గాయాములన్ గాయములన్ / Gaayaamulan Gaayamulan

గాయాములన్ గాయములన్
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2)
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు

సురూపమైన సొగసైనా లేదు
దుఃఖ భరితుడాయెను (2)
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్
వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2)       ||గాయాములన్||

మా అతిక్రమ క్రియలను బట్టి
మరి నలుగ గొట్టబడెను (2)
తాను పొందిన దెబ్బల ద్వారా
స్వస్థత కలిగె మనకు (2)       ||గాయాములన్||

క్రీస్తు ప్రేమను మరువజాలము
ఎంతో ప్రేమించే మనల (2)
సిలువపై మేము గమనించ మాకు
విలువైన విడుదల కలిగె (2)       ||గాయాములన్||

Gaayaamulan Gaayamulan
Naa Korakai Pondenu Kreesthu Prabhu (2)
Naa Korakai Pondenu Kreesthu Prabhu

Suroopamaina Sogasainaa Ledu
Dukha Bharithudaayenu (2)
Vyaadhigrasthudigaa Vyaakulamonden
Veekshinchi Thrippiri Mukhamul (2)        ||Gaayaamulan||

Maa Athikrama Kriyalanu Batti
Mari Naluga Gottabadenu (2)
Thaanu Pondina Debbala Dwaaraa
Swasthatha Kalige Manaku (2)        ||Gaayaamulan||

Kreesthu Premanu Maruvajaalamu
Entho Preminche Manala (2)
Siluvapai Memu Gamanincha Maaku
Viluvaina Vidudala Kalige (2)        ||Gaayaamulan||

హల్లెలుయా పాడెదా / Hallelujah Paadedaa

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్          ||హల్లెలుయా||

వాగ్ధానములనిచ్చి
నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా
నన్ను కాపాడువాడవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా||

ఎందరు నిను చూచిరో
వారికి వెలుగు కల్గెన్ (2)
ప్రభువా నీ వెలుగొందితిన్
నా జీవంపు జ్యోతివి నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా||

కష్టములన్నింటిని
ప్రియముగా భరియింతును (2)
నీ కొరకే జీవింతును
నా జీవంపు దాతవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా||

Hallelujah Paadedaa Prabhu Ninnu Koniyaadedan (2)
Anni Velalayandunaa Ninnu Poojinchi Keerthinthunu (2)
Prabhuvaa Ninnu Ne Koniyaadedan         ||Hallelujah||

Vaagdhaanamulanichchi
Neraverchuvaadavu Neeve (2)
Nammakamaina Devaa
Nannu Kaapaaduvaadavu Neeve (2)
Prabhuvaa Ninnu Ne Koniyaadedan          ||Hallelujah||

Endaru Ninu Choochiro
Vaariki Velugu Kalgen (2)
Prabhuvaa Nee Velugondithin
Naa Jeevampu Jyothivi Neeve (2)
Prabhuvaa Ninnu Ne Koniyaadedan              ||Hallelujah||

Kashtamulannintini
Priyamuga Bhariyinthunu (2)
Nee Korake Jeevinthunu
Naa Jeevampu Daathavu Neeve (2)
Prabhuvaa Ninnu Ne Koniyaadedan               ||Hallelujah||

హే ప్రభుయేసు / Hey Prabhu Yesu

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా       ||హే ప్రభు||

శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ         ||సిల్వధరా||

తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా        ||సిల్వధరా||

మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా       ||సిల్వధరా||

పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా       ||సిల్వధరా||

కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా        ||సిల్వ ధరా||

దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా        ||సిల్వ ధరా||

పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా        ||సిల్వ ధరా||

ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా        ||సిల్వ ధరా||

కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా           ||సిల్వ ధరా||

Hey Prabhu Yesu – Hey Prabhu Yesu – Hey Prabhu Deva Suthaa
Silva Dharaa, Paapa Haraa, Shaanthi Karaa      ||Hey Prabhu||

Shaanthi Samaadhaanaadhipathi
Swaanthamulo Prashaantha Nidhi (2)
Shaanthi Swaroopaa, Jeevana Deepaa (2)
Shaanthi Suvaartha Nidhi         ||Silva Dharaa||

Thapamulu Tharachina Ninne Gadaa
Japamulu Golichina Ninne Gadaa (2)
Viphalulu Jesina Vignaapanalaku (2)
Saphalatha Neeve Gadaa         ||Silva Dharaa||

Mathamulu Vedakina Ninne Gadaa
Vrathamulu Gorina Ninne Gadaa (2)
Pathithulu Devuni Suthulani Nerpina (2)
Hithamathi Veeve Gadaa         ||Silva Dharaa||

Palukulalo Nee Shaanthi Katha
Tholakari Vaanaga Gurise Gadaa (2)
Malamala Maadina Maanava Hrudayamu (2)
Kalakalalaade Kadaa         ||Silva Dharaa||

Kaananathulya Samaajamulo
Heenatha Jendenu Maanavatha (2)
Maanava Maithrini Silva Pathaakamu (2)
Daanamu Jesegadaa         ||Silva Dharaa||

