ఎంత ప్రేమ యేసయ్యా/Entha Prema Yesayyaa

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్

ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు
సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు
ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు
సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను
సురూపమైనా సొగసైనా లేకపోయెను (2)
యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2)
నలిగిపోయెను – విరిగిపోయెను

ఎంత శ్రమను ఎంత బాధను
అనుభవించినాడే విభుడు (2)
మనకు క్షమాపణ ఇచ్చెను
అభయము కలుగజేసెను
హింసింపబడి దూషింపబడి
హింసింపబడి దూషింపబడెను
కరుణతో నను రక్షింప
నా కోసమే ఈ యాగమా        ||ఎంత ప్రేమ||

సమస్తము సంపూర్ణమాయెను
జీవముకై మార్గము తెరిచెను (2)
అపవాదిని అణచివేసి
మరణ ముల్లును విరచి వేసెను
విజయశీలుడై తిరిగి లేచెను
పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను
పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే

Lyricist: Raj Prakash Paul

Entha Prema Yesayyaa – Drohinaina Naa Koraku
Siluvalo Aa Yaagamu Chesaavu – Rakthamu Kaarchaavu
Enduku Ee Thyaagamu – Paapinaina Naa Koraku
Siluvalo Aa Yaagamu Nondhanu – Rakthamu Chindhanu
Suroopamainaa Sogasainaa Lekapoyenu (2)
Yesu Niluvella Raktha Dhaaralu Kaaripoyenu (2)
Naligipoyenu – Virigipoyenu

Entha Shramanu Entha Baadhanu
Anubhavinchinaade Vibhudu (2)
Manaku Kshamaapana Ichchenu
Abhayamu Kalugajesenu
Himsimpabadi Dooshimpabadi
Himsimpabadi Dooshimpabadenu
Karunatho Nanu Rakshimpa
Naa Kosame Ee Yaagamaa        ||Entha Prema||

Samasthamu Sampoornamaayenu
Jeevamukai Maargamu Therichenu (2)
Apavaadini Anachivesi
Marana Mullunu Virachi Vesenu
Vijayasheeludai Thirigi Lechenu
Parishuddhaathmanu Thoduga Ichchenu
Punarutthaanudu Manaku Thodugaa Nithyamu Nilache

నా జీవిత వ్యధలందు / Naa Jeevitha Vyadhalandu

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

నా జీవిత వ్యధలందు యేసే జవాబు
యేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2)       ||నా జీవిత||

తీరని మమతలతో ఆరని మంటలలో
ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2)
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను        ||నా జీవిత||

చీకటి వీధులలో నీటుగా నడచితిని
లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2)
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను        ||నా జీవిత||

హంగుల వేషముతో రంగుల వలయములో
నింగికి నేనెగిరి నేలను రాలితిని (2)
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను        ||నా జీవిత||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Naa Jeevitha Vyadhalandu Yese Javaabu
Yese Javaabu Prabhu Yese Javaabu (2)         ||Naa Jeevitha||

Theerani Mamathalatho Aarani Mantalalo
Aasha Niraashalatho Thoolenu Naa Brathuke (2)
Nanu Gani Vachchenu – Thana Krupa Nichchenu
Karunatho Preminchi – Kalushamu Baapenu         ||Naa Jeevitha||

Cheekati Veedhulalo Neetuga Nadachithini
Lokapu Uchchulalo Shokamu Joochithini (2)
Nanu Gani Vachchenu – Thana Krupa Nichchenu
Karunatho Preminchi – Kalushamu Baapenu         ||Naa Jeevitha||

Hangula Veshamutho Rangula Valayamulo
Ningiki Nenegiri Nelanu Raalithini (2)
Nanu Gani Vachchenu – Thana Krupa Nichchenu
Karunatho Preminchi – Kalushamu Baapenu         ||Naa Jeevitha||