ఎవరు చూపించలేని/Evaru Choopinchaleni

పాట రచయిత: జాషువా షేక్

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా       ||ఎవరు||

తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా       ||ఎవరు||

ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా       ||ఎవరు||

Lyricist: Joshua Shaik

Evaru Choopinchaleni – Ilalo Nanu Veediponi
Enthati Prema Needi – Inthagaa Korukundi – Maruvanu Yesayyaa (2)
Nee Kathe Nanne Thaakagaa – Naa Madhe Ninne Cheragaa
Naa Gure Neevai Yundagaa – Nee Dhare Ne Cheraanugaa          ||Evaru||

Theeraale Dooramaaye – Kaalaale Maaripoye
Eduraina Endamaave – Kanneeti Kaanukaaye
Naa Gunde Lothulona – Ne Naligipothuvunnaa
Ae Daari Kaanaraaka – Nee Koraku Vechi Unnaa
Edabaatu Leni Gamanaana – Ninu Cherukunna Samayaana
Nanu Aadarinche Ghana Prema – Apuroopamaina Tholi Prema
Ekamai Thodugaa – Oopire Neevugaa
Evvaru Lerugaa – Yesayyaa Neevegaa          ||Evaru||

Ee Loka Jeevithaana – Vesaaripothuvunnaa
Viluvaina Needu Vaakyam – Veliginche Naa Praanam
Nee Sannidhaanamandu – Seeyonu Maargamandu
Nee Divya Sevalone – Nadipinche Naa Prabhu
Nee Thoti Saagu Payanaana – Nanu Veedaledu Kshanamaina
Nee Swaramu Chaalu Udayaana – Ninu Vembadinchu Tharunaana
Shaashwatha Prematho – Sathya Vaakyambutho
Nithyamu Thodugaa – Niliche Naa Yesayyaa          ||Evaru||

ఎలోహిం ఎలోహిం/Elohim Elohim

పాట రచయిత: అంశుమతి మేరీ

హోలీ హోలీ హోలీ
హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ
హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2)

ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2)
శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము
సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం
అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2)
నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు
నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్
పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2)
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

అడోనై అడోనై అడోనై అడోనై
ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2)
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

యావే యావే యావే యావే
యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2)
పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు
ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

Lyricist: Amshumathi Mary

Holy Holy Holy
He is the Lord God Almighty
Who was and is and is to come (2)

Elohim Elohim Elohim Elohim
Balamaina Devudavu – Balavanthudavu Neevu – (2)
Shoonyamulo Samasthamunu – Niraakaamulo Aakaaramu
Srujiyinchinaavu Neevu – Sarva Srushtikarthavu Neevu – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

El Olam El Olam El Olam El Olam
Alphaa Omegavu – Nithyudaina Devudavu – (2)
Nithya Nibandhana Chesaavu – Nibandhanani Sthiraparachaavu
Ninnaa Nedu Repu – Maarani Devudavu Neevu – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

El Shaddai El Shaddai El Shaddai El Shaddai
Poshinchu Devudavu – Aashraya Durgamu Neevu – (2)
Rekkalapai Mosedi Vaadaa – Rakshana Shrungamu Neevegaa
Nee Maatuna Daache Devaa – Maatanu Neraverche Devaa – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

Adonai Adonai Adonai Adonai
Prabhuvaina Devudavu – Prabhuvulaku Prabhuvu Neevu – (2)
Sarvaadhikaarivi Neevu – Sakala Janulaku Prabhuvu Neevu
Neeve Naaku Prabhuvu – Neeve Naa Yajamaanudavu – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

Yaahwe Yaahwe Yaahwe Yaahwe
Yehovaa Devaa – Sainyamulaku Adhipathivi – (2)
Parishuddha Devudavu Neevu – Unnavaadanani Annaavu
Prabhu Yesunu Pampina Devaa – Paapamu Tholaginchina Devaa – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

ఎలా మరువగలనయ్యా/Elaa Maruvagalanayyaa

పాట రచయిత: డేవిడ్ రాజ్ రాయ్

ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా విడువగలనయ్యా నీ సేవను (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)       ||ఎలా మరువగలనయ్యా||

ఆత్మీయులే నన్ను ఆదరించలేదు
ప్రేమించువారే ప్రేమించలేదు (2)
ఆదరించావు ప్రేమించావు (2)
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2)       ||ఎలా మరువగలనయ్యా||

