పరిశుద్ధుడవై / Parishuddhudavai

పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2)
దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడవై||

నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2)
శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి
నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి         ||ఆరాధన||

నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2)
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి         ||ఆరాధన||

ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2)
మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు         ||ఆరాధన||

Parishuddhudavai – Mahima Prabhaavamulaku Neeve Paathrudavu
Balavanthudavai – Deenula Pakshamai Krupa Choopu Vaadavu (2)
Dayaaludavai – Dhaaraalamugaa Nanu Deevinchina Shreemanthudaa
Aaraadhana Neeke Naa Yesayyaa
Sthuthi Aaraadhana Neeke Naa Yesayyaa (2)         ||Parishuddhudavai||

Nee Swaasthyamaina Nee Vaaritho Kalisi Ninu Sevinchutaku
Nee Mahima Prabhaavamunu Kireetamugaa Dharimpajesithivi (2)
Shaashwatha Kaalamu Varaku Nee Santhathipai Drushti Nilipi
Nee Daasula Praardhanalu Saphalamu Chesithivi           ||Aaraadhana||

Nee Nithyamaina Aadarana Choopi Nanu Sthiraparachutaku
Nee Karunaa Kataakshamunu Naapai Kuripinchi Nanu Preminchithivi (2)
Naaku Prayojanamu Kalugajeyutaku Nee Upadeshamunu Bodhinchi
Nee Daasuni Praanamunu Santhoshaparachithivi           ||Aaraadhana||

Aanandakaramaina Deshamulo Nenu Ninu Ghanaparachutaku
Nee Mahimaathmatho Nimpi Surakshithamuga Nannu Nivasimpajesithivi (2)
Megha Vaahanudavai Vachchuvaraku Ne Kanipettuchundunu Nee Kosamu
Nee Daasula Kaankshanu Sampoorna Parachedavu           ||Aaraadhana||

నా స్తుతుల పైన / Naa Sthuthula Paina

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

నా స్తుతుల పైన నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా (2)
నీవు నా పక్షమై యున్నావు గనుకే
జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)

నన్ను నిర్మించిన రీతి తలచగా
ఎంతో ఆశ్చర్యమే
అది నా ఊహకే వింతైనది (2)
ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2)        ||నా స్తుతుల||

ద్రాక్షావల్లి అయిన నీలోనే
బహుగా వేరు పారగా
నీతో మధురమైన ఫలములీయనా (2)
ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2)       ||నా స్తుతుల||

నీతో యాత్ర చేయు మార్గములు
ఎంతో రమ్యమైనవి
అవి నాకెంతో ప్రియమైనవి (2)
నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2)          ||నా స్తుతుల||

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Naa Sthuthula Paina Nivasinchuvaadaa
Naa Antharangikudaa Yesayyaa (2)
Neevu Naa Pakshamai Yunnaavu Ganuke
Jayame Jayame Ellavelalaa Jayame (2)

Nannu Nirminchina Reethi Thalachagaa
Entho Aascharyame
Adi Naa Oohake Vinthainadi (2)
Erupekkina Shathruvula Choopu Nundi Thappinchi
Enaleni Premanu Naapai Kuripinchaavu (2)        ||Naa Sthuthula||

Draakshaavalli Aina Neelone
Bahugaa Veru Paaragaa
Neetho Madhuramaina Phalamuleeyanaa (2)
Unnatha Sthalamulapai Naaku Sthaanamichchithive
Vijayudaa Nee Krupa Chaalunu Naa Jeevithaana (2)          ||Naa Sthuthula||

Neetho Yaathra Cheyu Maargamulu
Entho Ramyamainavi
Avi Naakentho Priyamainavi (2)
Nee Mahimanu Koniyaadu Parishuddhulatho Nilichi
Padi Thanthula Sithaaratho Ninne Keerthincheda (2)        ||Naa Sthuthula||