నా కలవరములన్ని / Naa Kalavaramulanni

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

నా కలవరములన్ని కనుమరుగు చేసినావు
నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

నీ చేయి నన్ను సంరక్షించెను
నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి
శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు
జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2)       ||నా కలవరము||

నిన్ను నమ్మువారు సీయోనులో చేరి
నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2)       ||నా కలవరము||

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

Naa Kalavaramulanni Kanumarugu Chesinaavu
Naa Kanneellu Nee Buddilo Daachi Kavilelo Vraasinaavu – (2)
Naa Praananni Nee Jeevapu Mootalo
Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||

Nee Cheyi Nannu Samrakshinchenu
Naa Shathruvulu Keedu Cheyalekapoyiri (2)
Naa Praanaanni Nee Jeevapu Mootalo
Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||

Yehovaa Yuddhamulu Cheyutaku Krupanichchithivi
Shaashwathamaina Santhathini Swaasthyamugaa Naakichchithivi (2)
Naa Praanaanni Nee Jeevapu Mootalo
Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||

Brathuku Dinamulannitanu Apaayame Raadu
Jeevitha Kaalamanthaa Naaku Keede Ledu (2)
Naa Praanaanni Nee Jeevapu Mootalo
Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||

Ninnu Nammuvaaru Seeyonulo Cheri
Nithyaanandapu Bhaagyamunu Pondedaru (2)
Naa Praanaanni Nee Jeevapu Mootalo
Kattinaavaa Yesayya Bahu Prematho (2)         ||Naa Kalavaramu||

చాచిన చేతులు నీవే / Chaachina Chethulu Neeve

చాచిన చేతులు నీవే
అరచేతిలో చెక్కినావే
కమ్మని అమ్మవు నీవే
కాచిన తండ్రివి నీవే
నీలా ఎవరు ప్రేమిస్తారు
నాకై ప్రాణం అర్పిస్తారు
కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
కళ్ళార్పకుండా కాపాడతారు       ||చాచిన||

కొండలు గుట్టలు చీకటి దారులు
కనిపించదే కళ్ళు చిట్లించినా
కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
అన్నారు పడతావొక్క అడుగేసినా
రక్షించే వారే లేరని
నీ పనైపోయిందని (2)
అందరు ఒక్కటై అరచేసినా
అపవాదులెన్నో నాపై మోపేసినా (2)
నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
శత్రువును కూల్చేసి నిలబెట్టినావు        ||చాచిన||

పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
అవమానపడతాడని నవ్వేసినా
చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
నీవెంత నీ బ్రతుకెంతని
నిలువలేవు నీవని (2)
అందరు ఒక్కటై తేల్చేసినా
కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2)
నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
నా గిన్నె నింపేసి నడిపించినావు         ||చాచిన||

Chaachina Chethulu Neeve
Arachethilo Chekkinaave
Kammani Ammavu Neeve
Kaachina Thandrivi Neeve
Neelaa Evaru Premisthaaru
Naakai Praanam Arpisthaatu
Kanneellu Thudichi Karunisthaaru
Kallaarpakundaa Kaapaadathaaru ||Chaachina||

Kondalu Guttalu Cheekati Daarulu
Kanipinchade Kallu Chitlinchinaa
Kaaraalu Miriyaalu Nooreti Prajalu
Annaaru Padthaavokka Adugesinaa
Rakshinche Vaare Lerani
Nee Panaipoyindani (2)
Andaru Okkatai Arachesinaa
Apavaadulenno Naapai Mopesinaa (2)
Nee Cheyi Chaachesi – Cheekatini Cheelchesi
Shathruvunu Koolchesi – Nilabettinaavu        ||Chaachina||

Pedodu Pirikodu Prabhu Sevakochchaadu
Avamaanapadathaadani Navvesinaa
Chinnodu Neevantu Arhatha Ledantu
Ainollu Kaanollu Cheppesinaa
Neeventha Nee Brathukenthani
Niluvalevu Neevani (2)
Andaru Okkatai Thelchesinaa
Koolcheyaalani Nannu Krushichesinaa (2)
Nee Aathmatho Nimpesi – Niraashanu Koolchesi
Naa Ginne Nimpesi – Nadipinchinaavu         ||Chaachina||