నాదు చిన్న హృదయము యేసు సదనము (సీయోను పిల్లల పాటలు)/ Naadu Chinna Hrudayamu Yesu Sadanamu

…ఊరకుండుమని… చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. మార్కు 4:39

1. నాదు చిన్న హృదయము యేసు సదనము

    అందులోన యేసుడు వసించుచుండును(2)

    దుష్టుడు, దురాత్ముడు నన్ను పిలిచినా

    యేసు ప్రభుని చూచి వాడు పారిపోవును(2)

2. నాదు చిన్న హృదయము నావ వంటిది

    నాదు చిన్ని నావను యేసే నడుపును

    భీకర తుఫానులు కదలివచ్చినా

   యేసు ప్రభుని మాటతోడ నిమ్మళించును

నా హృదయము యేసుని తోట – దాని ఫలితము నే నిత్తును (సీయోను పిల్లల పాటలు) / Naa Hrudayamu Yesuni Thota

నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. కీర్తన 51:2

పల్లవి : నా హృదయము యేసుని తోట – దాని ఫలితము నే నిత్తును (2)

          నే ప్రేమతో సేవను చేతును – ప్రేమ మాటలు పలికెదను          (2)

1. నా హృదయపు తోట కడుగుము – ఓ ప్రేమగల యేసు   (2)

    గురుగులు, రాళ్లు, ముళ్లును – తీసివేయుము నానుండి (2) ॥నా॥

2. నా హృదయపు తోటలోనికి రా – ఓ ప్రేమగల యేసు    (2)

    నీ తోటగ చేసికొనుము – యజమానుడవు కమ్ము        (2) ॥నా॥

నా హృదయము వింతగ మారెను (సీయోను పిల్లల పాటలు) / Naa Hrudayamu Vinthagaa Maarenu

నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాను. యోహాను 9:25

1. నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందున (1)

పల్లవి : సంతోషమే సమాధానమే (3) చెప్పనశక్యమైన సంతోషం (1)

2. తెరువబడెను నా మనోనేత్రము (3) యేసు నన్ను ముట్టినందున (1)

3. ఈ సంతోషము నీకు కావలెనా? (3) నేడే యేసునొద్దకు రమ్ము (1)

4. నిత్య సమాధానం నీకు కావలెనా? (3) నేడే యేసునొద్దకు రమ్ము(1)

5. నిత్యజీవము నీకు కావలెనా? (3) నేడే యేసునొద్దకు రమ్ము(1)

6. మోక్షభాగ్యము నీకు కావలెనా? (3) నేడే యేసునొద్దకు రమ్ము(1)

7. యేసుక్రీస్తును నేడే చేర్చుకో (3) ప్రవేశించు నీయుల్లమందు(1)

నూతన హృదయము / Noothana Hrudayamu

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

నూతన హృదయము నూతన స్వభావము
నూతన ప్రారంభం నాకు దయచేయుము
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
నలిగిన మనస్సును నూతన పరచుము
యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
నా బలహీనతలన్ని యెరిగియున్నావు
రాతి గుండెను నాలో తీసివేయుము
అతి మెత్తని హృదయము దయచేయుము         ||నూతన హృదయము||

జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని
నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
శుద్ధజలమును నాపై వెదజల్లుము
హిమము కంటెను తెల్లగా కడిగివేయుము         ||నూతన హృదయము||

నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను
నీ శరణు కోరువారిని త్రోసివేయవు
కృపగల మహాదేవ నన్ను మన్నించుము
సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును         ||నూతన హృదయము||

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Noothana Hrudayamu Noothana Swabhaavamu
Noothana Praarambham Naaku Dayacheyumu
Chedarina Brathukunu Pagilina Gundenu
Naligina Manassunu Noothana Parachumu
Yesu Neeve Nannu Srujiyinchina Vaadavu
Naa Balaheenathalanni Yerigiyunnaavu
Raathi Gundenu Naalo Theesiveyumu
Athi Metthani Hrudayamu Dayacheyumu        ||Noothana Hrudayamu||

Jeevamunu Vadulukuni Velupalaku Ne Paaripothini
Paapamulo Bhogamunu Aashinchi Ne Mosipothini
Naa Deham Naa Hrudayam Vyasanamuthone Nindipoyenu
Heenamugaa Digajaari Ghoramugaa Ne Krungipothini
Ninnu Vidachi Ne Kshanamainaa Brathukaleka
Venuthirigi Nee Chenthaku Vacchuchunnaanu
Shuddha Jalamunu Naapai Vedajallumu
Himamu Kantenu Thellagaa Kadigiveyumu        ||Noothana Hrudayamu||