Devuni Baasina Lokamulo
Chaavuye Kaapuramunde Gadaa (2)
Devunitho Sakhyambunu Jagathiki (2)
Yeevi Nidithivi Gadaa         ||Silva Dharaa||

Paapamu Chesina Sthreeni Gani
Paapula Kopamu Made Gadaa (2)
Daapuna Jeri Paapini Brochina (2)
Kaapari Veeve Gadaa         ||Silva Dharaa||

Khaalee Samaadhilo Maranamunu
Khaidiga Jesina Neeve Gadaa (2)
Khalamayudagu Saathaanuni Garvamu (2)
Khandanamaaye Gadaa         ||Silva Dharaa||

Kaluvarilo Nee Shaanthi Sudhaa
Selayeruga Bravahinche Gadaa (2)
Kalusha Edaarilo Kaluvalu Pooyuta (2)
Siluva Vijayamu Gadaa         ||Silva Dharaa||

హోసన్నా హల్లెలూయా / Hosannaa Hallelooyaa

హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా (2)
స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము (2)
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2)           ||హోసన్నా||

కెరూబులు సెరూపులు
ఇరువది నలుగురు పెద్దలతో (2)
నాలుగు జీవుల గానాలతో (2)
స్తుతియింపబడుచున్న యేసునకు (2)           ||హోసన్నా||

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
సర్వ సృష్టికి మూలకారకుడు (2)
మృతుడై మరలా బ్రతికినవాడు (2)
మేఘముపై రానున్న యేసునకు (2)           ||హోసన్నా||

Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa (2)
Sthothra roopamu Krottha Geethamul Noraara Paadedamu (2)
Rakshakudau Prabhu Yesu Kreesthuku
Sthuthi Sthothramul Chellinthumu (2)         ||Hosannaa||

Keroobulu Seroopulu
Iruvadi Naluguru Peddalatho (2)
Naalugu Jeevula Gaanaalatho (2)
Sthuthiyimpabaduchunna Yesunaku (2)         ||Hosannaa||

Parishuddhudu Athi Parishuddhudu
Sarva Srushtiki Moolakaarakudu (2)
Mruthudai Maralaa Brathikinavaadu (2)
Meghamupai Raanunna Yesunaku (2)         ||Hosannaa||

కొండలలో కోనలలో / Kondalalo Konalalo

కొండలలో కోనలలో
బేతలేము గ్రామములో
కనిపించె ప్రభు దూత
వినిపించేను శుభ వార్త
చెలరేగెనే ఆనందము
రక్షకుని రాకతో (2)         ||కొండలలో||

కొరికేసే చలి గాలిలో
వణికించే నడి రేయిలో (2)
కాపరుల భయము తీర
పామరుల ముదము మీర (2)
దూతా గానము
శ్రావ్యా రాగము (2)
పరమ గీతము         ||కొండలలో||

దావీదు పురమందున
పశువుల శాలయందున (2)
మన కొరకే రక్షకుండు
ఉదయించే పాలకుండు (2)
రండి వేగమే
రండి శీఘ్రమే (2)
తరలి వేగమే          ||కొండలలో||

Kondalalo Konalalo
Bethalemu Graamamulo
Kanipinche Prabhu Dootha
Vinipinchenu Shubha Vaartha
Chelaregene Aanandamu
Rakshakuni Raakatho (2)         ||Kondalalo||

Korikese Chali Gaalilo
Vanikinche Nadi Reyilo (2)
Kaaparula Bhayamu Theera
Paamarula Mudamu Meera (2)
Doothaa Gaanamu
Shraavyaa Raagamu (2)
Parama Geethamu             ||Kondalalo||

Daaveedu Puramanduna
Pashuvula Shaalayanduna (2)
Mana Korake Rakshakundu
Udayinche Paalakundu (2)
Randi Vegame
Randi Sheeghrame (2)
Tharali Vegame           ||Kondalalo||

కొడవలిని చేత పట్టి / Kodavalini Chetha Patti

కొడవలిని చేత పట్టి కోత కోయుము
తెల్లబారిన పొలములన్నియు (2)
నశియించు ఆత్మల భారము కలిగి
ఆగక సాగుమా ప్రభు సేవలో     ||కొడవలిని||

సర్వ సృష్టికి సువార్త ప్రకటన
ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2)
ఎన్నడూ దున్నని భూములను చూడు (2)
కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2)       ||కొడవలిని||

పిలిచిన వాడు నమ్మదగినవాడు
విడువడు నిన్ను ఎడబాయడు (2)
అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2)
అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2)       ||కొడవలిని||

Kodavalini Chetha Patti Kotha Koyumu
Thellabaarina Polamulanniyu (2)
Nashiyinchu Aathmala Bhaaramu Kaligi
Aagaka Saagumaa Prabhu Sevalo      ||Kodavalini||

Sarva Srushtiki Suvaartha Prakatana
Prabhuvu Manakichchina Bhaarame Kadaa (2)
Ennadu Dunnani Bhoomulanu Choodu(2)
Kanna Thandri Yesuni Kaadini Moyu (2)      ||Kodavalini||