బంధువులే నన్ను ద్వేషించినారు
సొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2)
చేరదీసావు సేదదీర్చావు (2)
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2)       ||ఎలా మరువగలనయ్యా||

అనాథగా నేను తిరుగుచున్నప్పుడు
ఆకలితో నేను అలమటించినప్పుడు (2)
ఆదరించావు ఆకలి తీర్చావు (2)
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2)       ||ఎలా మరువగలనయ్యా||

Lyricist: David Raj Roy

Elaa cNee Premanu
Ela Viduvagalanayyaa Nee Sevanu (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)       ||Elaa Maruvagalanayyaa||

Aathmeeyule Nannu Aadarinchaledu
Preminchuvaare Preminchaledu (2)
Aadarinchaavu Preminchaavu (2)
Anni Velalaa Naaku Thodu Neevayyaavu (2)       ||Elaa Maruvagalanayyaa||

Bandhuvule Nannu Dveshinchinaaru
Sontha Thallidandrule Velivesinaaru (2)
Cheradeesaavu Sedadeerchaavu (2)
Anni Velalaa Naaku Thodu Neevayyaavu (2)       ||Elaa Maruvagalanayyaa||

Anaathagaa Nenu Thiruguchunnappudu
Aakalitho Nenu Alamatinchinappudu (2)
Aadarinchaavu Aakali Theerchaavu (2)
Anni Velalaa Naaku Thodu Neevayyaavu (2)       ||Elaa Maruvagalanayyaa||

ఎల్లవేళలందు/Ella Velalandu

పాట రచయిత: సీయోను గీతాలు

ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్‌ (2)

విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే (2)        ||ఎల్లవేళలందు||

సృష్టికర్తవు – సహాయము నీవే
ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2)        ||ఎల్లవేళలందు||

జ్ఞానము నీవే – నా పానము నీవే
దానము నీవే – నా గానము నీవే (2)        ||ఎల్లవేళలందు||

జ్యోతివి నీవే – నా నీతివి నీవే
ఆదియు నీవే – నా అంతము నీవే (2)        ||ఎల్లవేళలందు||

నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2)        ||ఎల్లవేళలందు||

జీవము నీవే – నా దేవుడవు నీవే
పావన నీవే – నా కావలి నీవే (2)        ||ఎల్లవేళలందు||

కాంతియు నీవే – నా శాంతియు నీవే
సంతస నీవే – నాకంతయు నీవే (2)        ||ఎల్లవేళలందు||


Lyricist: Songs of Zion

Ella Velalandu – Kashta Kaalamandu
Vallabhundaa Yesun Sthuthinthun
Ellanu Neeve Naa Kelledala
Vallapadade Vivarimpan (2)

Vimochakudaa – Vimochana Neeve
Rakshakudavu – Naa Rakshana Neeve (2)        ||Ellavelalandu||

Srushtikarthavu – Sahaayamu Neeve
Ishtuda Neevu – Thrithvamu Neeve (2)        ||Ellavelalandu||

Gnaanamu Neeve – Naa Paanamu Neeve
Daanamu Neeve – Naa Gaanamu Neeve (2)        ||Ellavelalandu||

Jyothivi Neeve – Naa Neethivi Neeve
Aadiyu Neeve – Naa Anthamu Neeve (2)        ||Ellavelalandu||

Nithyuda Neeve – Naa Sathyunda Neeve
Sthothramu Neeve – Naa Nethramu Neeve (2)        ||Ellavelalandu||

Jeevamu Neeve – Naa Devudavu Neeve
Paavana Neeve – Naa Kaavali Neeve (2)        ||Ellavelalandu||

Kaanthiyu Neeve – Naa Shaanthiyu Neeve
Santhasa Neeve – Naakanthayu Neeve (2)        ||Ellavelalandu||

ఎల్లలు లేనిది/Ellalu Lenidi

పాట రచయిత: జాన్ వెస్లీ

ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
అవధులు లేనిది – యేసుని ప్రేమ
నిశ్చలమైనది ఎన్నడు మారనిది
మాటే తప్పనిది – యేసుని ప్రేమ
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. నా యేసు ప్రేమా (2)         ||ఎల్లలు||

జీవిత యాత్రలో నీ కలలో చెదరినా
జీవన పయనంలో అందరు విడచినా (2)
విడువనిది మరువనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా          ||ఎల్లలు||