Naa Paapam Aparaadham Naanundi Dooramu Cheyuduvu Ani
Naa Bhayamu Avamaanam Bidyamunu Tholaginchi Vethuvani
Naa Gathamu Gnaapakamu Nee Madilo Ika Daachukovu Ani
Ninnerigi Dhairyamugaa Nee Mundu Ne Nilabadiyunnaanu
Nee Sharanu Koruvaarini Throsiveyavu
Krupagala Mahaadeva Nannu Manninchumu
Sadaa Kruthagnatha Sthuthulu Neeke Arpinthunu
Sarva Mahima Prabhaavamu Neeke Chellunu        ||Noothana Hrudayamu||

నీ చిత్తమునే / Nee Chitthamune

పాట రచయిత: శ్రీనివాస్ బండారు
Lyricist:
 Srinivas Bandaru

నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని
నీ కృపావరమునే దానముగా దయచేసి (2)
నీ ప్రేమలో పరవశించి
నీ సన్నిధిలో నే చేరి
నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను
దేవా… నా దేవా…
నా యేసయ్యా నా రక్షకుడా (2)      ||నీ చిత్తమునే||

హృదయము బద్దలై ఏడ్చిన వేళ
కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2)
నీ చిత్తముకై నే ఎదురు చూసి
నీ బలము పొంద సహియింప చేసి
నా ప్రాణమును తృప్తి పరచితివే       ||దేవా||

నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా
భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2)
నా శత్రువుపై నాకు జయమునిచ్చి
నా ఆశ్రయమై ధైర్యమును నింపి
నా కోట నీవైతివే       ||దేవా||

పాట రచయిత: శ్రీనివాస్ బండారు
Lyricist:
 Srinivas Bandaru

Nee Chitthamune Neraverchutakai Nanu Ennukoni
Nee Krupaa Varamune Daanamugaa Dayachesi (2)
Nee Premalo Paravashinchi
Nee Sannidhilo Ne Cheri
Nee Naamamunu Nee Premanu Nenu Ghanaparachedanu
Devaa.. Naa Devaa…
Naa Yesayyaa Naa Rakshakudaa (2)          ||Nee Chitthamune||

Hrudayamu Baddalai Edchina Vela
Kanneeti Praardhana Chesina Vela (2)
Nee Chitthamukai Ne Eduru Choosi
Nee Balamu Ponda Sahiyimpa Chesi
Naa Praanamunu Thrupthi Parachithive         ||Devaa||

Naaloni Praanam Thalladillipogaa
Bhoodiganthamula Nundi Morra Pettuchunnaanu (2)
Naa Shathruvupai Naaku Jayamunichchi
Naa Aashrayamai Dhairyamunu Nimpi
Naa Kota Neevaithive         ||Devaa||

నా మనో నేత్రము / Naa Mano Nethramu

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

నా మనో నేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి (2)
అంధకారములో నేనుండ (2)
వెదకి నన్ రక్షించితివి (2)       ||నా మనో||

నే పాప భారము తోడ
చింతించి వగయుచునుంటి (2)
కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)
పొంది నన్ విడిపించితివి (2)         ||నా మనో||

ఎన్నాళ్ళు బ్రతికిననేమి
నీకై జీవించెద ప్రభువా (2)
బాధలు శోధనలు శ్రమలలో (2)
ఓదార్చి ఆదుకొంటివయా (2)         ||నా మనో||

నీ సన్నిధిని నే కోరి
నీ సన్నిధిలో నే మారి (2)
స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2)
యుగయుగములు సర్వ యుగములు (2)          ||నా మనో||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Naa Mano Nethramu Therachi
Naa Katina Hrudayamunu Maarchi (2)
Andhakaaramulo Nenunda (2)
Vedaki Nan Rakshinchithivi (2)           ||Naa Mano||

Ne Paapa Bhaaramu Thoda
Chinthinchi Vagayuchununti (2)
Kalvari Siluvalo Naa Shramalan (2)
Pondi Nan Vidipinchithivi (2)             ||Naa Mano||

Ennaallu Brathikinanemi
Neekai Jeevincheda Prabhuvaa (2)
Badhalu Shodhanalu Shramalalo (2)
Odaarchi Aadukontivayaa (2)           ||Naa Mano||

Nee Sannidhini Ne Kori
Nee Sannidhilo Ne Maari (2)
Sthuthi Paathraga Aaraadhinthun (2)
Yugayugamulu Sarva Yugamulu (2)        ||Naa Mano||