Pilichina Vaadu Nammadaginavaadu
Viduvadu Ninnu Edabaayadu (2)
Arachethulalo Ninnu Chekkukunnavaadu (2)
Anukshanamu Ninnu Kaayuchunnavaadu (2)      ||Kodavalini||

క్రైస్తవ జీవితం / Kraisthava Jeevitham

క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2)
కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా
యేసు ప్రభువే నా సహకారి (2)          ||క్రైస్తవ||

ఈ లోక ఘనత నన్ను విడిచినన్
లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2)
నా సహోదరులు నన్ను విడిచినన్
యోసేపు దేవుడే నా సహకారి (2)          ||క్రైస్తవ||

నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహాయకుడు (2)
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2)          ||క్రైస్తవ||

బూర శబ్దంబు మ్రోగెడి వేళ
శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ (2)
ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ (2)          ||క్రైస్తవ||

Kraisthava Jeevitham Soubhaagya Jeevitham
Prabhu Pillalaku Entho Aanandam (2)
Kashtamulu Vachchinaa Nashtamulu Vachchinaa
Yesu Prabhuve Naa Sahakaari (2)       ||Kraisthava||

Ee Loka Ghanatha Nannu Vidichinan
Lokasthulellaru Nannu Vidichinan (2)
Naa Sahodarulu Nannu Vidichinan
Yosepu Devude Naa Sahakaari (2)       ||Kraisthava||

Naa Manchi Kaapari Sreshta Snehithudu
Shaashwatha Raaju Naa Sahaayakudu (2)
Bhaaram Naakenduku Vyaakulamenduku
Prabhu Prajalatho Ne Keerthinchedan (2)       ||Kraisthava||

Boora Shabdambu Mrogedi Vela
Shrama Nondina Naa Prabhuni Choochedan (2)
Aenaadu Eppudu Neevu Vachchedavu
Aanaati Varaku Ne Kanipettedan (2)       ||Kraisthava||

కలువరి గిరి నుండి / Kaluvari Giri Nundi

కలువరి గిరి నుండి
ప్రవహించే ధార
ప్రభు యేసు రక్త ధార (2)
నిర్దోషమైన ధార
ప్రభు యేసు రక్త ధార (2)
ప్రభు యేసు రక్త ధార (2)       ||కలువరి||

నా పాపముకై నీ చేతులలో
మేకులను దిగగొట్టిరా (2)
భరియించినావా నా కొరకే దేవా
నన్నింతగా ప్రేమించితివా (2)     ||కలువరి||

నా తలంపులే నీ శిరస్సుకు
ముండ్ల కిరీటముగా మారినా (2)
మౌనము వహియించి సహియించినావా
నన్నింతగా ప్రేమించితివా (2)       ||కలువరి||

Kaluvari Giri Nundi
Pravahinche Dhaara
Prabhu Yesu Raktha Dhaara (2)
Nirdoshamaina Dhaara
Prabhu Yesu Raktha Dhaara (2)
Prabhu Yesu Raktha Dhaara (2)       ||Kaluvari||

Naa Paapamukai Nee Chethulalo
Mekulanu Digagottiraa (2)
Bhariyinchinaavaa Naa Korake Devaa
Nanninthaga Preminchithivaa (2)      ||Kaluvari||

Naa Thalampule Nee Shirassuku
Mundla Kireetamuga Maarinaa (2)
Mounamu Vahiyinchi Sahiyinchinaavaa
Nanninthaga Preminchithivaa (2)       ||Kaluvari||

కరుణించుము మము పరమ పితా / Karuninchumu Mamu Parama Pithaa

కరుణించుము మము పరమ పితా
శరణం నీవే ప్రభు యేసా (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా

యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా
పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా          ||హల్లెలూయా||

రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు
రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి          ||హల్లెలూయా||

రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు
రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా          ||హల్లెలూయా||

అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని
ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి          ||హల్లెలూయా||

Karuninchumu Mamu Parama Pithaa
Sharanam Neeve Prabhu Yesaa (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa

Yerushalemu Chuttoonu – Parvathamulu Unchina Devaa
Parishuddhula Chuttunu Neeve – Nirathamu Nundu Nantivigaa            ||Hallelooyaa||

Raathrilo Kalugu Bhayamemi – Raakunda Jeyuchundedavu
Raathrilo Nee Hasthamutho – Rayamuga Kappumu Priya Thandri            ||Hallelooyaa||

Rathamunu Gurramu Routhulanu – Raathrilo Chuttiri Siriyanulu
Rathamunu Agni Gurramulan – Rakshanagaa Unchina Devaaa            ||Hallelooyaa||

Ardha Raathrilo Yaakobu – Adavilo Nidrinchina Gaani
Praardhana Cheyuta Nerpithivi – Paraloka Dwaaramu Choopithivi            ||Hallelooyaa||

ఎవరితో నీ జీవితం

ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2)

దేవుడే నీ జీవిత గమ్యం
దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

కష్టాలకు కృంగిపోకురా
నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

గెలుపోటమి సహజమురా
దివ్య శక్తితో కదులుమురా
ఘన దైవం తోడుండునురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||