ఎల్లప్పుడును ప్రభువునందు/Ellappudunu Prabhuvunandu

పాట రచయిత: క్రాంతి చేపూరి

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి
ప్రతి సమయములోను…
ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)
యెహోవా చేసిన మేలుల కొరకై
ఎల్లప్పుడును ఆనందించండి (2)
ఆరాధించండి          ||ఎల్లప్పుడును||

పాపంబు తోడ చింతించుచుండ
నరునిగా ఈ భువిలో ఉదయించెగా
మన పాప భారం తన భుజమున మోసి
మనకై తన ప్రాణం అర్పించెగా (2)
ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి
ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే     ||ఎల్లప్పుడును||

విశ్వాసమునకు కలిగే పరీక్ష
ఓర్పును కలిగించే ఒక సాధనమై
శోధనకు నిలిచి సహించిన వేళ
జీవ కిరీటమును పొందెదము (2)
నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి
సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి     ||ఎల్లప్పుడును||

ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి
మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి
మనతో నివాసమును కలిగి యుండుటకు
త్వరలోనే రారాజుగా రానైయుండె (2)
శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి
సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి      ||ఎల్లప్పుడును||

Lyricist: Kranthi Chepuri

Ellappudunu Prabhuvunandu Aanandinchandi
Prathi Samayamulonu…
Prathi Paristhithilonu Aanandinchandi (2)
Yehovaa Chesina Melula Korakai
Ellappudunu Aanandinchandi (2)
Aaraadhinchandi           ||Ellappudunu||

Paapambu Thoda Chinthinchuchunda
Narunigaa Ee Bhuvilo Udayinchegaa
Mana Paapa Bhaaram Thana Bhujamuna Mosi
Manakai Thana Praanam Arpinchegaa (2)
Uchithaardhamaina Rakshananu Nosagi Neethimanthuni Chesi
Ullaasa Vasthramunu Dhariyimpajesi Yunnaadu Ganuke           ||Ellappudunu||

Vishwaasamunaku Kalige Pareeksha
Orpunu Kaliginche Oka Saadhanamai
Shodhanaku Nilichi Sahinchina Vela
Jeeva Kireetamunu Pondedamu (2)
Naanaa Vidhaalaina Shodhanalo Padinappudu Aanandinchandi
Sampoornulugaanu Koduve Leni Orpunu Konasaaginchandi           ||Ellappudunu||

Prathi Baashpa Binduvunu Thudichi Vesi
Maranamu Dukhamu Edpunu Dooramu Chesi
Manatho Nivaasamunu Kaligi Yundutaku
Thvaralone Raaraajugaa Raanaiyunde (2)
Shubhapradamainaa Nireekshanatho Kaachiyundandi
Siddhamaina Manassunu Kaligi Vechiyundandi           ||Ellappudunu||

ఎన్ని మార్లు/Enni Maarlu

పాట రచయిత: క్రాంతి చేపూరి

ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని
తిన్ననైన మార్గములో నడువకుందువు?
చిన్ననాటి నుండి నీవు క్రైస్తవుడవని
నులివెచ్చని జీవితమును విడువనందువు? (2)
విశ్వాసీ, ఏది నీ సాక్ష్యము?
దేనిపై ఉన్నది నీ లక్ష్యము? (2)
యేసుపైన లేకుంటే నీ నిరీక్షణ…
ఇంకెందుకు నీకు ఈ రక్షణ? – (2)          ||ఎన్ని మార్లు||

యేసు లేని జీవితం వ్యర్ధమని తెలిసినా
లోకమెప్పు కోసమే వెరచియున్నావా
క్రీస్తు వైపు సాగుతూ వెనుక తట్టు తిరిగితే
ఉప్పు శిలగ మిగిలెదవని మరచిపోయావా (2)
పాపమే వేరు చేసెను
దేవుని నుండి మనలనూ
సిలువ యాగమే దారి చూపెను
ఇకనైనా మార్చుకో నీ మనస్సునూ – (2)          ||విశ్వాసీ||

పాపానికి జీతము మరణమని తెలిసినా
ఇహలోక స్నేహమే పాపమని ఎరుగవా
ఎన్ని మార్లు తప్పినా ఒప్పుకుంటే చాలులే
పరలోకం చేరొచ్చనే భ్రమను విడువవా (2)
చేసిన ప్రతి పాపానికి
తీర్పు దినం ఉంది మరువకు
లేదు నీకు నిత్య జీవము
నీ జీవితం మార్పునొందే వరకు – (2)              ||విశ్వాసీ||

Lyricist: Kranthi Chepuri

Enni Maarlu Neevu Daiva Vaakyamunu Vini
Thinnanaina Maargamulo Naduvakunduvu?
Chinnanaati Nundi Neevu Kraisthavudavani
Nulivechchani Jeevithamunu Viduvananduvu? (2)
Vishwaasee, Edi Nee Saakshyamu?
Denipai Unnadi Nee Lakshyamu? (2)
Yesu Paina Lekunte Nee Nireekshana…
Inkenduku Neeku Ee Rakshana? – (2)       ||Enni Maarlu||

Yesu Leni Jeevitham Vyardhamani Thelisinaa
Lokameppu Kosame Verachiyunnaavaa
Kreesthu Vaipu Saaguthoo Venuka Thattu Thirigithe
Uppu Shilaga Migiledavani Marachipoyaavaaa (2)
Paapame Veru Chesenu
Devuni Nundi Manalanu
Siluva Yaagame Daari Choopenu
Ikanainaa Maarchuko Nee Manassunu – (2)        ||Vishwaasee||

Paapaaniki Jeethamu Maranamani Thelisinaa
IhaLoka Snehame Paapamani Erugavaa
Enni Maarlu Thappinaa Oppukunte Chaalule
Paralokam Cherochchane Bhramanu Viduvavaa (2)
Chesina Prathi Paapaaniki
Theerpu Dinam Undi Maruvaku
Ledu Neeku Nithya Jeevamu
Nee Jeevitham Maarpunonde Varaku – (2)        ||Vishwaasee||