నిరతము స్తుతియించుము / Nirathamu Sthuthiyinchumu

నిరతము స్తుతియించుము ఓ మనసా
క్రీస్తేసుని స్తుతించు (2)
బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని
కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2)
మరువక స్తుతియించుము ఓ మనసా
జయగీతముతో స్తుతించు      ||నిరతము||

వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము
ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2)
నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2)
ఆ నిజ స్నేహితుని
కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2)      ||నిరతము||

అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము
పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2)
నీ భారం తొలగించి
తన కృపలో ఆదరించే (2)
నీ ఆత్మ కాపరియైన
పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2)      ||నిరతము||

Nirathamu Sthuthiyinchumu O Manasaa
Kreesthesuni Sthuthinchu (2)
Baadhalanu Theercheti Aa Sthothraarhuni
Kashtaalu Tholaginche Aa Karunasheeluni (2)
Maruvaka Sthuthiyinchumu O Manasaa
Jayageethamutho Sthuthinchu ||Nirathamu||

Vedhanalo Vidipinche Aa Deva Devuni Sthuthiyinchumu
Aapadalo Aadukone Aaraadhya Daivamune Sthuthiyinchumu (2)
Ninnilalo Odaarchi Thana Krupalo Balaparache (2)
Aa Nija Snehithunu
Kruthagnatha Kaligi Sthuthiyinchumu – (2)

Anni Samayaalalo Chaalina Devuni Sthuthiyinchumu
Peru Jeeva Grandhamulo Raasina Gorrepillani Sthuthiyinchumu (2)
Nee Bhaaram Tholaginchi
Thana Krupalo Aadarainche (2)
Nee Aathma Kaapariyaina
Parishuddhthaathmuni Sthuthiyinchumu – (2) ||Nirathamu||

ఆరాధించెదము ఆత్మతో నిరతము /Aaraadhinchedamu Aathmatho Nirathamu

ఆరాధించెదము ఆత్మతో నిరతము
యెహోవా దేవుని మనమంతా
ఆనంద గానము మనసారా పాడుచు
అనుదినం కీర్తింతుము రారాజును – (2)       ||ఆరాధించెదము||

అక్షయ నాథుడు అద్వితీయుడు
పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2)
ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2)
అమరుడై యున్నవాడు మన దేవుడు (2)       ||ఆరాధించెదము||

సత్య స్వరూపి మహోన్నతుడు
మహిమాన్వితుడు మనకును తండ్రియే (2)
ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2)
పరమందు ఆసీనుడు పూజార్హుడు (2)       ||ఆరాధించెదము||

సమస్తమునకు జీవాధారుడై
శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2)
భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2)
యుగములకు కర్తయే శ్రీమంతుడు (2)       ||ఆరాధించెదము||

Aaraadhinchedamu Aathmatho Nirathamu
Yehovaa Devuni Manamanthaa
Aananda Gaanamu Manasaaraa Paaduchu
Anudinam Keerthinthumu Raaraajunu – (2)     ||Aaraadhinchedamu||

Akshaya Naathudu Advitheeyudu
Parishuddha Devudu Nithya Nivaasiyu (2)
Aadyantha Rahithudu Adrushya Roopudu (2)
Amarudai Yunnavaadu Mana Devudu (2)       ||Aaradhinchedamu||

Sathya Swaroopi Mahonnathudu
Mahimaanvithudu Manakunu Thandriye (2)
Prabhuvaina Kreesthuku Thandriyaina Devudu (2)
Paramandu Aaseenudu Poojarhudu (2)     ||Aaraadhinchedamu||

Samasthamunaku Jeevaadhaarudai
Sresha Eevulanidu Jyothirmayudai (2)
Bhuviyandu Krupa Joopu Karunaa Sampannudu (2)
Yugamulaku Karthaye Sreemanthudu (2)     ||Aaraadhinchedamu||