అందరికి కావాలి యేసయ్య రక్తము / Andariki Kaavaali Yesayya Rakthamu

పాట రచయిత: శైలన్న

అందరికి కావాలి యేసయ్య రక్తము (2)
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము (2)

కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము (2)
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము (2)            ||అందరికి||

కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
ఈ పాపము కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది (2)           ||అందరికి||

చీకటి శక్తుల అణిచె రక్తము
రోత బతుకును కడిగే రక్తము (2)
రక్తములోనే ప్రాణమున్నది
పాపము కడిగే గుణమున్నది (2)
రక్తములోనే పవ్వరున్నది
స్వస్తపరిచే గుణమున్నది (2)          ||అందరికి||

Lyricist: Sailanna

Andariki Kaavaali Yesayya Rakthamu (2)
Paapamu Leni Parishudhdhuni Rakthamu
Idi Paapula Korakai Volikina
Parama Vaidyuni Rakthamu (2)

Kula Matha Bedham Leni Rakthamu
Andariki Varthinche Rakthamu (2)
Kakshya Krodham Leni Rakthamu
Kanna Prema Choopinche Rakthamu (2)          ||Andariki||

Kolla Rakthamutho Paapam Podu
Edla Rakthamutho Paapam Podu (2)
Ee Paapamu Kadige Yesu Rakthamu
Saakali Vaani Sabbu Vantidi (2)           ||Andariki||

Cheekati Shakthula Aniche Rakthamu
Rotha Bathukunu Kadige Rakthamu (2)
Rakthamulone Praanamunnadi
Paapamu Kadige Gunamunnadi (2)
Rakthamulone Pavvarunnadi
Swasthapariche Gunamunnadi (2)      ||Andariki||

అందమైన మధురమైన నామం ఎవరిది / Andamaina Madhuramaina

అందమైన మధురమైన నామం ఎవరిది
మహిమాన్వితుడు మహిజన రక్షకుడు
ఆయనేసు యేసు యేసు (2)        ||అందమైన||

సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా
లోకమును రక్షించు ఇమ్మానుయేలా (2)
మా పాలి దైవమా ఓ శ్రీ యేసా
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2)        ||అందమైన||

కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యా
ఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే (2)
నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసా
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2)        ||అందమైన||

చీకటి నుండి వెలుగు లోనికి నడిపించావు
మానవులను ప్రేమించి చూపించావు (2)
మా కోసం మరణించి చూపించావు
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2)        ||అందమైన||

Andamaina Madhuramaina Naamam Evaridi
Mahimaanvithudu Mahijana Rakshakudu
Aayanesu Yesu Yesu (2)        ||Andamaina||

Sainyamulaku Adhipathivi Neeve O Raajaa
Lokamunu Rakshinchu Immaanuyelaa (2)
Maa Paali Daivamaa O Shree Yesaa
Sthuthinthu Ninnu Naa Aathma Yesayya (2)        ||Andamaina||

Konda Neeve Kota Neeve Neeve Yesayyaa
Aakali Theerchi Aadukune Thandrivi Neeve (2)
Nee Odilo Cherchumaa O Shree Yesaa
Sthuthinthu Ninnu Naa Aathma Yesayya (2)        ||Andamaina||

Cheekati Nundi Velugu Loniki Nadipinchaavu
Maanavulanu Preminchi Choopinchaavu (2)
Maa Kosam Maraninchi Choopinchaavu
Sthuthinthu Ninnu Naa Aathma Yesayya (2)        ||Andamaina||

అంతే లేని నీ ప్రేమ ధార / Anthe Leni Nee Prema Dhaara

పాట రచయిత: క్రాంతి చేపూరి

అంతే లేని నీ ప్రేమ ధార
ఎంతో నాపై కురిపించినావు
వింతైన నీ ప్రేమ కొంతైన గాని
కాంతింప కృప నాకు చూపించినావు (2)
ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను
అంతో ఇంతో ఆ ప్రేమను నేను
పంచేటందుకు నీ భాగ్యము పొందాను       ||అంతే||

పరిశుద్ధుడు పరిశుద్ధుడు
అని దూతలతో పొగడబడే దేవా
పదివేలలో అతి సుందరుడా
నీవేగా అతి కాంక్షనీయుడా (2)
నా దోషములకై ఆ కలువరి సిలువలో
బలియాగమైనావ దేవా (2)
సొంతముగా నే చేసిన నా పాపములన్ని
శాంతముతో సహియించి క్షమియించినావు
పంతముతో నిను వీడి నే పారిపోగా
నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు          ||అంతే||

