ఎడబాయని నీదు కృప/Edabaayani Needu Krupa

పాట రచయిత: దీవెనయ్య

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2)
నన్నెంతగానో బలపరచెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)
నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)        ||ఎడబాయని||

కన్నీటి లోయలలో నుండి
నన్ను దాటించిన దేవా
సింహాల బోనులలో నుండి
నన్ను విడిపించిన ప్రభువా (2)       ||నన్ను బలపరచెను||

నేనున్నతమైన స్థితిలో
ఉండాలని ఆశించితివా
ఏ అర్హత నాకు లేకున్నా
నా కృప నీకు చాలునంటివే (2)       ||నన్ను బలపరచెను||

నేనెదుర్కొనలేని పరిస్థితులు
నా ఎదుట ఉన్నవి దేవా
నీ శక్తిని నేను కోరెదను
నన్ను విడిపించు నా దేవా (2)       ||నన్ను బలపరచెను||

Lyricist: Deevenaiah

Edabaayani Needu Krupa – Vidanaadani Nee Prema (2)
Nannenthagaano Balaparachenu
Nannenthagaano Sthiraparachenu (2)
Nannu Balaparachenu – Nannu Vembadinchenu
Nannenthagaano Sthiraparachenu (2)         ||Edabaayani||

Kanneeti Loyalalo Nundi
Nannu Daatinchina Devaa
Simhaala Bonulalo Nundi
Nannu Vidipinchina Prabhuvaa (2)       ||Nannu Balaparachenu||

Nenunnathamaina Sthithilo
Undaalani Aashinchithivaa
Ae Arhatha Naaku Lekunnaa
Naa Krupa Neeku Chaalunantive (2)       ||Nannu Balaparachenu||

Nenedurkonaleni Paristhithulu
Naa Yeduta Unnavi Devaa
Nee Shakthini Nenu Koredanu
Nannu Vidipinchu Naa Devaa (2)       ||Nannu Balaparachenu||

ఎడబాయని నీ కృప/Edabaayani Nee Krupa

పాట రచయిత: మాథ్యూస్

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2)      ||ఎడబాయని||

శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2)      ||ఎడబాయని||

విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2)      ||ఎడబాయని||

నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2)      ||ఎడబాయని||

Lyricist: Matthews

Edabaayani Nee Krupa
Nanu Viduvadu Ennatiki (2)
Yesayyaa Nee Premaanuraagam
Nanu Kaayunu Anukshanam (2)        ||Edabaayani||

Shokapu Loyalalo – Kashtaala Kadagandlalo
Kadaleni Kadalilo – Niraasha Nispruhalo (2)
Ardhame Kaani Ee Jeevitham
Ika Vyardhamani Nenanukonaga (2)
Krupaa Kanikaramugala Devaa
Naa Kashtaala Kadalini Daatinchithivi (2)        ||Edabaayani||

Vishwaasa Poraatamlo – Eduraaye Shodhanalu
Lokaashala Alajadilo – Sadalithi Vishwaasamulo (2)
Dushtula Kshemamune Choochi
Ika Neethi Vyardhamani Anukonaga (2)
Deerghashaanthamugala Devaa
Naa Cheyi Viduvaka Nadipinchithivi (2)        ||Edabaayani||

Nee Sevalo Eduraina – Enno Samasyalalo
Naa Balamunu Choochukoni – Niraasha Chendithini (2)
Bhaaramaina Ee Sevanu
Ika Cheyalenani Anukonaga (2)
Pradhaana Yaajakudaa Yesu
Nee Anubhavaalatho Balaparachithivi (2)        ||Edabaayani||

శోధనా బాధలు/Shodhanaa Baadhalu

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా
సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2)       ||శోధనా||

నడవలేక నా పడవ నది సముద్రమందున
నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2)
చూచెనే యేసు చెంతకు చేరెనే (2)
ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2)       ||శోధనా||

పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా
పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2)
చూచెనే యేసు చేయి చాచెనే (2)
లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2)       ||శోధనా||

