సుధా మధుర కిరణాల / Sudhaa Madhura Kiranaala

సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం (2)
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది (2)            ||సుధా||

దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2)           ||సుధా||

లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)
క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2)          ||సుధా||

Sudhaa Madhura Kiranaala Arunodayam
Karunaamayuni Sharanam Arunodayam (2)
Thera Marugu Hrudayaalu Velugainavi
Maranaala Cherasaala Marugainadi (2)          ||Sudhaa||

Divi Raajugaa Bhuviki Diginaadani – Ravi Rajugaa Ilanu Migilaadani (2)
Navaloka Gaganaalu Pilichaadani – Paraloka Bhavanaalu Therichaadani (2)
Aarani Jeevana Jyothiga Velige Thaarokatochchindi
Paade Paatala Pashuvulashaalanu Ooyala Chesindi (2)
Ninu Paavaga – Nirupedagaa – Janminchagaa – Ila Panduga (2)         ||Sudha||

Lokaalalo Paapa Shokaalalo – Ekaakilaa Brathuku Avivekulu (2)
Kshama Hrudaya Sahanaalu Samapaalugaa – Premaanu Raagalu Sthira Aasthigaa (2)
Nammina Vaarini Rammani Piliche Rakshakudaa Yese
Nithya Sukhaala Jeevajalaala Pennidhi Aa Prabhuve (2)
Aa Janmame – Oka Marmamu – Aa Bandhame – Anubandhamu (2)           ||Sudha||

స్తుతి మధుర గీతము / Sthuthi Madhura Geethamu

స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద      ||స్తుతి||

కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2)
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా        ||స్తుతి||

అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2)
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి        ||స్తుతి||

Sthuthi Madhura Geethamu – Velaadi Sthothramu
Chellinchute Naa Dhanyatha
Bahu Goppa Sthaanamu – Shree Yesu Paadamu
Cheradame Naa Aathrutha
Annee Thalaanthulu Nee Korake Vaadeda
Noorantha Phalamulanu Noorellu Ichcheda       ||Sthuthi||

Kanulake Kanapadaleni Naa Kanti Paapavai
Kaallake Theliyaka Nannu Cherchevu Gamyamu (2)
Naake Theliyaka Naalo
Neevu Naadu Praana Shwaasavai
Nadipinchinaavaa Devaa Innaallugaa          ||Sthuthi||

Anuvanuvu Nee Krupa Chetha Nindugaa Nanu Nimpi
Neelaanti Polika Kaluga Shareeram Panchithivi (2)
Raathi Gundenu Diddi
Gudigaa Maarchukunna Daivamaa
Mullunu Remmagaa Maarchithive         ||Sthuthi||