ఏమున్నదీ నాలో దేవా
మంచన్నదే లేనే లేదు
అయినా నీవు నను రక్షించి
నీ సాక్షిగ నిలిపావు ఇలలో (2)
అర్హతయే లేదు నీ పేరు పిలువ
నీ సొత్తుగా నను మార్చినావా (2)
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
నా జీవితమంతయును నీ కొరకే దేవా
నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు         ||అంతే||

Anthe Leni Nee Prema Dhaara
Entho Naapai Kuripinchinaavu
Vinthaina Nee Prema Konthaina Gaani
Kaanthimpa Krupa Naaku Choopinchinaavu (2)
Entho Entho Nee Prema Entho
Pondetanduku Ne Yogyudanu (Yogyuraalu) Kaanu
Antho Intho Aa Premanu Nenu
Panchetanduku Nee Bhaagyamu Pondaanu           ||Anthe||

Parishuddhudu Athi Parishuddhudu
Ani Doothalatho Pogadabade Devaa
Padivelalo Athi Sundarudaa
Neevegaa Athi Kaankshaneeyudaa (2)
Naa Doshamulakai Aa Kaluvari Siluvalo
Baliyaagamainaava Devaa (2)
Sonthamugaa Ne Chesina Naa Paapamulanni
Shaanthamutho Sahiyinchi Kshamiyinchinaavu
Panthamutho Ninu Veedi Ne Paaripogaa
Nee Raajyamunaku Cherchaga Vanthena Ainaavu          ||Anthe||

Emunnadi Naalo Devaa
Manchannade Lene Ledu
Ainaa Neevu Nanu Rakshinchi
Nee Saakshiga Nilipaavu Ilalo (2)
Arhathaye Ledu Nee Peru Piluva
Nee Soththugaa Nanu Maarchinaavaa (2)
Emivvagalanayyaa Nee Premaku Badulu
Naa Jeevithamanthayunu Nee Korake Devaa
Nee Sevalo Nenu Konasaagedanayyaa
Prakatinthu Nee Prema Thudi Shwaasa Varaku         ||Anthe||

అంజలి ఘటియింతు దేవా  / Anjali Ghatiyinthu Devaa

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు

అంజలి ఘటియింతు దేవా (2)
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి       ||అంజలి||

పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ (2)
సిలువ మహా యజ్ఞ సింధూర
రక్తా రుణమేయ సంభావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా       ||అంజలి||

అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ (2)
పరలోక సింహాసనాసీన
తేజో విరాజమాన జగదావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా       ||అంజలి||

Lyricist: Diyya Prasada Rao

Anjali Ghatiyinthu Devaa (2)
Nee Manjula Paadaambujamula Kada
Niranjana Maanasa Parimala Pushpaanjali           ||Anjali||

Paramaathma Nee Paada Seva
Chirajeeva Sandraana Naava (2)
Siluva Mahaa Yagna Sindhoora
Rakthaa Runameya Sambhaavanaa (2)
Deva Devaa Yesu Devaa (2)
Anjali Ghatiyinthu Devaa           ||Anjali||

Avathaara Mahimaa Prabhaava
Suvishaala Karunaa Swabhaava (2)
Paraloka Simhaasanaaseena
Thejo Viraajamaana Jagadaavanaa (2)
Deva Devaa Yesu Devaa (2)
Anjali Ghatiyinthu Devaa           ||Anjali||

అవధులే లేనిది దివ్యమైన నీ కృప (హోసన్నా మినిస్ట్రీస్) / Avadhule Lenidi Divyamaina Nee Krupa (Hosanna Ministries )

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్

అవధులే లేనిది దివ్యమైన నీ కృప
అనంతమైనది ఆశ్చర్యమైనది (2)
యేసయ్యా నాపై నీవు చూపిన కృప
అమూల్యమైనది వర్ణించలేనిది (2)        ||అవధులే||

ఊహించలేని హృదయానందమును
దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
భారమెక్కువైనా తీరం కడుదూరమైనా
నీపై ఆనుకొందును
నేను గమ్యం చేరుకొందును (2)        ||అవధులే||

సరిపోల్చలేని మధురమైన అనుభవం
వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన
నీ రూపము తలచుకొందును
నేను నీ కోసమే వేచియుందును (2)        ||అవధులే||

లెక్కించలేని అగ్ని శోధనలో
ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)
వాడబారని కిరీటము నే పొందుటకు
వెనుకున్నవి మరచి
నేను లక్ష్యము వైపు సాగెద (2)        ||అవధులే||

