జీవిత నావలో నే సాగెదన్
ప్రార్ధనతోనే పయనించెదన్
1. ఎస్తేరువలెనే నిన్ను విడువక
హన్నావలె నీకై వేచియుందును
ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్
యేసుతో కలసి నే సాగెదన్
2. నా చిన్న దోనెను యేసుకిత్తును
నా యేసు నేను కలసి పయనింతుము
ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్
యేసుతో కలసి నే సాగెదన్
నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా
ఆయన కూర్చోన్న నావలో
నీవు వున్నావా
తెలుసుకొనుము ఓ మనసా
తెలుసుకొనుము (2)
ఇదే అనుకూల సమయము
యేసు ద్వారా
1. పాప లోకంలో! పాప లోకంలో
యేసు తప్ప దేవుడున్నాడా
పాపాలు క్షమియించే
నాధుడున్నాడు.
తెలుసుకొనుము ఓ మనసా
తెలుసుకొనుము (2)
మన పాపాలు పోవును యేసు ద్వారా
మన శాపాలు పోవును యేసు ద్వారా
2. ఆహ పరలోకం ఓహో పరలోకం
మనకు ఇచ్చే యేసు ఉండగా
పాపాన్ని విడిచిపెట్టు యేసు ముందర
తెలుసుకొనుము ఓ మనసా
తెలుసుకొనుము (2)
పరలోకానికి మార్గము యేసు
అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను (2)
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో||
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా (2)
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును (2) ||అదిగో||
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2)
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును (2) ||అదిగో||
Adigo Naa Naava Bayalu Deruchunnadi
Andulo Yesu Unnaadu
Naa Naavalo Kreesthu Unnaadu (2)
Varadalenni Vachchinaa Vanakanu
Alalenni Vachchinaa Adaranu (2)
Aagipoye Addulochchinaa
Saagipoye Sahaayam Manaku Aayane (2) ||Adigo||
Nadiraathri Jaamulo Nadachinaa
Nadi Samudra Madhyalo Nilachinaa (2)
Nadipinchunu Naa Yesu
Nannu Addariki Cherchunu (2) ||Adigo||
Lothaina Daarilo Povuchunnadi
Sudigundaalenno Thiruguchunnavi (2)
Sooryudaina Aagipovunu
Chukkaani Maathram Saagipovunu (2) ||Adigo||