ప్రార్ధన ప్రార్ధన / Praardhana Praardhana

ప్రార్ధన ప్రార్ధన
ప్రభునితో సంభాషణ
ప్రార్ధనే ఊపిరి
ప్రార్ధనే కాపరి        ||ప్రార్ధన||

కన్నీటి ఉపవాస ప్రార్ధన
సాతాను శక్తులపై విజయము (2)
విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన
జయము నొసగును జీవితములు        ||ప్రార్ధన||

ఒలీవ కొండల ప్రార్ధన
స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2)
ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన
ఆత్మల నొసగును సేవలో        ||ప్రార్ధన||

సిలువలో నేర్పిన ప్రార్ధన
ప్రేమను నేర్పును బ్రతుకున (2)
సాతాను చొరను చోటు లేనిది
పాపమును దరి రానీయనిది        ||ప్రార్ధన||

Praardhana Praardhana
Prabhunitho Sambhaashana
Praardhane Oopiri
Praardhane Kaapari       ||Praardhana||

Kanneeti Upavaasa Praardhana
Saathaanu Shakthulapai Vijayamu (2)
Virigi Naligina Vignaapana – Praardhana
Jayamu Nosagunu Jeevithamula       ||Praardhana||

Oleeva Kondala Praardhana
Swasthatha Nosagunu Vyaadhi Baadhalaku (2)
Prabhuvu Nerpina Gethsemane Praardhana
Aathmala Nosagunu Sevalo       ||Praardhana||

Siluvalo Nerpina Praardhana
Premanu Nerpunu Brathukuna (2)
Saathaanu Choranu Chotu Lenidi
Paapamunu Dari Raaneeyanidi       ||Praardhana||

కానరావే అలనాటి కన్నీటి / Kaanaraave Alanaati Kanneeti

కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు
కదలవేమి అపవాది చెరసాల పునాదులు
ఇది నీ లోపమా – మరి నా లోపమా
యోచించుమా క్రీస్తు సంఘమా (2)
యోచించుమా క్రీస్తు సంఘమా       ||కానరావే||

సమూయేలుల నందించే హన్నాలేరి
సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2)
నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2)
నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో
కాలేబులెటు పోయిరో            ||ఇది నీ లోపమా||

అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి
ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2)
శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి (2)
శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో
దావీదులెటు పోయిరో           ||ఇది నీ లోపమా||

నిద్ర లేవాలి ఓ సంఘమా
అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా
క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా
ఉజ్జీవం నీలో నిండాలి
ఓ సంఘమా… నిజ సంఘమా

Kaanaraave Alanaati Kanneeti Praardhanalu
Kadalavemi Apavaadi Chersaala Punaadhulu
Idi Nee Lopamaa – Mari Naa Lopamaa
Yochinchumaa Kreesthu Sanghamaa (2)
Yochinchumaa Kreesthu Sanghamaa       ||Kaanaraave||

Samooyeelula Nandinche Hannaaleri
Samarpanatho Praardhinche Estheruleri (2)
Neethi Koraku Nilabade Sthepanula Jaadedi (2)
Nindu Manassutho Aaraadhinche Kaalebu-letu Poyiro
Kaalebu-letu Poyiro            ||Idi Nee Lopamaa||

Aposthalula Aadarinche Barnabaaleri
Aathmalakai Parigetthe Philippuleri (2)
Shramalake Eduru Nilache Poulu Vaarasuleri (2)
Shathruvutho Poraadi Geliche Daavedu-letu Poyiro
Daavedu-letu Poyiro           ||Idi Nee Lopamaa||

Nidra Levaali O Sanghamaa
Asathyaanni Khandinche Sathya Sthambhamaa
Kreesthukai Kadalaali O Sanghamaa
Ujjeevam Neelo Nindaali
O Sanghamaa… Nija Sanghamaa

కలలాంటి బ్రతుకు నాది / Kalalaanti Brathuku Naadi

పాట రచయిత: పి సతీష్ కుమార్

కలలాంటి బ్రతుకు నాది
కన్నీటి ఊట నాది (2)
కలలోనైనా ఊహించలేదే
కమనీయమైన ఈ బంధం
కల్వరిలో సిలువ త్యాగ బంధం (2)      ||కలలాంటి||