Lyricist: Hosanna Ministries

Avadhule Lenidi Divyamaina Nee Krupa
Ananthamainadi Aascharyamainadi (2)
Yesayyaa Naapai Neevu Choopina Krupa
Amoolyamainadi Varninchalenidi (2)        ||Avadhule||

Oohinchaleni Hrudayaanandamunu
Dukhamunaku Prathigaa Dayachesinaavu (2)
Bhaaramekkuvainaa Theeram Kadu Dooramainaa
Neepai Aanukondunu
Nenu Gamyam Cherukondunu (2)        ||Avadhule||

Saripolchaleni Madhuramaina Anubhavam
Vinthaina Nee Premalo Anubhavimpajesaavu (2)
Soundaryamaina Athi Parishuddhamaina
Nee Roopamu Thalachukondunu
Nenu Nee Kosame Vechiyundunu (2)        ||Avadhule||

Lekkinchaleni Agni Shodhanalo
Prayaasamunaku Thagina Phalamulichchinaavu (2)
Vaadabaarani Kireetamu Ne Pondutaku
Venukunnavi Marachi
Nenu Lakshyamu Vaipu Saageda (2)        ||Avadhule||

అర్పించుచుంటిని యేసయ్యా / Arpinchuchuntini Yesayyaa

అర్పించుచుంటిని యేసయ్యా
నన్ను నీ చేతికి (2)
దీనుడను నన్ను నీ బిడ్డగా
ప్రేమతో స్వీకరించు (2)        ||అర్పించుచుంటిని||

ఈ లోక జీవితం అల్పకాలమే
నీవే నా గమ్యస్థానము (2)
నిజ సంతోషం నీవు నాకిచ్చి (2)
నా హృదయం వెలిగించు (2)
నా ప్రభువా యేసయ్యా           ||అర్పించుచుంటిని||

దప్పిగొన్న జింకవలెనే
ఆశతో చేరితి నీ దరి దేవా (2)
సేదతీర్చి జలము నిన్ను (2)
వాడిన బ్రతుకులో (2)
నింపుము జీవము              ||అర్పించుచుంటిని||

Arpinchuchuntini Yesayyaa
Nannu Nee Chethiki (2)
Deenudanu Nannu Nee Biddagaa
Prematho Sweekarinchu (2)           ||Arpinchuchuntini||

Ee Loka Jeevitham Alpakaalame
Neeve Naa Gamyasthaanamu (2)
Nija Santhosham Neevu Naakichchi (2)
Naa Hrudayam Veliginchu (2)
Naa Prabhuvaa Yesayyaa             ||Arpinchuchuntini||

Dappigonna Jinkavalene
Aashatho Cherithi Nee Dari Devaa (2)
Sedatheerchi Jalamu Ninnu (2)
Vaadina Brathukulo (2)
Nimpumu Jeevamu                ||Arpinchuchuntini||

అమూల్య రక్తం ప్రశస్త రక్తం / Amoolya Raktham Prashastha Raktham

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు

అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
విలువైన రక్తం – శక్తి గల రక్తం (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య||

తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప (2)
చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు||

శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు (2)
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు||

నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||

Lyricist: Diyya Prasada Rao

Amoolya Raktham – Prashastha Raktham
Viluvaina Raktham – Shakthi Gala Raktham (2)
Yesu Rakthame Jayamu
Kreesthu Rakthame Vijayamu (2)
Paapa Kshamaapana Yesu Rakthamulone
Shaapa Vimochana Kreesthu Rakthamulone          ||Amoolya||

Thandri Chitthamu Neravercha
Gethsemanelo Praardhimpa (2)
Chemata Rakthamu Goppa Binduvulai Kaarene
Aathma Shakthini Prasaadinchunu – Amoolya Rakthame (2)       ||Yesu||

Shaapaaniki Prathiphalamu Mullu
Mundla Kireetamutho Chellu (2)
Prabhuvu Nondene Manakai Koradaa Debbalu
Prathi Vyaadhini Swasthaparachunu – Amoolya Rakthame (2)       ||Yesu||

Nee Chethula Panini Aasheervadimpa
Prabhu Chethulalo Mekulu Gotta (2)
Kaallalo Mekulu Suvaarthaku Sundarame
Ballepu Potu Baagu Cheyunu – Gundelanu (2)       ||Yesu||

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు / Abraahaamu Issaaku Yaakobunaku

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
(యేసయ్యా) భూ రాజులందరికి
భూ జనులందరికి పూజ్యుడవు – ||అబ్రాము||

అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని
ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి
యాకోబును ఇశ్రాయేలని దీవించి
ఈ పాపిని నీవు విడువక ప్రేమించి
నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా
నీ చేతి నీడలో జీవింతునయ్యా ||అబ్రాహాము||

జీవాహారము నేనే అని పలికితివి
జీవ జలముల ఓరన నను నాటితివి
నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి
హృదయము నుండి జీవ జలములు పుట్టించి
నీ జీవాహారము – నీ జీవజలమును
నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును ||అబ్రాహాము||

Abraahaamu Issaaku Yaakobunaku Devudavu
(Yesayyaa) Bhoo Raajulandariki Bhoo Janulandariki Poojyudavu – (2)        ||Abraahaamu||

Abraahaamu Vishwaasulaku Thandri Ani
Issakunaku Prathiga Goriyapillanichchi (2)
Yaakobunu Ishraayelani Deevinchi
Ee Paapini Neevu Viduvaka Preminchi
Naa Manchi Yesayyaa – Neevunna Chaalayyaa
Nee Chethi Needalo Jeevinthunayyaa (2)        ||Abraahaamu||

Jeevaahaaramu Nene Ani Palikithivi
Jeeva Jalamula Orana Nanu Naatithivi (2)
Nirjeevamaina Nannu Sajeevunigaa Chesi
Hrudayamu Nundi Jeeva Jalumulu Puttinchi
Nee Jeevaahaaramu – Nee Jeevajalamunu
Naakichchinanduku Sthothramu Chellinthunu (2)        ||Abraahaamu||

అనుదినం ఆ ప్రభుని వరమే / Anudinam Aa Prabhuni Varame

పాట రచయిత: జాషువా కొల్లి

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2)
నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును            ||అనుదినం||

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2)
ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును           ||అనుదినం||

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2)
సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు         ||అనుదినం||

Lyricist: Joshua Kolli

Anudinam Aa Prabhuni Varame
Anukshanam Aascharya Kaaryame
Aanandam-tho Sweekarinchumu
Abburam-tho Aanandinchumu
Pachchika Gala Chotla Nannu Parundajesina Devudu (2)
Noonetho Naa Thalanu Anti Deevenalatho Nimpunu            ||Anudinam||

Anudinam Aa Prabhuni Varame
Anukshanam Aascharya Kaaryame
Aanandam-tho Sweekarinchumu
Abburam-tho Aanandinchumu
Thalliyainaa Marachunemo Maruvadu Prabhu Ennadu (2)
Mudimi Vachchu Varaku Nannu Etthukoni Kaapaadunu          ||Anudinam||

Anudinam Aa Prabhuni Varame
Anukshanam Aascharya Kaaryame
Aanandam-tho Sweekarinchumu
Abburam-tho Aanandinchumu
Naadu Paapapu Bhaaramella Mosenu Naa Devudu (2)
Siluvapai Maraninchi Naaku Rakshanichchenu Yesudu            ||Anudinam||

అనుదినము ప్రభుని స్తుతియించెదము / Anudinamu Prabhuni Sthuthiyinchedamu

పాట రచయిత: కే విల్సన్

అనుదినము ప్రభుని స్తుతియించెదము
అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను
అల్లుకుపోయేది ఆర్పజాలనిది
అలుపెరగనిది ప్రభు ప్రేమ        ||అనుదినము||

ప్రతి పాపమును పరిహరించి
శాశ్వత ప్రేమతో క్షమియించునది
నా అడుగులను సుస్థిరపరచి
ఉన్నత స్థలమున నింపునది       ||అల్లుకుపోయేది||

ప్రతి రేపటిలో తోడై నిలిచి
సిలువ నీడలో బ్రతికించినది
స్వర్గ ద్వారము చేరు వరకు
మాకు ఆశ్రయమిచ్చునది        ||అల్లుకుపోయేది||

Lyricist: K Wilson

Anudinamu Prabhuni Sthuthiyinchedamu
Anukshanamu Prabhuni Anantha Premanu
Allukupoyedi Aarpajaalanidi
Aluperaganidi Prabhu Prema (2)      ||Anudinamu||

Prathi Paapamunu Pariharinchi
Shaashwatha Prematho Kshamiyinchunadi
Naa Adugulanu Susthiraparachi
Unnatha Sthalamuna Nimpunadi (2)      ||Allukupoyedi||

Prathi Repatilo Thodai Nilichi
Siluva Needalo Brathikinchinadi
Swarga Dwaaramu Cheru Varaku
Maaku Aashrayamichchunadi (2)      ||Allukupoyedi||