నా చిన్ని హృదయము / Naa Chinni Hrudayamu

పాట రచయిత: లోయిస్ యార్లగడ్డ
Lyricist: Lois Yarlagadda

నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ
నిను చాటనీ – నిను ఘనపరచనీ
నీ రాకకై వేచియుండనీ         ||నా చిన్ని||

కావలివారూ వేకువకై చూచునట్లు
నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2)
నా ప్రాణము నీకై యెదురు చూడనీ         ||నా చిన్ని||

దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా
నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2)
నా ప్రాణము నిన్నే ఆశింపనీ         ||నా చిన్ని||

పనివారు యజమాని చేతివైపు చూచునట్లు
నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2)
నా కన్నులు నీపైనే నిలచియుండనీ         ||నా చిన్ని||

పాట రచయిత: లోయిస్ యార్లగడ్డ
Lyricist: Lois Yarlagadda

Naa Chinni Hrudayamu Ninne Preminchanee
Ninu Chaatanee – Ninu Ghanaparachanee
Nee Raakakai Vechiyundanee        ||Naa Chinni||

Kaavalivaaru Vekuvakai Choochunatlu
Naa Praanamu Neekai Yeduru Choodanee (2)
Naa Praanamu Neekai Yeduru Choodanee        ||Naa Chinni||

Duppi Neeti Vaagulakai Aashinchunatlugaa
Naa Praanamu Ninne Aashimpanee (2)
Naa Praanamu Ninne Aashimpanee        ||Naa Chinni||

Panivaaru Yajamaani Chethivaipu Choochunatlu
Naa Kannulu Neepaine Nilachiyundanee (2)
Naa Kannulu Neepaine Nilachiyundanee        ||Naa Chinni||

అడిగినది కొంతే అయినా / Adiginadi Konthe Ainaa

పాట రచయిత: క్రాంతి చేపూరి

అడిగినది కొంతే అయినా
పొందినది ఎంతో దేవా
ప్రతిగా ఏమివ్వగలనయా
నిను స్తుతియించే హృదయము తప్ప
నా జీవితం నీకే అంకితమయ్యా – (4)            ||అడిగినది||

ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే
తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తోత్రము తగును            ||అడిగినది||

క్షణ భంగురం నా క్షయ జీవితం
కాచావయ్యా నను నీ రెక్కల నీడ
ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను
హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ
నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా                 ||అడిగినది||

మహిమోన్నతుడా నను మరువని విభుడా
ప్రణుతించెదను నిన్నే నిరతం
నిష్కలంకుడా నిర్మలాత్ముడా
ప్రకటించెదను నీ పావన చరితం
నా అతిశయము నీవే నా యేసయ్యా
నా ఆధారము నీవే నా మెస్సయ్యా
నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
ఈ దీన సేవను చేకొనుమయ్యా          ||అడిగినది||

Lyricist: Kranthi Chepuri

Adiginadi Konthe Ainaa
Pondinadi Entho Devaa
Prathigaa Emivvagalanayaa
Ninu Sthuthiyinche Hrudayamu Thappa
Naa Jeevitham Neeke Ankithamayyaa – (4)          ||Adiginadi||

Oohinchaleni Vivarimpajaalani
Nee Kaaryamulu Aascharyame
Yochinchinaa Naa Varnanakandani
Nee Krupaa Kanikaramulu Athyunnathame
Tharatharamulaku Maarani Nee Unnatha Premaa
Yugayugamulaku Neeke Ghanatha Mahimaa
Sathatham Ninu Ne Koniyaadedanu
Sakalam Nee Naamamuke Sthothramu Thagunu       ||Adiginadi||

Kshana Bhanguram Naa Kshaya Jeevitham
Kaachaavayyaa Nanu Nee Rekkala Needa
Ae Yogyatha Leni Alpuraala Nannu
Hechchinchaavayyaa Nee Prema Thoda
Naa Aashraya Durgamu Neeve Yesayya
Naa Rakshana Shrungamu Neeve Messaiah
Naa Sthuthiki Paathrudavu Neevenayyaa
Ee Sthothra Keerthana Neekenayyaa               ||Adiginadi||

Mahimonnathudaa Nanu Maruvani Vibhudaa
Pranuthinchedanu Ninne Niratham
Nishkalankudaa Nirmalaathmudaa
Prakatinchedanu Nee Paavana Charitham
Naa Athishayamu Neeve Naa Yesayyaa
Naa Aadhaaramu Neeve Naa Messaiah
Naa Aaraadhana Aalaapana Neekenayya
Ee Deena Sevanu Chekonumayyaaa            ||Adiginadi||