నేనేమిటో నా గతమేమిటో
తెలిసిన వారే క్షమియించలేరే
నా నడకేమిటో పడకేమిటో
ఎరిగిన వారే మన్నించలేరే
హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా
ధన్యునిగా నను మార్చినావే (2)       ||కలలాంటి||

నేనేమిటో నా విలువేమిటో
తెలియకనే తిరుగాడినానే
నీవేమిటో నీ ప్రేమేమిటో
ఎరుగక నిను నే ఎదిరించినానే
హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా
దీవెనగా నను మార్చినావే (2)       ||కలలాంటి||

Lyricist: P Satish Kumar

Kalalaanti Brathuku Naadi
Kanneeti Oota Naadi (2)
Kalalonainaa Oohinchalede
Kamaneeyamaina Ee Bandham
Kalvarilo Siluva Thyaaga Bandham (2)      ||Kalalaanti||

Nenemito Naa Gathamemito
Thelisina Vaare Kshamiyinchalere
Naa Nadakemito Padakemito
Erigina Vaare Manninchalere
Heyudanai Chediyundagaa.. Naa Yesayyaa
Dhanyunigaa Nanu Maarchinaave (2)      ||Kalalaanti||

Nenemito Naa Viluvemito
Theliyakane Thirugaadinanaae
Neevemito Nee Prememito
Erugaka Ninu Ne Edirinchinaane
Heenudanai Padiyundagaa.. Naa Yesayyaa
Deevenagaa Nanu Maarchinaave (2)      ||Kalalaanti||

కన్నీటి లోయలలో / Kanneeti Loyalalo

కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు – కార్యము జరిగించును (2)
నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ  – నేనుందున్ అంతం వరకు (2) ||కన్నీటి||

చీకటి బాటయైనా – భయంకర శోధన
కలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై (2) ||నీ మనసు||

ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్ (2) ||నీ మనసు||

ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు (2) ||నీ మనసు||

Kanneeti Loyalalo – Nenentho Krunginanoo
Kanneeru Choochuvaadu – Kaaryamu Jariginchunu (2)
Nee Manasu Kadalakundaa – 
Nee Manasu Krungakundaa
Neethone Ellappuduu – Nenundun Antham Varaku (2)   ||Kanneeti||

Cheekati Baatayainaa – Bhayankara Shodhana
Kaluvun Aa Velalo – Siluva Needa Neekai (2) ||Nee Manasu||

Erra Samudra Theeram – Morralidin Thana Daasulu
Gundello Daagi Unna – Goppa Baadha Tholagen (2)  ||Nee Manasu||

Entha Kaalam Vechi Undaali – Naathaa Nee Raakadakai
Shramalu Theerutaku – Entho Kaalam Ledu (2)      ||Nee Manasu||

కట్టెలపై నీ శరీరం / Kattelapai Nee Shareeram

కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా
కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2)        ||కట్టెలపై||

దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2)         ||ఎన్ని చేసినా||

ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)         ||ఎన్ని చేసినా||

Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Mallee
Mattilona Pettina Ninne Gurthinchadu Nee Thalli
Enni Chesinaa Thanuvu Namminaa
Katte Migilchindi Kanneeti Gaadha – (2)         ||Kattelapai||

Devaadi Devude Thana Polika Neekichchenu
Thana Aasha Neelo Choosi Parithapinchipovaalani (2)
Kanna Thandrine Narachi Kaatikellipothaavaa
Nithya Jeevam Vidachi Narakamelli Pothaavaa (2)         ||Enni Chesinaa||

Aathma Neelo Untene Andaru Ninu Premisthaaru
Adi Kaastha Vellipothe Evariki Nee Avasaramundadu (2)
Kannavaare Unnanu Kattukunna Vaarunnanu
Evvarikee Kanipinchaka Nee Aathma Vellipovunu (2)         ||Enni Chesinaa||