నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి (2)
హృదయమంత వేదనతో నిండియున్నది
ఆదరణే లేక ఒంటరైనది (2)
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము (2)
పాపం చేసి నీకు దూరమయ్యాను
నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను (2)
నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను (2) ||దేవా||
నీ హృదయ వేదనకు కారణమైనాను
దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను (2)
నను మన్నించుమా నా తండ్రి (2)
Nee Koraku Naa Praanam Aashapaduchunnadi
Nee Koraku Naa Kanulu Eduru Choochuchunnavi (2)
Hrudayamantha Vedanatho Nindiyunnadi
Aadarane Leka Ontarainadi (2)
Devaa Naa Kanneeru Thuduvumu
Hatthukoni Nannu Muddhaadumu (2)
Paapam Chesi Neeku Dooramayyaanu
Nannu Ganna Premani Vidichi Nenu Vellaanu (2)
Nee Maatalanu Meeri Lokaanni Cheraanu
Paapaanni Preminchi Heenudanayyaanu (2) ||Devaa||
Nee Hrudaya Vedanaku Kaaranamainaanu
Doshigaa Nee Yeduta Ne Nilichiyunnaanu (2)
Nanu Manninchumaa Naa Thandri (2)
కావలివాడా ఓ కావలివాడా
కనులు తెరచి పొలమును చూడు
కోతకు వఛ్చిన పంటను కోయుము ||కావలి||
పిలిచెను నీ యజమానుడు
జత పనివాడవై యుండుటకు (2)
కొలుచును నీ ఫలమంతమున
పని చేసిన రీతిగనే (2) ||కావలి||
నమ్మెను నీ యజమానుడు
అప్పగించెను తన స్వాస్థ్యము (2)
తిరిగి వచ్చును జీతమియ్యను
సిద్ధ పడుము ఇక నిద్ర మాని (2) ||కావలి||
ఎంచెను నీ యజమానుడు
నీ పాదములు సుందరములని (2)
ఉంచెను కర్మెలు పర్వతముపై
పరుగిడుము పరాక్రమ శాలివై (2) ||కావలి||
వేయుము పునాది నేర్పరివై
చెక్కుము రాళ్లను శిల్ప కారివై (2)
కొయ్య కాలును కర్ర గడ్డియు
కాలిపోవును అగ్ని పరీక్షలో (2) ||కావలి||
Kaavalivaadaa O Kaavalivaadaa
Kanulu Therachi Polamunu Choodu
Kothaku Vachchina Pantanu Koyumu ||Kaavali||
Pilichenu Nee Yajamaanudu
Jatha Panivaadavai Yundutaku (2)
Koluchunu Nee Phalamanthamuna
Pani Chesina Reethigane (2) ||Kaavali||
Nammenu Nee Yajamaanudu
Appaginchenu Thana Swaasthyamu (2)
Thirigi Vachchunu Jeethamiyyanu
Siddha Padumu Ika Nidra Maani (2) ||Kaavali||
Enchenu Nee Yajamaanudu
Nee Paadamulu Sundaramulani (2)
Unchenu Karmelu Parvathamupai
Parugidumu Paraakrama Shaalivai (2) ||Kaavali||
Veyumu Punaadi Nerparivai
Chekkumu Raallanu Shilpa Kaarivai (2)
Koyya Kaalunu Karra Gaddiyu
Kaalipovunu Agni Pareekshalo (2) ||Kaavali||
కల్లుండి చూడలేని ఎందరో ఉన్నారు
చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2)
వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే
జీవింప చేయాలి నీ మహిమలోనే ||కల్లుండి||
కంటి చూపుతో నన్ను కాచియున్నావు
గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2)
మరణాన్ని తప్పించావు
జీవాన్ని నాకిచ్చావు (2)
ఇంకేల నా యేసయ్యా ||కల్లుండి||
నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు
నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2)
నీవే నా గమ్యమని
నీలోనే నడిచెదను (2)
నాకేగా పరలోకము ||కల్లుండి||
Kallundi Choodaleni Endaro Unnaaru
Choosi Choodanattu Brathukuchunnaaru (2)
Vaari Kanulu Theripinchaali Nee Mahimathone
Jeevimpa Cheyaali Nee Mahimalone ||Kallundi||
Kanti Chooputho Nannu Kaachiyunnaavu
Gunde Paina Vaatha Petti Nanu Maarchinaavu (2)
Maranaanni Thappinchaavu
Jeevaanni Naakichchaavu (2)
Inkela Naa Yesayyaa ||Kallundi||
Needu Aathmatho Nannu Nimpiyunnaavu
Nedu Saakshigaa Nannu Ila Nilipiyunchaavu (2)
Neeve Naa Gamyamani
Neelone Nadichedanu (2)
Naakegaa Paralokamu ||Kallundi||