Shodhanaa Baadhalu Chuttinaa Nannu Muttinaa
Saagipovute Naaku Naa Yesu Nerpene – (2)         ||Shodhanaa||

Naduvaleka Naa Padava Nadi Samudramanduna
Naduputa Naa Valla Kaaka Nenedusthundagaa (2)
Choochene Yesu Chenthaku Cherene (2)
Aayanundi Naa Padava Aa Dariki Cherchene (2)         ||Shodhanaa||

Paapamane Donga Yoobhi Padipovuchundagaa
Paiki Theeyuvaadu Leka Munigi Povuchundagaa (2)
Choochene Yesu Cheyi Chaachene (2)
Levanetthi Shuddhi Chesi Thana Bandapai Nilipene (2)         ||Shodhanaa||

శ్రేష్టమైన నామం/Shreshtamaina Naamam

శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం – స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం (2)          ||శ్రేష్టమైన||

త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం
దుష్ట శక్తులు బంధకములు తొలగించే
తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2)          ||శ్రేష్టమైన||

జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం
భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2)           ||శ్రేష్టమైన||

Shreshtamaina Naamam – Shakthi Galigina Naamam
Junti Thene Dhaarala Kannaa Madhuramaina Naamam
Saatileni Naamam – Swasthaparache Naamam
Anni Naamamula Kannaa Nithyamaina Naamam
Yesu Naamam Madhura Naamam
Yesu Naamam Sumadhura Naamam (2)         ||Shreshtamaina||

Throva Choopi Sariyaina Daarilo Nannu Nadipinche Naamam
Dushta Shakthulu Bandhakamulu Tholaginche
Tharamulenno Maarinaa Manujulanthaa Maarinaa (2)
Maarani Naamam Mahima Naamam
Maranamu Gelchina Shree Yesu Naamam (2)        ||Shreshtamaina||

Jeevithamanthaa Jeevanamanthaa Smarinchagalige Naamam
Kalavaramu Nanu Ventaadinanu Dhairyamunichche Prabhu Naamam
Bhaaramentho Unnanu Shaanthinosage Divya Naamam (2)
Maarani Naamam Mahima Naamam
Maranamu Gelchina Shree Yesu Naamam (2)         ||Shreshtamaina||

శృతిచేసి నే పాడనా/Shruthi Chesi Nee Paadanaa

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామీ (2)
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2)      ||శృతిచేసి||

దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా (3)          ||హల్లేలూయా||

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా (2)
నీవెకదా (3)          ||హల్లేలూయా||

Shruthi Chesi Nee Paadanaa Sthothra Geetham
Bhajiyinchi Ne Pogadanaa Swaamee (2)
Shruthi Chesi Nee Paadanaa Sthothra Geetham
Hallelooyaa Hallelooyaa
Hallelooya Hallelooya Hallelooyaa (2)        ||Shruthi||

Daaniyelunu Simhapu Bonulo
Kaapaadinadi Neeve Kadaa (2)
Jala Pralayamulo Novaahunu Gaachina
Balavanthudavu Neeve Kadaa (2)
Neeve Kadaa (3)          ||Hallelooyaa||

Samaraya Sthreeni Karunatho Brochina
Sathya Hithudavu Neeve Kadaa (2)
Paapula Korakai Praanamunichchina
Karunaamayudavu Neeve Kadaa (2)
Neeve Kadaa (3)          ||Hallelooyaa||

శుద్ధ రాత్రి/Shudhdha Raathri

శుద్ధ రాత్రి! సద్ధణంగా
నందరు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనగా
బరిశుద్దుడౌ బాలకుడా!
దివ్య నిద్ర పొమ్మా
దివ్య నిద్ర పొమ్మా

శుద్ధ రాత్రి! సద్ధణంగా
దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకు దెలిపెను
ఎందు కిట్టులు పాడెదరు?
క్రీస్తు జన్మించెను
క్రీస్తు జన్మించెను

శుద్ధ రాత్రి! సద్ధణంగా
దేవుని కొమరుడ
నీ ముఖంబున బ్రేమలొల్కు
నేడు రక్షణ మాకు వచ్చె
నీవు పుట్టుటచే
నీవు పుట్టుటచే