కల్వరి పయనంలో రక్తపు ధరలు
దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2)
తరగనిది చెదరనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా         ||ఎల్లలు||

Lyricist: John Wesley

Ellalu Lenidi Sarihaddulu Lenidi
Avadhulu Lenidi – Yesuni Prema
Nischalamainadi Ennadu Maaranidi
Maate Thappanidi – Yesuni Prema
Premaa.. Yesuni Premaa
Premaa.. Naa Yesu Premaa (2)       ||Ellalu||

Jeevitha Yaathralo Nee Kalalo Chedarinaa
Jeevana Payanamlo Andaru Vidachinaa (2)
Viduvanidi Maruvanidi (2)
Yesuni Prema.. Shree Yesuni Prema (2)
Premaa.. Yesuni Premaa
Premaa.. Kalvari Premaa         ||Ellalu||

Kalvari Payanamlo Rakthapu Dhaaralu
Devuni Premaku Rujuve Nesthamaa (2)
Tharaganidi Chedaranidi (2)
Yesuni Prema.. Shree Yesuni Prema (2)
Premaa.. Yesuni Premaa
Premaa.. Kalvari Premaa         ||Ellalu||

ఎరుగనయ్యా నిన్నెప్పుడు/Eruganayyaa Ninneppudu

పాట రచయిత: రాజబాబు

ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2)
నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||

నీ ప్రేమ శాశ్వతమేగా (2)
నీ కరుణ సాగరమేగా (2)
నిను కొలువ భాగ్యమే కదా (2)
నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||

నీ పలుకే తీర్చునాకలి (2)
నీ స్మరణము కూర్చు బలిమిని (2)
నీ బ్రతుకే వెలుగు బాట (2)
నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||

వలదయ్యా లోక భ్రాంతి (2)
కడు భారము ఘోర వ్యాధి (2)
నిను చేరిన నాకు మేలు (2)
నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||

Lyricist: Rajababu

Eruganayyaa Ninneppudu (2)
Nanu Vedhakuchuntivaa.. O Prabhuvaa (2)      ||Eruganayyaa||

Nee Prema Shaashwathamegaa (2)
Nee Karuna Saagaramegaa (2)
Ninu Koluva Bhaagyame Kadaa (2)
Nanu Piluva Vachchina.. O Prabhuva (2)      ||Eruganayyaa||

Nee Paluke Theerchunaakali (2)
Nee Smaranamu Koorchu Balimini (2)
Nee Brathuke Velugu Baata (2)
Nanu Koluva Vachchina.. O Prabhuvaa (2)      ||Eruganayyaa||

Valadayyaa Loka Bhraanthi (2)
Kadu Bhaaramu Ghora Vyaadhi (2)
Ninu Cherina Naaku Melu (2)
Nee Rakshana Chaalu Chaalu.. Naa Prabhuvaa (2)      ||Eruganayyaa||

ఎన్నిక లేని నాపై/Ennika Leni Naapai

పాట రచయిత: శోభా రాణి

ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు
ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2)
నీకే నీకే నీకే పాదాభివందనము
నీకే నీకే నీకే స్తోత్రాభివందనము       ||ఎన్నిక||

బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు
ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను (2)        ||నీకే||

పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు
ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను (2)        ||నీకే||

Lyricist: Shobha Rani

Ennika Leni Naapai Entha Krupa Choopinaavu
Ellalu Leni Prema Eda Nindaa Nimpinaavu (2)
Neeke Neeke Neeke Paadaabhivandanamu
Neeke Neeke Neeke Sthothraabhivandanamu       ||Ennika||

Baadhala Nundi Bandhakamu Nundi Nanu Vimochinchinaavu
Ennadu Tharagani Aanandam Naaku Dayachesinaavu (2)
Emichchi Nee Runamu Ne Theerchanu
Ae Reethi Ninu Nenu Sevinchanu (2)      ||Neeke||

Paapamu Nundi Maranamu Nundi Nannu Thappinchinaavu
Evvaru Choopani Mamakaaram Naaku Ruchi Choopinaavu (2)
Emichchi Nee Runamu Ne Theerchanu
Ae Reethi Ninu Nenu Sevinchanu (2)      ||Neeke||

