నీవే నా రక్షణ / Neeve Naa Rakshana

నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ
నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2)
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2)        ||నీవే నా||

గతమును మన్నించి గుణవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి (2)
మనిషిగా మార్చినావు
నీ మనసు నాకిచ్చినావు (2)         ||యేసయ్యా||

కన్నీరు తుడచి కష్టాలు తీర్చి
అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2)
మనిషిగా మార్చినావు
మాదిరిగ చేసినావు (2)         ||యేసయ్యా||

Neeve Naa Rakshana Neeve Nireekshana
Neeve Naa Deevena Neeve Kshamaapana (2)
Yesayyaa Yesayyaa Entha Manchivaadavayyaa
Yesayyaa Yesayyaa Entha Manchi Manasayyaa (2)      ||Neeve Naa||

Gathamunu Manninchi Gunavanthuniga Chesi
Nannu Malachi Nanne Maripinchi (2)
Manishigaa Maarchinaavu
Nee Manasu Naakichchinaavu (2)        ||Yesayyaa||

Kanneeru Thudachi Kashtaalu Theerchi
Andaga Nilachi Addulanni Tholaginchi (2)
Manishigaa Maarchinaavu
Maadiriga Chesinaavu (2)        ||Yesayyaa||

ఎంత ప్రేమ యేసయ్యా/Entha Prema Yesayyaa

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్

ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు
సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు
ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు
సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను
సురూపమైనా సొగసైనా లేకపోయెను (2)
యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2)
నలిగిపోయెను – విరిగిపోయెను

ఎంత శ్రమను ఎంత బాధను
అనుభవించినాడే విభుడు (2)
మనకు క్షమాపణ ఇచ్చెను
అభయము కలుగజేసెను
హింసింపబడి దూషింపబడి
హింసింపబడి దూషింపబడెను
కరుణతో నను రక్షింప
నా కోసమే ఈ యాగమా        ||ఎంత ప్రేమ||

సమస్తము సంపూర్ణమాయెను
జీవముకై మార్గము తెరిచెను (2)
అపవాదిని అణచివేసి
మరణ ముల్లును విరచి వేసెను
విజయశీలుడై తిరిగి లేచెను
పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను
పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే

Lyricist: Raj Prakash Paul

Entha Prema Yesayyaa – Drohinaina Naa Koraku
Siluvalo Aa Yaagamu Chesaavu – Rakthamu Kaarchaavu
Enduku Ee Thyaagamu – Paapinaina Naa Koraku
Siluvalo Aa Yaagamu Nondhanu – Rakthamu Chindhanu
Suroopamainaa Sogasainaa Lekapoyenu (2)
Yesu Niluvella Raktha Dhaaralu Kaaripoyenu (2)
Naligipoyenu – Virigipoyenu

Entha Shramanu Entha Baadhanu
Anubhavinchinaade Vibhudu (2)
Manaku Kshamaapana Ichchenu
Abhayamu Kalugajesenu
Himsimpabadi Dooshimpabadi
Himsimpabadi Dooshimpabadenu
Karunatho Nanu Rakshimpa
Naa Kosame Ee Yaagamaa        ||Entha Prema||

Samasthamu Sampoornamaayenu
Jeevamukai Maargamu Therichenu (2)
Apavaadini Anachivesi
Marana Mullunu Virachi Vesenu
Vijayasheeludai Thirigi Lechenu
Parishuddhaathmanu Thoduga Ichchenu
Punarutthaanudu Manaku Thodugaa Nithyamu Nilache

దేవా నీ ఆత్మను / Devaa Nee Aathmanu

పాట రచయిత: డినో
Lyricist: Dino

దేవా నీ ఆత్మను నా నుండి
నువ్వు తీసివేయకుమా
నీ సన్నిధిలో నుండి నన్ను
నువ్వు త్రోసివేయకుమా (2)
నీ దృష్టి యెదుటనే
చెడుతనము చేసియున్నాను
పాపిని అని ఒప్పుకొని
క్షమాపణ కోరుచున్నాను
నీవే నీవే కరుణామయుడవు నీవే
నీవే నీవే ప్రేమామయుడవు నీవే     ||దేవా||