Shudhdha Raathri! Sadhdhananga
Nandaru Nidrapova
Shudhdha Dampathul Melkonagaa
Barishudhdhudou Baalakudaa!
Divya Nidra Pommaa
Divya Nidra Pommaa

Shudhdha Raathri! Sadhdhananga
Doothala Hallelooya
Gollavaandraku Delipenu
Endu Kittulu Paadedaru?
Kreesthu Janminchenu
Kreesthu Janminchenu

Shudhdha Raathri! Sadhdhananga
Devuni Komaruda
Nee Mukhambuna Bremalolku
Nedu Rakshana Maaku Vachche
Neevu Puttutache
Neevu Puttutache

శిలనైన నన్ను/Shilanaina Nannu

శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేసావు (2)
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

మోడుబారిన నా జీవితం
నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
వర్ణించలేను లెక్కించలేను (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

ఏ విలువలేని అభాగ్యుడను నేను
నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)
నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
నీ కొరకే నేను జీవింతు ఇలలో (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

ఊహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

Shilanaina Nannu Shilpivai Maarchaavu
Naaloni Aashalu Vistharimpa Chesaavu (2)
Nee Prema Naapai Kummarinchuchunnaavu (2)
Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2)     ||Shilanaina||

Modubaarina Naa Jeevitham
Nee Premathone Chigurimpa Chesaavu (2)
Nee Premaabhishekam Naa Jeevitha Gamyam (2)
Varninchalenu Lekkinchalenu (2)
Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2)     ||Shilanaina||

Ae Viluvaleni Abhaagyudanu Nenu
Nee Prema Choopi Viluvanichchi Konnaavu (2)
Naa Yedala Neekunna Thalampulu Visthaaram (2)
Nee Korake Nenu Jeevinthu Ilalo (2)
Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2)     ||Shilanaina||

Oohinchalenu Nee Prema Madhuram
Naa Premamoorthy Neeke Naa Vandhanam (2)
Nee Preme Naakaadhaaram – Naa Jeevitha Lakshyam (2)
Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2)     ||Shilanaina||

శాశ్వతమైనది/Shaashwathamainadi

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప        ||శాశ్వతమైనది||

నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)       ||శాశ్వత||

తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2)       ||శాశ్వత||

పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2)       ||శాశ్వత||

Shaashwathamainadi Neevu Naa Yeda Choopina Krupa
Anukshanam Nanu Kanupaapa Vale (2)
Kaachina Krupa           ||Shaashwathamainadi||

Neeku Bahu Dooramaina Nannu Chera Deesina Naa Thandrivi (2)
Nithya Sukha Shaanthiye Naaku Needu Kougililo (2)        ||Shaashwatha||

Thalli Thana Biddalanu Marachinaa Nenu Maruvalenantive (2)
Needu Mukhs Kaanthiye Nannu Aadarinchenule (2)        ||Shaashwatha||

Parvathamulu Tholaginanu Mettalu Thattharillina (2)
Naa Krupa Ninu Veedadani Abhayamichchithive (2)        ||Shaashwatha||

శాశ్వతమైన ప్రేమతో/Shaashwathamaina Prematho

శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా
నీ ప్రేమే నను గెల్చెను
విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా
నీ కృపయే నను మార్చెను
నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం
నీ ప్రేమ తేనె కంటే మధురము
నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా
నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను వెంబడింతును
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను ఆరాధింతును           ||శాశ్వతమైన||

నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా
దృష్టించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే
గ్రంధములో లిఖియించిన ప్రేమ
నా ఎముకలను నా అవయములను
వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు
నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నీ కోసం సృజియించావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను మురిపెంగా లాలించావయ్యా            ||శాశ్వతమైన||

నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు
నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు
నా కోసం వేచిచూచిన ప్రేమ
బాల్య దినముల నుండి నను సంరక్షించి
కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యవ్వన కాలమున కృపతో నను కలిసి
సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నను దర్శించినావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను ప్రత్యేకపరిచావేసయ్యా            ||శాశ్వతమైన||

నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ
తన సొత్తుగా చేసుకున్న ప్రేమ
విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి
నా విలువని పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి చులకన చేసినను
తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ
ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా
నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ
నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ
యేసయ్యా… యేసయ్యా…
నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…
నను నీలా మార్చేందులకేనయ్యా           ||శాశ్వతమైన||

పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు
కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ
నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి
తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ
నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా
షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ
తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నను మరలా సమకూర్చావేసయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా           ||శాశ్వతమైన||

కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన
నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో
తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ
లోకమే మారిననూ మనుషులే మరచిననూ
మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి
ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నా విశ్వాసం కాపాడవయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
బంగారంలా మెరిపించావయ్యా            ||శాశ్వతమైన||

ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి
నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని
అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ
శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే
సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
శాశ్వత జీవం నాకిచ్చావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను చిరకాలం ప్రేమిస్తావయ్యా        ||శాశ్వతమైన||

Shaashwathamaina Prematho Nanu Preminchaavayyaa
Nee Preme Nanu Gelchenu
Viduvaka Nee Krupa Naa Yeda Kuripinchinaavayya
Nee Krupaye Nanu Maarchenu
Nee Prema Unnatham – Nee Prema Amrutham
Nee Prema Thene Kante Madhuramu
Nee Prema Lothulo – Nanu Nadupu Yesayyaa
Nee Premalona Ne Veru Paari Neekai Jeevinchanaa
Prematho… Prematho…
Yesayyaa Ninu Vembadinthunu
Prematho… Prematho… Prematho…
Yesayyaa Ninu Aaraadhinthunu          ||Shaashwathamaina||

Naa Thalli Garbhamunandu Ne Pindamunayyundangaa
Drushtinchi Nirminchina Prema
Naa Dinamulalo Okataina Aarambhamu Kaakamunupe
Grandhamulo Likhiyinchina Prema
Naa Emukalanu Naa Avayamulanu
Vinthagaa Ediginchi Roopinchina Prema
Thalli Odilo Nenu Paalu Thraaguchunnappudu
Nammikanu Naalona Puttinchina Prema
Thana Sontha Polika Roopulona Nanu Srushtinchina Prema
Prematho… Prematho…
Nee Kosam Srujiyinchaavayyaa
Prematho… Prematho… Prematho…
Nanu Muripemgaa Laalinchaavayyaa        ||Shaashwathamaina||

Ne Prabhuvunu Erugaka Yundi Agnaanamulo Unnappudu
Nanu Viduvaka Ventaadina Prema
Naa Srushtikarthanu Goorchi Smarane Naalo Lenappudu
Naa Kosam Vechichoochina Prema
Baalya Dinamula Nundi Nanu Samrakshinchi
Kanti Reppalaa Nannu Kaapaadina Prema
Yavvana Kaalamuna Krupatho Nanu Kalisi
Sathyamunu Bodhinchi Veliginchina Prema
Ne Vedakakunnanu Naaku Doriki Nanu Brathikinchina Prema
Prematho… Prematho…
Yesayyaa Nanu Darshinchinaavayyaa
Prematho… Prematho… Prematho…
Nanu Prathyekaparichaavesayyaa         ||Shaashwathamaina||

Ne Paapinai Yundagaane Naakai Maraninchina Prema
Thana Sotthugaa Chesukunna Prema
Viluve Lenatti Naakai Thana Praanapu Viluvani Chellinchi
Naa Viluvani Penchesina Prema
Lokame Nanu Goorchi Chulakana Chesinanu
Thana Drushtilo Nenu Ghanudanna Prema
Evaru Lekunnaa Nenu Neeku Sariponaa
Neevu Bahu Priyudavani Balaparachina Prema
Naa Muddu Bidda Nuvvantu Nannu Thega Muddaadina Prema
Yesayyaa… Yesayyaa…
Naapai Intha Prema Entayyaa
Yesayyaa… Yesayyaa… Yesayyaa…
Nanu Neelaa Maarchendulakenayyaa           ||Shaashwathamaina||

