నా యేసయ్యా నా స్తుతియాగము / Naa Yesayyaa Naa Sthuthiyaagamu

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

నా యేసయ్యా నా స్తుతియాగము
నైవేద్యమునై ధూపము వోలె
నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2)

ఆత్మతోను మనసుతోను
నేను చేయు విన్నపములు (2)
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయుచున్నావా (2)
విజ్ఞాపన చేయుచున్నావా       ||నా యేసయ్యా||

ప్రార్థన చేసి యాచించగానే
నీ బాహు బలము చూపించినావు (2)
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా (2)
మరణ భయము తొలగించితివా         ||నా యేసయ్యా||

మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు (2)
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగి వచ్చెదవు (2)
రారాజుగా దిగి వచ్చెదవు        ||నా యేసయ్యా||

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Naa Yesayyaa Naa Sthuthiyaagamu
Naivedyamunai Dhoopamu Vole
Nee Sannidhaanamu Cherunu Nithyamu
Chethuvu Naaku Sahaayamu Venuventane – Venuventane (2)

Aathmathonu Manasuthonu
Nenu Cheyu Vinnapamulu (2)
Aalakinchi Thandri Sannidhilo Naakai
Vignaapana Cheyuchunnaavaa (2)
Vignaapana Cheyuchunnaavaa         ||Naa Yesayyaa||

Praarthana Chesi Yaachinchagaane
Nee Baahu Balamu Choopinchinaavu (2)
Maranapu Mullunu Virichithivaa Naakai
Marana Bhayamu Tholaginchithivaa (2)
Marana Bhayamu Tholaginchithivaa       ||Naa Yesayyaa||

Melakuva Kaligi Praarthana Chesina
Shodhanalanniyu Thappinchedavu (2)
Nee Prathyakshatha Ne Choochutake Naakai
Raaraajugaa Digi Vachchedavu (2)
Raaraajugaa Digi Vachchedavu        ||Naa Yesayyaa||

ఎలోహిం ఎలోహిం/Elohim Elohim

పాట రచయిత: అంశుమతి మేరీ

హోలీ హోలీ హోలీ
హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ
హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2)

ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2)
శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము
సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం
అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2)
నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు
నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్
పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2)
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

అడోనై అడోనై అడోనై అడోనై
ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2)
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

యావే యావే యావే యావే
యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2)
పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు
ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2)
హల్లెలూయా హల్లెలూయా – (2)
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

Lyricist: Amshumathi Mary

Holy Holy Holy
He is the Lord God Almighty
Who was and is and is to come (2)

Elohim Elohim Elohim Elohim
Balamaina Devudavu – Balavanthudavu Neevu – (2)
Shoonyamulo Samasthamunu – Niraakaamulo Aakaaramu
Srujiyinchinaavu Neevu – Sarva Srushtikarthavu Neevu – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

El Olam El Olam El Olam El Olam
Alphaa Omegavu – Nithyudaina Devudavu – (2)
Nithya Nibandhana Chesaavu – Nibandhanani Sthiraparachaavu
Ninnaa Nedu Repu – Maarani Devudavu Neevu – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

El Shaddai El Shaddai El Shaddai El Shaddai
Poshinchu Devudavu – Aashraya Durgamu Neevu – (2)
Rekkalapai Mosedi Vaadaa – Rakshana Shrungamu Neevegaa
Nee Maatuna Daache Devaa – Maatanu Neraverche Devaa – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

Adonai Adonai Adonai Adonai
Prabhuvaina Devudavu – Prabhuvulaku Prabhuvu Neevu – (2)
Sarvaadhikaarivi Neevu – Sakala Janulaku Prabhuvu Neevu
Neeve Naaku Prabhuvu – Neeve Naa Yajamaanudavu – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

Yaahwe Yaahwe Yaahwe Yaahwe
Yehovaa Devaa – Sainyamulaku Adhipathivi – (2)
Parishuddha Devudavu Neevu – Unnavaadanani Annaavu
Prabhu Yesunu Pampina Devaa – Paapamu Tholaginchina Devaa – (2)
Hallelooyaa Hallelooyaa – (2)
Hallelooyaa Hallelooyaa
Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)