నీ వెలుగుతో నను నింపిననూ
చీకటినే కోరుకున్నాను (2)
నా కళ్ళు నీవు తెరిచిననూ
గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను      ||నీ దృష్టి||

నీ ఆత్మతో నను నింపిననూ
శరీరమునే తృప్తిపరిచాను (2)
ఆత్మచేత నడిపించబడక
శరీరాశలలో మునిగాను       ||నీ దృష్టి||

పాట రచయిత: డినో
Lyricist: Dino

Devaa Nee Aathmanu Naa Nundi
Nuvvu Theesiveyakumaa
Nee Sannidhilo Nundi Nannu
Nuvvu Throsiveyakumaa (2)
Nee Drushti Yedutane
Cheduthanamu Chesiyunnaanu
Paapini Ani Oppukoni
Kshamaapana Koruchunnaanu
Neeve Neeve Karunaamayudavu Neeve
Neeve Neeve Premaamayudavu Neeve      ||Devaa||

Nee Velugutho Nanu Nimpinanu
Cheekatine Korukunnaanu (2)
Naa Kallu Neevu Therichinanu
Gruddivaadilaa Naduchukunnaanu      ||Nee Drushti||

Nee Aathmatho Nanu Nimpinanu
Shareeramune Thrupthiparichaanu (2)
Aathmachetha Nadipinchabadaka
Shareeraashalalo Munigaanu      ||Nee Drushti||

కరుణించి తిరిగి సమకూర్చు / Karuninchi Thirigi Samakoorchu

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2)
క్షమాపణ నిన్ను వేడుచున్నాను (2)

దావీదు రాజు దీనుడై వేడ (2)
అవనిలో బొందిన నష్టములన్నియు (2)
దేవా నీవు సమకూర్చితివే (2)      ||కరుణించి||

శత్రు సమూహపు కుతంత్రములతో (2)
బొత్తిగా నేను నష్టపడితిని (2)
మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2)      ||కరుణించి||

పసరు గొంగళి – చీడ పురుగులు (2)
నాశనము చేసిన పంటను కూర్చుమా (2)
యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2)      ||కరుణించి||

ప్రేమ సంతోషానందములను (2)
ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని (2)
ప్రేమతో నీవు సమకూర్చుమా (2)      ||కరుణించి||

పాపపు విషముతో నా పాత్ర నిండెను (2)
ప్రభు యేసుండను పిండిని కలుపుము (2)
పాప మరణమును తొలగించుమా (2)      ||కరుణించి||

ఆత్మీయ సోమరితనములో నుండి (2)
ఆత్మ నష్టముల నెన్నియో బొందితి (2)
ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2)      ||కరుణించి||

పాపము చేసి పడియున్న చోటున్ (2)
ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా (2)
కోపగించక నాపై కృప జూపుమా (2)      ||కరుణించి||

చేసిన పాపము కప్పుకొనక (2)
విశ్వాసముతో ఒప్పుకొందున్ (2)
సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2)      ||కరుణించి||

Karuninchi Thirigi Samakoorchu Prabhuvaa (2)
Kshamaapana Ninnu Veduchunnaanu (2)

Daaveedu Raaju Deenudai Veda (2)
Avanilo Bondina Nashtamulanniyu (2)
Devaa Neevu Samakoorchithive (2)       ||Karuninchi||

Shathru Samoohapu Kuthanthramulatho (2)
Botthiga Nenu Nashtapadithini (2)
Mithrudesulo Samakoorchumu Thandri (2)       ||Karuninchi||

Pasaru Gongali – Cheeda Purugulu (2)
Naashanamu Chesina Pantanu Koorchumaa (2)
Yesu Prabhoo Ninnu Veduchunnaanu (2)       ||Karuninchi||

Prema Santoshaanandamulanu (2)
Pradhaana Yaajakaa Pogottukontini (2)
Prematho Neevu Samakoorchumaa (2)       ||Karuninchi||

Paapapu Vishamutho Naa Paathra Nindenu (2)
Prabhu Yesundanu Pindini Kalupumu (2)
Paapa Maranamunu Tholaginchumaa (2)       ||Karuninchi||

Aathmeeya Somarithanamulo Nundi (2)
Aathma Nashtamula Nenniyo Bondithi (2)
Aathma Devaa Neevu Samakoorchumaa (2)       ||Karuninchi||

