పరమ జీవము నాకు నివ్వ / Parama Jeevamu Naaku Nivva

పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును

యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను             ||యేసు||

పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును           ||యేసు||

నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడచినను        ||యేసు||

Parama Jeevamu Naaku Nivva
Thirigi Lechenu Naatho Nunda
Nirantharamu Nannu Nadipinchunu
Marala Vachchi Yesu Konipovunu

Yesu Chaalunu – Yesu Chaalunu
Ae Samayamaina Ae Sthithikaina
Naa Jeevithamulo Yesu Chaalunu

Saathaanu Shodhanaladhikamaina
Sommasillaka Saagi Velledanu
Lokamu Shareeramu Laaginanu
Lobadaka Nenu Velledanu        ||Yesu||

Pachchika Bayalulo Parundajeyun
Shaanthi Jalamu Chentha Nadipinchunu
Anishamu Praanamu Thrupthi Parachun
Marana Loyalo Nannu Kaapaadunu             ||Yesu||

Narulellaru Nannu Vidichinanu
Shareeramu Kulli Krushinchinanu
Harinchinan Naa Aishwaryamu
Virodhivale Nannu Vidachinanu         ||Yesu||

నాతో మాట్లాడు ప్రభువా / Naatho Maatlaadu Prabhuvaa

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2)          ||నాతో||

నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది (2)       ||నీవు పలికితే||

నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది (2)           ||నీవు పలికితే||

నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది (2)    ||నీవు పలికితే||

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Naatho Maatlaadu Prabhuvaa – Neeve Maatlaadumayyaa (2)
Neevu Palikithe Naaku Melayyaa (2)
Nee Darshaname Naaku Chaalayyaa (2)           ||Naatho||

Nee Vaakyame Nannu Brathikinchedi
Naa Baadhalalo Nemmadinichchedi (2)        ||Neevu Palikithe||

Nee Vaakyame Swasthatha Kaliginchedi
Naa Vedanalo Aadaranichchedi (2)          ||Neevu Palikithe||

Nee Vaakyame Nannu Nadipinchedi