ఎన్ని తరములు స్తుతియించినా/Enni Tharamulu Sthuthiyinchinaa

ఎన్ని తరములు స్తుతియించినా (2)
తీరునా నీ ఋణం (4)
నా ప్రాణము – నా జీవము (2)
నీవే నా యేసయ్యా
నీవే నా మెస్సయ్యా      ||ఎన్ని||

కరిగిపోని కన్నీరెంతో
కుమ్మరించాను – కుమ్మరించాను (2)
కరుణామయుడా కన్నులు తుడిచి (2)
(నీ) కృపను చూపావు – కృపను చూపావు (2)      ||నా ప్రాణము||

పాపములోనే పుట్టిన వారిని
పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి (2)
పరమ తండ్రి పవిత్రతతోనే (2)
(నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు (2)      ||నా ప్రాణము||

Enni Tharamulu Sthuthiyinchinaa (2)
Theerunaa Nee Runam (4)
Naa Praanamu – Naa Jeevamu (2)
Neeve Naa Yesayyaa
Neeve Naa Messayyaa         ||Enni||

Karigiponi Kanneerentho
Kummarinchaanu – Kummarinchaanu (2)
Karunaamayudaa Kannulu Thudichi (2)
(Nee) Krupanu Choopaavu – Krupanu Choopaavu (2)     ||Naa Praanamu||

Paapamulone Puttina Vaarini
Parishuddhaparachithivi – Parishuddhaparachithivi (2)
Parama Thandri Pavithrathathone (2)
(Nee) Paramuna Cherchedavu – Paramuna Cherchedavu (2)     ||Naa Praanamu||

ఎనలేని ప్రేమ/Enaleni Prema

పాట రచయిత: ఆరోన్ జెషూరున్

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నీ వారసునిగ చేసినావు (2)
నీ ప్రేమ నేను చాటెదన్
నా సర్వం నీవే యేసయ్యా (2)

నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)
నీ కృప చేత రక్షించినావే
నీ ఋణము నే తీర్చగలనా (2)         ||ఎనలేని||

తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)
కన్నీరు తుడచి నన్నాదరించిన
ఆ జాలి నే మరువగలనా (2)       ||ఎనలేని||

Lyricist: Aaron Jeshurun

Enaleni Prema Naapaina Choopi
Nee Vaarasuniga Chesinaavu (2)
Nee Prema Nenu Chaatedan
Naa Sarvam Neeve Yesayyaa (2)

Naa Shikshaku Prathigaa – Praanamu Pettina Devaa
Nee Sathya Maargamulo – Nanu Nadipina Prabhuvaa (2)
Nee Krupa Chetha Rakshinchinaave
Nee Runamu Ne Theerchagalanaa (2)           ||Enaleni||

Thandri Leni Naaku – Parama Thandrivi Neevai
Ontarinaiyunna Naatho – Nenunnaanani Annaavu (2)
Kanneeru Thudachi Nannaadarinchina
Aa Jaali Ne Maruvagalanaa (2)          ||Enaleni||

ఎనలేని ప్రేమ నాపైన చూపి/Enaleni Prema Naapaina Choopi

పాట రచయిత: ఆరోన్ జెషూరున్

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నీ వారసునిగ చేసినావు (2)
నీ ప్రేమ నేను చాటెదన్
నా సర్వం నీవే యేసయ్యా (2)

నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)
నీ కృప చేత రక్షించినావే
నీ ఋణము నే తీర్చగలనా (2)         ||ఎనలేని||

తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)
కన్నీరు తుడచి నన్నాదరించిన
ఆ జాలి నే మరువగలనా (2)       ||ఎనలేని||

Lyricist: Aaron Jeshurun

Enaleni Prema Naapaina Choopi
Nee Vaarasuniga Chesinaavu (2)
Nee Prema Nenu Chaatedan
Naa Sarvam Neeve Yesayyaa (2)

Naa Shikshaku Prathigaa – Praanamu Pettina Devaa
Nee Sathya Maargamulo – Nanu Nadipina Prabhuvaa (2)
Nee Krupa Chetha Rakshinchinaave
Nee Runamu Ne Theerchagalanaa (2)           ||Enaleni||

Thandri Leni Naaku – Parama Thandrivi Neevai
Ontarinaiyunna Naatho – Nenunnaanani Annaavu (2)
Kanneeru Thudachi Nannaadarinchina
Aa Jaali Ne Maruvagalanaa (2)          ||Enaleni||