ఎవరు తిరిగి జన్మించెదరో  (సీయోను పిల్లల పాటలు)/ Evaru Thirigi Janminchedaro  

క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు… యోహాను 3:3

ఎవరు తిరిగి జన్మించెదరో – వారికి శిక్ష లేదు                (2)

నిత్య జీవమునకు వారసులై – పరలోక మొందెదరు          (2)

అద్భుత జీవితము – క్రీస్తునందు నమ్మిన                        (1)

దేవుని పిల్లలై ధన్యులై వారు పరలోక మొందెదరు            (2)

నీకు సాటి ఎవరు / Neeku Saati Evaru Leru

నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)
ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నీదు క్రియలు కొనియాడెదను (2)
అత్యున్నతుడా నా యేసయ్యా
నీవే నాకు నిజ రక్షకుడవు (2)         ||నీకు||

పరమందు దూతలు నిను పొగడుచుందురు
నీవే ప్రభువుల ప్రభువని (2)
నీ ఘన కీర్తిని వివరించగలనా
నా ప్రియుడా నా యేసయ్యా (2)        ||అత్యున్నతుడా||

ఆకాశమనాడు ఆసీనుడైనవాడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2)
ఊహించువాటి కంటే అత్యధికముగా
దయచేయువాడవు నీకే స్తోత్రం (2)        ||అత్యున్నతుడా||

Neeku Saati Evaru Leru (Yesayyaa)
Ilalo Neeve Ekaika Devudavu (2)
Aathmatho Sathyamutho Aaraadhinthunu
Needu Kriyalu Koniyaadedanu (2)
Athyunnathudaa Naa Yesayyaa
Neeve Naaku Nija Rakshakudavu (2)         ||Neeku||

Paramandu Doothalu Ninu Pogaduchunduru
Neeve Prabhuvula Prabhuvani (2)
Nee Ghana Keerthini Vivarinchagalanaa
Naa Priyudaa Naa Yesayyaa (2)        ||Athyunnathudaa||

Aakaashmanadu Aaseenudainavaadaa
Nee Thattu Kannuletthuchunnaanu (2)
Oohinchuvaati Kante Athyadhikamugaa
Dayacheyuvaadavu Neeke Sthothram (2)        ||Athyunnathudaa||

ఎవరున్నారు నాకోసం / Evarunnaru Naa Kosam

ఎవరున్నారు నాకోసం

సంపాదించగా ఈ దేశం

అడుగుచున్నది తండ్రి స్వరం

స్వీకరించవా ఈ భారం                                 ॥ఎవ॥

1. అడుగుపెట్టగ ప్రతీస్థలం

తలుపుతట్టగ ప్రతీ గృహం

పరుగులెత్తగ ప్రతీదినం

పంచిపెట్టగ ప్రభువాక్యం                                 ॥ఎవ॥

2. ప్రార్ధన చేయగ నిరంతరం

నశియించే ఆత్మలకోసం

చూపించగ రక్షణ ద్వారం

చాటించగ దేవుని రాజ్యం                             ॥ఎవ॥

ఎవరూ లేక ఒంటరినై/Evaru Leka Ontarinai

ఎవరూ లేక ఒంటరినై
అందరికి నే దూరమై (2)
అనాథగా నిలిచాను
నువ్వు రావాలేసయ్యా (4)

స్నేహితులని నమ్మాను మోసం చేసారు
బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4)            ||ఎవరు లేక||

నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4)       ||ఎవరు లేక||

చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||

Evaru Leka Ontarinai
Andariki Ne Dooramai (2)
Anaathagaa Nilichaanu
Nuvvu Raavaalesayyaa (4)

Snehithulani Nammaanu Mosam Chesaaru
Bandhuvulani Nammaanu Droham Chesaaru (2)
Deenudanai Andhudanai
Anaathagaa Ne Nilichaanu (2)
Nuvvu Raavaalesayyaa (4)          ||Evaru Leka||

Nenunnaanu Nenunnaanani Andaru Antaaru
Kashtaallo Baadhallo Tholagipothaaru (2)
Deenudanai Andhudanai
Anaathagaa Ne Nilichaanu (2)
Nuvvu Raavaalesayyaa (4)       ||Evaru Leka||

Chirakaalam Nee Prema Kalakaalam Undaali
Shaashwathamaina Nee Prema Kalakaalam Undaali (2)
Deenudanai Andhudanai
Anaathagaa Ne Nilichaanu (2)
Nuvvu Raavaalesayyaa (4)         ||Evaru Leka||

ఎవరు నన్ను చేయి విడచినన్‌/Evaru Nannu Cheyi Vidachinan

ఎవరు నన్ను చేయి విడచినన్‌
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
నిన్ను చేయి విడువడు       ||ఎవరు ||

తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2)          ||ఎవరు||

వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2)          ||ఎవరు||

రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)          ||ఎవరు||

ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2)          ||ఎవరు||

Evaru Nannu Cheyi Vidachinan
Yesu Cheyi Viduvadu (2)
Cheyi Viduvadu (3)
Ninnu Cheyi Viduvadu          ||Evaru||

Thalli Aayane Thandri Aayane (2)
Laalinchunu Paalinchunu (2)          ||Evaru||

Vedana Shramalu Unnappudallaa (2)
Vedukondune Kaapaadune (2)          ||Evaru||

Rakthamu Thoda Kadigi Vesaade (2)
Rakshana Santhosham Naaku Ichchaade (2)          ||Evaru||

Aathma Chetha Abhishekinchi (2)
Vaakyamuche Nadupuchunnaade (2)       ||Evaru||

ఎవరు చూపించలేని/Evaru Choopinchaleni

పాట రచయిత: జాషువా షేక్

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా       ||ఎవరు||

తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా       ||ఎవరు||

ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా       ||ఎవరు||

Lyricist: Joshua Shaik

Evaru Choopinchaleni – Ilalo Nanu Veediponi
Enthati Prema Needi – Inthagaa Korukundi – Maruvanu Yesayyaa (2)
Nee Kathe Nanne Thaakagaa – Naa Madhe Ninne Cheragaa
Naa Gure Neevai Yundagaa – Nee Dhare Ne Cheraanugaa          ||Evaru||

Theeraale Dooramaaye – Kaalaale Maaripoye
Eduraina Endamaave – Kanneeti Kaanukaaye
Naa Gunde Lothulona – Ne Naligipothuvunnaa
Ae Daari Kaanaraaka – Nee Koraku Vechi Unnaa
Edabaatu Leni Gamanaana – Ninu Cherukunna Samayaana
Nanu Aadarinche Ghana Prema – Apuroopamaina Tholi Prema
Ekamai Thodugaa – Oopire Neevugaa
Evvaru Lerugaa – Yesayyaa Neevegaa          ||Evaru||

Ee Loka Jeevithaana – Vesaaripothuvunnaa
Viluvaina Needu Vaakyam – Veliginche Naa Praanam
Nee Sannidhaanamandu – Seeyonu Maargamandu
Nee Divya Sevalone – Nadipinche Naa Prabhu
Nee Thoti Saagu Payanaana – Nanu Veedaledu Kshanamaina
Nee Swaramu Chaalu Udayaana – Ninu Vembadinchu Tharunaana
Shaashwatha Prematho – Sathya Vaakyambutho
Nithyamu Thodugaa – Niliche Naa Yesayyaa          ||Evaru||