దావీదు తనయా హోసన్నా / Daaveedu Thanayaa Hosannaa

హోసన్నా…
హోసన్నా హోసన్నా హోసన్నా (3)
అయ్యా.. దావీదు తనయా హోసన్నా
యూదుల రాజా యేసన్నా (2)
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా      ||దావీదు||

గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
పిల్లలు పెద్దలు జగమంతా (2)
నీకై వేచెను బ్రతుకంతా      ||దావీదు||

కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
కంచర వాహన నీ పయనాలు (2)
జనావాహినికే సుబోధకాలు      ||దావీదు||

పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
మకుటము లేని ఓ మహరాజా (2)
పరిచితిమివిగో మా హృదయాలు      ||దావీదు||

Hosannaa…
Hosannaa Hosannaa Hosannaa (3)
Ayya.. Daaveedu Thanayaa Hosannaa
Yoodhula Raajaa Yesannaa (2)
Hosannaa Hosannaa – Yesannaa Yesannaa         ||Daaveedu||

Girulu Tharulu Saagarulu
Neekai Veechenu Vindhyaamaralu
Hosannaa Hosannaa – Yesannaa Yesannaa
Girulu Tharulu Saagarulu
Neekai Veechenu Vindhyaamaralu
Pillalu Peddalu Jagamanthaa (2)
Neekai Vechenu Brathukanthaa         ||Daaveedu||

Karunaa Rasamaya Nee Nayanaalu
Samathaa Mamathala Sankethaalu
Hosannaa Hosannaa – Yesannaa Yesannaa
Karunaa Rasamaya Nee Nayanaalu
Samathaa Mamathala Sankethaalu
Kanchara Vaahana Nee Payanaalu (2)
Janavaahinike Subodhakaalu         ||Daaveedu||

Pedhala Paaliti Pennidhivai
Paapula Rakshakudainaavu
Hosannaa Hosannaa – Yesannaa Yesannaa
Pedhala Paaliti Pennidhivai
Paapula Rakshakudainaavu
Makutamu Leni O Maharaajaa (2)
Parichithimivigo Maa Hrudayaalu         ||Daaveedu||

తన రక్తంతో కడిగి / Thana Rakthamtho Kadigi

తన రక్తంతో కడిగి
నీ ఆత్మతో నింపావు (2)
యేసయ్యా… నీవే శుద్ధుడా

తన రక్తంతో కడిగి
నీ ఆత్మతో నింపావు (2)
హోసన్నా నా యేసు రాజా
హల్లెలూయా నా జీవన దాతా (4)

యేసయ్యా
సిలువపై వేళాడితివా
నీ కలువరి ప్రేమ చూపించితివి (2)
సిలువపై వేళాడితివా
నా పాపమునంతా కడిగితివి
సిలువపై వేళాడితివా
నీ కలువరి ప్రేమ చూపించితివే         ||హోసన్నా||

Thana Rakthamtho Kadigi
Nee Aathmatho Nimpaavu (2)
Yesayyaa… Neeve Shuddhudaa

Thana Rakthamtho Kadigi
Nee Aathmatho Nimpaavu (2)
Hosannaa Naa Yesu Raajaa
Hallelujah Naa Jeevana Dhaathaa (4)

Yesayyaa…
Siluvapai Velaadithivaa
Nee Kaluvari Prema Choopinchithivi (2)
Siluvapai Velaadithivaa
Naa Paapamunanthaa Kadigithivi
Siluvapai Velaadithivaa
Nee Kaluvari Prema Choopinchithive       ||Hosannaa||

హోసన్ననుచూ స్తుతి పాడుచూ / Hosannanuchu Sthuthi Paaduchu

హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)
హోసన్నా… హోసన్నా… (4)           ||హోసన్ననుచూ||

ఈ లోకయాత్రలో బాటసారులం
ఈ జీవన కడలిలో పరదేశులం (2)
క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయ నగరం మనకు శాశ్వతం (2)        ||హోసన్నా||

మన్నయిన ఈ దేహం మహిమరూపమై
ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)
నాధుడేసుకు నవ వధువులము
నీతి పాలనలోన యువరాణులము (2)           ||హోసన్నా||

ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)
ఆకలి లేదు దప్పిక లేదు
ఆహా మన యేసుతో నిత్యమానందం (2)          ||హోసన్నా||

Hosannanuchu Sthuthi Paaduchu Seeyonuku Cheredam (2)
Hosannaa.. Hosannaa.. (2)        ||Hosannanuchu||

Ee Lokayaathralo Baatasaarulam
Ee Jeevana Kadalilo Paradeshulam (2)
Kshana Bhanguram Ee Kshaya Jeevitham
Akshaya Nagaram Manaku Shaashwatham (2)       ||Hosannaa||

Mannayina Ee Deham Mahima Roopamai
Davala Varna Vasthramulu Dhariyinchedamu (2)
Naadhudesuku Nava Vadhuvulamu
Neethi Paalanalona Yuva Raanulamu (2)      ||Hosannaa||

Prathi Baashpa Binduvunu Thudichiveyunu
Chinthalanni Theerchi Chentha Niluchunu (2)
Aakali Ledu Dappika Ledu
Aahaa Mana Yesutho Nithyamaanandam (2)        ||Hosannaa||

హోసన్నా హల్లెలూయా / Hosannaa Hallelooyaa

హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా (2)
స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము (2)
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2)           ||హోసన్నా||

కెరూబులు సెరూపులు
ఇరువది నలుగురు పెద్దలతో (2)
నాలుగు జీవుల గానాలతో (2)
స్తుతియింపబడుచున్న యేసునకు (2)           ||హోసన్నా||

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
సర్వ సృష్టికి మూలకారకుడు (2)
మృతుడై మరలా బ్రతికినవాడు (2)
మేఘముపై రానున్న యేసునకు (2)           ||హోసన్నా||

Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa (2)
Sthothra roopamu Krottha Geethamul Noraara Paadedamu (2)
Rakshakudau Prabhu Yesu Kreesthuku
Sthuthi Sthothramul Chellinthumu (2)         ||Hosannaa||

Keroobulu Seroopulu
Iruvadi Naluguru Peddalatho (2)
Naalugu Jeevula Gaanaalatho (2)
Sthuthiyimpabaduchunna Yesunaku (2)         ||Hosannaa||

Parishuddhudu Athi Parishuddhudu
Sarva Srushtiki Moolakaarakudu (2)
Mruthudai Maralaa Brathikinavaadu (2)
Meghamupai Raanunna Yesunaku (2)         ||Hosannaa||

ఆనందింతు నీలో దేవా (హోసన్నా మినిస్ట్రీస్) / Aanandinthu Neelo Devaa

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్

ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు (2)
మధురమైన నీ నామమునే (2)
మరువక ధ్యానించెద ప్రభువా           ||ఆనందింతు||

ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా (2)
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర (2)         ||ఆనందింతు||

నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా (2)
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన (2)         ||ఆనందింతు||

శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న (2)
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము (2)         ||ఆనందింతు||

శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ (2)
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2)         ||ఆనందింతు||

Lyricist: Hosanna Ministries

Aanandinthu Neelo Devaa
Anudinam Ninu Sthuthinchuchu (2)
Madhuramaina Nee Naamamune (2)
Maruvaka Dhyaaninicheda Prabhuvaa         ||Aanandinthu||

Aathma Naathaa Adrushya Devaa
Akhila Charaalaku Aadhaarundaa (2)
Anayamu Ninu Madi Koniyaaduchune
Aanandinthu Aasha Theera (2)       ||Aanandinthu||

Naadu Janamulu Nanu Vidachinanu
Nannu Neevu Viduvakunda (2)
Nee Kanu Drushti Naapai Nunchi
Naaku Rakshana Shrungamaina (2)       ||Aanandinthu||

Shreshtamagu Nee Swaasthyamu Korakai
Meghamandu Raanaiyunna (2)
Aa Ghadiya Epudo Evariki Thelusu
Antham Varakunu Bhadra Parachumu (2)       ||Aanandinthu||

Shramalu Nannu Chuttina Vela
Chinthalo Krushinchina Vela (2)
Abhayamugaa Nee Darshanamichchi
Shramalu Baapi Shaanthinichchithivi (2)       ||Aanandinthu||