Paapamu Chesi Padiyunna Chotun (2)
Praapuga Neevu Joopumo Prabhuvaa (2)
Kopaginchaka Naapai Krupa Joopumaa(2)       ||Karuninchi||

Chesina Paapamu Kappukonaka (2)
Vishwaasamutho Oppukondun (2)
Siluva Raktamutho Shuddhi Cheyumaa (2)       ||Karuninchi||

ఆరాధన అందుకో / Aaraadhana Anduko

ఆరాధన అందుకో (2)
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో

అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా
మోషేతో అన్నావు ఉన్నానని (2)
అల్ఫయు నీవే ఓమెగయును (2)
ఆద్యంత రహితుండ నీవేనని
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో

పాపంబున జన్మించి నశియించితిని
లోకంబు నాదనుచు ఆశించితిని (2)
అయినా నీవు రక్షణ నివ్వ (2)
వెలిగించి పంపితివి యేసు ప్రభును
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో

తెలిసికొంటిని నా యేసు నిన్ను
సర్వ శక్తి గల ప్రభువనియు (2)
రానున్నావు మరలా నాకై (2)
ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో          ||ఆరాధన||

Aaraadhana Anduko (2)
Paapa Kshamaapana Jeevamunichchina
Karunaamayaa.. Aaraadhana Anduko

Abrahaamu Issaku Yaakobu Devaa
Moshetho Annaavu Unnaanani (2)
Alphayu Neeve Omegayunu (2)
Aadyantha Rahithunda Neevenani
Ghanathaa Mahimaa Neekeyani
Hallelooyaa Gaanaamu Chesedanu
Paapa Kshamaapana Jeevamunichchina
Karunaamayaa.. Anduko
Aaraadhana Anduko

Paapambuna Janminchi Nashiyinchithini
Lokambu Naadanuchu Aashinchithini (2)
Ainaa Neevu Rakshana Nivva (2)
Veliginchi Pampithivi Yesu Prabhunu
Ghanathaa Mahimaa Neekeyani
Hallelooyaa Gaanaamu Chesedanu
Paapa Kshamaapana Jeevamunichchina
Karunaamayaa.. Anduko
Aaraadhana Anduko

Thelisikontini Naa Yesu Ninnu
Sarva Shakthi Gala Prabhuvaniyu (2)
Raanunnaavu Maralaa Naakai (2)
Aananda Deshamulo Nannunchutakai
Ghanathaa Mahimaa Neekeyani
Hallelooyaa Gaanaamu Chesedanu
Paapa Kshamaapana Jeevamunichchina
Karunaamayaa.. Anduko           ||Aaraadhana||

అమూల్య రక్తం ప్రశస్త రక్తం / Amoolya Raktham Prashastha Raktham

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు

అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
విలువైన రక్తం – శక్తి గల రక్తం (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య||

తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప (2)
చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు||

శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు (2)
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు||

నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||

Lyricist: Diyya Prasada Rao

Amoolya Raktham – Prashastha Raktham
Viluvaina Raktham – Shakthi Gala Raktham (2)
Yesu Rakthame Jayamu
Kreesthu Rakthame Vijayamu (2)
Paapa Kshamaapana Yesu Rakthamulone
Shaapa Vimochana Kreesthu Rakthamulone          ||Amoolya||

Thandri Chitthamu Neravercha
Gethsemanelo Praardhimpa (2)
Chemata Rakthamu Goppa Binduvulai Kaarene
Aathma Shakthini Prasaadinchunu – Amoolya Rakthame (2)       ||Yesu||

Shaapaaniki Prathiphalamu Mullu
Mundla Kireetamutho Chellu (2)
Prabhuvu Nondene Manakai Koradaa Debbalu
Prathi Vyaadhini Swasthaparachunu – Amoolya Rakthame (2)       ||Yesu||

Nee Chethula Panini Aasheervadimpa
Prabhu Chethulalo Mekulu Gotta (2)
Kaallalo Mekulu Suvaarthaku Sundarame
Ballepu Potu Baagu Cheyunu – Gundelanu (2)       ||Yesu||