లోకము నిన్ను నిందించినను (సీయోను పిల్లల పాటలు) Lokamu Ninnu Nindinchinanu

తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి 10:38

1. లోకము నిన్ను నిందించినను – నిజముగ నన్ను ప్రేమింతువా?(1)

    పరులెల్లరు నిను ద్వేషించినన్ (1)

    నీ సిలువను నీవు మోసెదవా? (2)

పల్లవి:  నీకై నే మరణించితినే – నా కొరకేమి చేసితివి? (2)

నా కొరకేమి చేసితివి?(1)

2. లోక మహిమ యిది వ్యర్థమని – లోకైశ్వర్యము మన్నేయని (1)

    పలికెదవా నీ మది నుండి? (1)

    విడువక నన్ను సేవించెదవా? (2)॥నీకైనే॥

నా జీవిత యాత్రలో / Naa Jeevitha Yaathralo

నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకము నందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు (2)       ||నా జీవిత||

పలు విధ శోధన కష్టములు
ఆవరించుచుండగా (2)
కదలక యున్న నా హృదయమును
కదలక కాపాడుము (2)       ||నా జీవిత||

నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు (2)
నీ కుడి హస్తము నాతో నుండన్
నా జీవిత యాత్రలో (2)       ||నా జీవిత||

ఈ లోక నటన ఆశలన్నియు
తరిగిపోవుచుండగా (2)
మారని నీ వాగ్ధానములే
నమ్మి సాగిపోవుదును (2)       ||నా జీవిత||

Naa Jeevitha Yaathralo
Prabhuvaa Nee Paadame Sharanam
Ee Lokamu Nandu Neevu Thappa
Vere Aashrayam Ledu (2)     ||Naa Jeevitha||

Palu Vidha Shodhana Kashtamulu
Aavarinchuchundagaa (2)
Kadalaka Yunna Naa Hrudayamunu
Kadalaka Kaapaadumu (2)     ||Naa Jeevitha||

Nee Sannidhilo Sampoornamaina
Santhoshamu Kaladu (2)
Nee Kudi Hasthamu Naatho Nundan
Naa Jeevitha Yaathralo (2)     ||Naa Jeevitha||

Ee Loka Natana Aashalanniyu
Tharigipovuchundagaa (2)
Maarani Nee Vaagdhaanamule
Nammi Saagipovudunu (2)     ||Naa Jeevitha||