దేవుని గొప్ప మహిమను / Devuni Goppa Mahimanu

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)
ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న
వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో  మన్నా  (2)

మరచినవా నీ అపజయములు
గుర్తు లేదా! ఆ శోధనలు
నీవు చూపిన ఆ వినయములు
ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు
తండ్రి నీవే దిక్కంటూ,  మోకరిల్లిన ఆ క్షణము
అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2)  ॥ఎంత॥

అందుకొంటివి బాప్తిస్మమును
పొందు కొంటివి ఆ రక్షణను
వదలబోకు ఆత్మీయతను
చేరనివ్వకు నిర్లక్ష్యమును
తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు
నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా?  (2)  ॥ఎంత॥

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Devuni Goppa Mahimanu Choosi
Thirigi Paapam Chesedavaa?
Dvandava Neethiki Nishkruthi Ledani
Neeku Thelusaa O Kraisthavaa? (2)
Entha Adhamu Anyula Kanna
Entha Ghoramu Aa Yooda Kanna
Valadu Paapam Ikapainanna
Thirigi Pondu Kreesthulo Mannaa (2)

Marachinaavaa Nee Apajayamulu
Guruthu Ledaa Aa Shodhanalu
Neevu Choopina Aa Vinayamulu
Edchi Chesina Aa Praardhanalu
Thandri Neeve Dikkantu
Mokarillina Aa Kshanamu
Andukontivi Vijayamulu
Vidachi Pedithivi Vaakyamunu (2)    ||Entha||

Andukontivi Baapthismamunu
Pondukontivi Aa Rakshananu
Vadalaboku Aathmeeyathanu
Cheranivvaku Nirlakshyamunu
Theerpu Theerche Samayamlo
Orpu Dorakadu Gurtherugu
Nithya Jeevamlo Nundi
Ghora Narakam Cheredaa (2)    ||Entha||

చిట్టి పొట్టి పాపను నేను / Chitti Potti Paapanu Nenu

చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2)

పాపమంటే తెలియదు కాని యేసయ్యా
పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి||

జీవమంటే తెలియదు కాని యేసయ్యా
నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి||

Chitti Potti Paapanu Nenu Yesayyaa
Chinna Goriyapillanu Nenu Yesayyaa (2)

Paapamante Theliyadu Kaani Yesayyaa
Paapa Lokamlo Nunnaanata Yesayyaa (2) ||Chitti||

Jeevamante Theliyadu Kaani Yesayyaa
Nithya Jeevam Neevenata Yesayyaa (2) ||Chitti||

కల్వరిలోన చేసిన యాగం / Kalvarilona Chesina Yaagam

కల్వరిలోన చేసిన యాగం
మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2)
కడిగి వేసెను నాదు పాపం
నిలిపె నాలో నీ స్వరూపం (2)      ||కల్వరిలోన||

ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు
తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు
పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు
నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2)
దైవ సుతుడవే అయిన గాని
కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2)      ||కల్వరిలోన||

ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం
రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం
నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను
చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను (2)
నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి
నన్ను రక్షించుటకు వేదన పడితివి (2)      ||కల్వరిలోన||

సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము
అందించేను నా కొరకై ఆ జీవ జలము
కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు
నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం (2)
అధికారమే లేని మరణము నిలిచెను
నిన్ను తాకేందుకు అనుమతి కోరెను (2)      ||కల్వరిలోన||

Kalvarilona Chesina Yaagam
Maranamu Gelichina Nee Yokka Thyaagam (2)
Kadigi Vesenu Naadu Paapam
Nilipe Naalo Nee Swaroopam (2)       ||Kalvarilona||

Aa Paapulu Alupe Leka Ninu Kottina Debbalu
Tholaginche Naapai Unna Aa Ghora Shaapaalu
Parishuddha Dehamupai Chelaregenu Koradaalu
Naaloni Rogaalakai Pondithivaa Gaayaalu (2)
Daiva Suthudave Aina Gaani
Kanikaramu Veedavu Aela Kshanamainaa Gaani (2)       ||Kalvarilona||

Ae Dosham Leni Deham Mosenu Siluva Bhaaram
Raddaayenu Naalo Neram Thagginchenu Naa Bhaaram
Nuvvu Pondina Avamaanam Nanu Unnathi Cherchenu
Chindinchina Needu Raktham Parishuddhuni Chesenu (2)
Ninne Baligaa Nuvvu Maarchukuntivi
Nannu Rakshinchutaku Vedana Padithivi (2)       ||Kalvarilona||

Siluvalo Vrelaaduthu Nuvvu Pondina Daahamu
Andinchenu Naa Korakai Aa Jeeva Jalamu
Katinulugaa Maari Neeku Andinchina Aa Chedu
Nimpenu Naalo Madhuram Tholaginche Naa Kutilam (2)
Adhikaarame Leni Maranamu Nilichenu
Ninnu Thaakendunu Anumathi Korenu (2)       ||Kalvarilona||