నాలోని ఆశ నాలోని కోరిక / Naaloni Aasha Naaloni Korika

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని
దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని
దేవా… యేసయ్యా నిన్ను చేరాలని

జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ
జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్

శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప
వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2)
ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా
తరతరాలు మారినా మారని దేవుడా         ||జీసస్||

విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)
తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద
నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును          ||జీసస్||

Naaloni Aasha Naaloni Korika Ninnu Choodaalani
Naaloni Aasha Naaloni Korika Ninnu Cheraalani
Devaa.. Yesayyaa Ninnu Choodaalani
Devaa.. Yesayyaa Ninnu Cheraalani

Jesus I want to worship you
Jesus I want to praise you Lord (2)
My Jesus.. I want to see you
My Jesus.. I want to see you.. Forever

Shramalu Nannu Thariminaa – Viduvaledu Nee Krupa
Vedanalo Nenu Krunginaa – Levanetthenu Nee Cheyi (2)
Enni Yugaalakainanu Sthuthulaku Paathrudaa
Thara Tharaalu Maarinaa Maarani Devudaa         ||Jesus||

Virigi Naligina Manassutho Nee Dari Cherithi Yesayyaa
Madhuramaina Nee Prematho Nannu Nimpumu Naa Devaa (2)
Thudi Shwaasa Varaku Devaa Ninne Keerthincheda
Naa Brathuku Dinamulanni Ninnu Poojinthunu         ||Jesus||

సోలిపోయిన మనసా / Solipoyina Manasaa

సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
యేసులో నీ కోరిక తీరునుగా       ||సోలిపోయిన||

యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే (2)
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు (2)

శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా (2)
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు (2)

ఎంత కాలము కృంగిపోదువు
నీ శ్రమలనే తలచుచు మనసా (2)
శ్రమపడుచున్న ఈ లోకమునకు
క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ (2)

సోలిపోకుము ఓ ప్రియ మనసా
సాగిపో ఇక యేసుని బాటలో
కలత వీడు ఆనందించు
కర్త యేసే నీతో ఉండగా
కలతకు ఇక చావే లేదు – (2)
యేసు కోరికనే నెరవేర్చు         ||సోలిపోకుము||

Solipoyina Manasaa Neevu
Sedadeerchuko Yesuni Odilo
Kalatha Elano Kanneeru Elano
Kartha Yese Neetho Undagaa
Prabhuvu Nee Cheyi Veedadu Ennadu – (2)
Yesulo Nee Korika Theerunugaa             ||Solipoyina||

Yesu Premanu Neeverugutache
Dooramaina Nee Vaare (2)
Kanna Thalle Ninu Marachinanu
Yesu Ninnu Maruvadennadu (2)

Shramaku Phalitham Kaanaleka
Sommasillithivaa Manasaa (2)
Kotha Kaalapu Aanandamunu
Neekosagunu Kothaku Prabhuvu (2)

Entha Kaalamu Krungipoduvu
Nee Shramalane Thalachuchu Manasaa (2)
Shramapaduchunna Ee Lokamunaku
Kreesthu Nireekshana Neevai Yundaga (2)

Solipokumu O Priya Manasaa
Saagipo Ika Yesuni Baatalo
Kalatha Veedu Aanandinchu
Kartha Yese Neetho Undagaa
Kalathaku Ika Chaave Ledu – (2)
Yesu Korikane Neraverchu            ||Solipokumu||

జీవితంలో నీలా ఉండాలని / Jeevithamlo Neelaa Undaalani

జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశున్నది (2)
తీరునా నా కోరిక
చేరితి ప్రభు పాదాల చెంత (2)      ||జీవితంలో||

కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే నడవాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడవాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడిచి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని (2)        ||తీరునా||

పరిశుద్ధతలో ప్రార్ధించుటలో
ఊపవాసములొ ఉపదేశములో (2)
నీలాగే బ్రతకాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతకాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతికి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని (2)        ||తీరునా||

Jeevithamlo Neelaa Undaalani
Yesu Naalo Entho Aashunnadi (2)
Theerunaa Naa Korika
Cherithi Prabhu Paadaala Chentha (2)     ||Jeevithamlo||

Koorchundutalo Niluchundutalo
Maatlaadutalo Preminchutalo (2)
Neelaage Nadavaalani
Nee Chiththam Neraverchani
Neelaage Nadavaalani.. Yesayyaa
Nee Chiththam Neraverchani
Neelaage Nadichi
Nee Chiththam Neraverchi
Nee Dariki Cheraalani (2)      ||Theerunaa||

Parishudhdhathalo Praardhinchutalo
Upavaasamulo Upadeshamulo (2)
Neelaage Brathakaalani
Nee Chiththam Neraverchani
Neelaage Brathakaalani.. Yesayyaa
Nee Chiththam Neraverchani
Neelaage Brathiki
Nee Chiththam Neraverchi
Nee Dariki Cheraalani (2)     ||Theerunaa||