
Naa Jeevithaanthamu Neelone Nilichedhan
Naa Jeevithaanthamu Neethone Nadichedhan
Neevu Naaku Thodunte Chaalunu Yesu (2)

Naa Prema Geetham – Naa Dheena Praardhana
Naa Hrudaya Aalaapana Anduko Devaa (2)
Ninu Poli Nenu Ee Lokamandu
Nee Saakshigaanu Nee Mahima Chaatedhan (2)
Nee Divya Vaakyam Ee Jagaana Chaatedhan
Nee Aathma Abhishekam Naaku Nosagu Devaa (2)

Naa Prema Geetham – Naa Dheena Praardhana
Naa Hrudaya Aalaapana Anduko Devaa (2)

నీ కృప ఆకాశము కన్నా / Nee Krupa Aakaashamu Kannaa

నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా
నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా

నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు
ఎల్లకాలం తోడు నీవే
నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2)
కృతజ్ఞతా స్తుతులు నీకే

పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది
పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది        ||నీ ప్రేమ||

పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది
పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును         ||నీ ప్రేమ||

Nee Krupa Aakaashamu Kannaa Etthainadhi Yesayyaa
Nee Prema Sandraala Kannaa Lothainadhi Yesayyaa

Nee Prema Nannu Viduvadhu Edabaayadhu
Ellakaalamu Thodu Neeve
Nammadagina Yesayyaa – Kruthagnathaa Sthuthulu Neeke – (2)
Kruthagnathaa Sthuthulu Neeke

Parama Thandri Nee Prema Sharathulu Lenidi
Parama Thandri Nee Prema Nisswaardhyamainadi       ||Nee Prema||

Parama Thandri Nee Prema Sampoornamainadi
Parama Thandri Nee Prema Sarvamu Samakoorchunu      ||Nee Prema||

ప్రేమ కలిగి యుండుము / Prema Kaligi Undumu

ప్రేమ కలిగి యుండుము

ప్రేమే యేసని చాటుము

ప్రేమలో నిలచి యుండుము

ప్రేమను చూపుము

1. భక్త హనోకు నడచెను

ఇష్టుడైన దేవునితో

శ్రమలు శోధనలు

కలిగిన విడువక

2. దావీదు దానియేలు

నడచిరిగా ప్రియులుగా

శత్రువైన సింహమైన

విడువక నమ్మికతో

నీ ప్రేమ ఎంతో మాధుర్యము / Nee Prema Entho Madhuryamu

1. నీ ప్రేమ ఎంతో మాధుర్యము

నీ సృష్టి ఇల ఆశ్చర్యము

నీ త్యాగం వర్ణానాతీతము

నీ రక్షణ అతి గంభీరము

యేసయ్య నేను నీ వాడనే

నన్ను నీ సొత్తు చేశావుగా

ఏమిచ్చి నీ రుణం తీర్చెదను

నా స్తుతి నీకే అర్పింతును

2. నీ ప్రేమ ఎంతో మాధుర్యము

నీ సృష్టి ఇల ఆశ్చర్యము

నీ త్యాగం వర్ణానాతీతము

నీ రక్షణ అతి గంభీరము

యేసయ్య నేను నీ దాననే

నన్ను నీ సొత్తు చేశావుగా

ఏమిచ్చి నీ రుణం తీర్చెదను

నా స్తుతి నీకే అర్పింతును

యేసుని ప్రేమ బహు కమ్మనైనది / Yesuni Prema Bahu Kammanainadi

యేసుని ప్రేమ బహు కమ్మనైనది.

జీవాహారం మధురాతి మధురమే

భలే భలేగుందిలే

తేనే కంటే తియ్యగా ॥యేసు॥

1. ఐదు రొట్టెలు రెండు చేపలు

ఐదు వేలు తిన్నారు.

ఆహా ఓహో అన్నారు (2) ॥భలే॥

2. కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు.

ద్రాక్షా రసమును త్రాగి

ఆహా ఓహో అన్నారు (2) ॥భలే॥

ఎంత ప్రేమ నాపైన నీకు యేసయ్యా / Entha Prema Naa Painaa Neeku Yesayya

ఎంత ప్రేమ నాపైన నీకు యేసయ్యా

ఇంత ఇంతని కొలవడానికి వీలుకాదయ్యా

1. నన్ను పిలిచి ముద్దుపెట్టిఎత్తుకున్నావు

మంచి మంచి మాటలు చెప్పి

హత్తుకున్నావు నీలాంటి దేవుడెవరు

2. నీ కుమారునిగా నన్ను చేసుకున్నావు

జీవగ్రంథంలో పేరు రాసుకున్నావు.

నీలాంటి దేవుడెవరు

నా కొరకు బలియైన / Naa Koraku Baliyaina

పాట రచయిత: ప్రభు కుమార్
Lyricist: Prabhu Kumar

నా కొరకు బలియైన ప్రేమ
బహు శ్రమలు భరియించె ప్రేమ (2)
కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ (2)
తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ (2)
క్రీస్తేసు ప్రేమ         ||నా కొరకు||

నా హృదయ యోచనే జరిగించె పాపము
నా క్రియల దోషమే నడిపించె పతనముకై (2)
ఏ మంచి యుందని ప్రేమించినావయ్యా
నా ఘోర పాపముకై మరణించినావయ్యా
ఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా (2)
నా మంచి యేసయ్యా (2)      ||నా కొరకు||

నీ సిలువ త్యాగము నా రక్షణాధారం
నీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం (2)
అర్హతే లేని నాకై మరణించినావయ్యా
నీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా
ప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యా
ఘనపరతు యేసయ్యా (2)      ||నా కొరకు||

పాట రచయిత: ప్రభు కుమార్
Lyricist: Prabhu Kumar

Naa Koraku Baliyaina Prema
Bahu Shramalu Bhariyinche Prema (2)
Kadu Ghora Katina Shiksha Sahiyinche Prema (2)
Thudhi Shwaasanaina Naakai Arpinche Prema (2)
Kreesthesu Prema        ||Naa Koraku||

Naa Hrudaya Yochane Jariginche Paapamu
Naa Kriyala Dhoshame Nadipinche Pathanamukai (2)
Ae Manchi Yundhani Preminchinaavayyaa
Naa Ghora Paapamukai Maraninchinaavayyaa
Unnatha Prema Choopi Rakshinchinaavayyaa (2)
Naa Manchi Yesayyaa (2)      ||Naa Koraku||

Nee Siluva Thyaagamu Naa Rakshanaadhaaram
Nee Raktha Prokshanaye Naa Nithya Aishwaryam (2)
Arhathe Leni Naakai Maraninchinaavayyaa
Nee Marana Thyaagame Brathikinche Yesayyaa
Aemichchi Nee Runam Ne Theerchagalanayyaa
Praanaathma Dehamutho Sthuthiyinthu Yesayyaa
Ghanaparathu Yesayyaa (2)      ||Naa Koraku||