Palu Maarlu Ne Padinappudu Bahu Chikkulalonunnappudu
Karuninchi Paiki Lepina Prema
Nene Ninu Chesaanantu Nene Bhariyisthaanantu
Nanu Chankana Etthukunna Prema
Naa Thappatadugulanu Thappakunda Sari Chesi
Thappulanu Maanpinchi Sthiraparachina Prema
Nannu Batti Maaradugaa Nannu Cheradeesenugaa
Sharathule Lenatti Naa Thandri Prema
Thanakishtamaina Ghanamaina Paathragaa Nanu Malachina Prema
Prematho… Prematho…
Nanu Maralaa Samakoorchaavesayyaa
Prematho… Prematho… Prematho…
Nee Saakshyamgaa Nilabettaavayyaa          ||Shaashwathamaina||

Kashtaala Kolumullona Kanneeti Loyallona
Naa Thodai Dhairyaparachina Prema
Chelaregina Thuphaanulalo Edathegani Poraatamlo
Thana Maatatho Shaanthinichchina Prema
Lokame Maarinanu Manushule Marachinanu
Maruvane Maruvadugaa Naa Yesu Prema
Thallilaa Preminchi Thandrilaa Bodhinchi
Aalochana Cheppi Vidipinchina Prema
Kshanamaathramaina Nanu Veediponi Vaathsalyatha Gala Prema
Prematho… Prematho…
Naa Vishwaasam Kaapaadavayyaa
Prematho… Prematho… Prematho…
Bangaaramlaa Meripinchaavayyaa           ||Shaashwathamaina||

Oohinchalenatuvanti Krupalani Naapai Kuripinchi
Naa Sthithi Gathi Maarchivesina Prema
Naa Sontha Shakthitho Nenu Ennadunu Pondagaleni
Andalamunu Ekkinchina Prema
Pakshi Raaju Rekkalapai Nithyamu Nanu Mosthu
Shikharamupai Nannu Nadipinchu Prema
Parvathaalapai Eppudu Kreesthu Vaartha Chaatinche
Sundarapu Paadamulu Naakichchina Prema
Thana Raayabhaarigaa Nannu Unchina Yese Ee Prema
Prematho… Prematho…
Shaashwatha Jeevam Naakichchaavayyaa
Prematho… Prematho… Prematho…
Nanu Chirakaalam Premisthaavayyaa        ||Shaashwathamaina||

శాశ్వత ప్రేమతో/Shaashwtha Prematho

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృప చూపి నన్ను రక్షించవయ్యా (2)
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)

అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2)        ||నీ ప్రేమ||

అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2)        ||నీ ప్రేమ||

తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి (2)        ||నీ ప్రేమ||

నడుచుచున్న మర్గమంత యోచించగా
కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2)        ||నీ ప్రేమ||

ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
సమస్తము మేలుకై చేసిన దేవా (2)        ||నీ ప్రేమ||

Shaashwtha Prematho Nannu Preminchaavayyaa
Krupa Choopi Nannu Rakshinchaavayyaa (2)
Nee Prema Goppadi – Nee Jaali Goppadi
Nee Krupaa Goppadi – Naa Daya Goppadi (2)

Anaathanainaa Nannu Vedaki Vachchaavu
Aadarinchi Kougilinchi Hatthukontivi (2)        ||Nee Prema||

Asthiramaina Lokamulo Thirigithinayyaa
Saatileni Yesayya Cherchukontivi (2)        ||Nee Prema||

Thalli Garbhamandu Nannu Choochiyuntivi
Thallilaa Aadarinchi Nadipincthivi (2)        ||Nee Prema||

Naduchuchunna Maargamantha Yochinchagaa
Kaneetitho Vandanamulu Thelupudunayyaa (2)        ||Nee Prema||

Prabhuvu Cheyavalasinadi Aatankam Ledu
Samasthamu Melukai Chesina Devaa (2)        ||Nee Prema||