చూచుచున్న దేవుడవు / Choochuchunna Devudavu

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము (2)

పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)
ఆప్యాయతకు నోచుకొనని
నను చేరదీసిన కృపా సాగరా (2)        ||చూచుచున్న||

అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)
అగ్ని వంటి శోధనలను
తప్పించితివే దయా సాగరా (2)          ||చూచుచున్న||

Choochuchunna Devudavu Neeve Yesayyaa
Chooda Muchchataayaene Sukumaara Sumamulaina
Nee Nethraalankruthamu (2)

Paschaaththapamu Kalugune Nee Dayagala Choopulatho
Kshaminchabaduduru Evarainaa Raktha Prokshanatho (2)
Aapyaayathaku Nochukonani
Nanu Cheradeesina Krupaa Saagaraa (2)        ||Choochuchunna||

Agni Jwaalaamayame Nee Choopula Valayaalu
Thappinchukonduraa Evarainaa Enthati Ghanulainaa (2)
Agni Vanti Shodhanalanu
Thappinchithive Dayaa Saagaraa (2)          ||Choochuchunna||

చిత్ర చిత్రాల వాడే / Chithra Chithraala Vaade

చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు (2)
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు (2)           ||చిత్ర||

కోళ్ళు గొర్లు కోరడట
కొబ్బరికాయలు కోరడట (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)        ||చిత్ర||

Chithra Chithraala Vaade Mana Yesayya
Chaalaa Chithraala Vaade Mana Yesayya (2)
Dayagala Vaadammo
Ee Jagamuna Lene Ledammo (2)      ||Chithra||

Raayi Rappaku Mokkavaddu
Chettu Puttanu Kolavaddu (2)
Dayagala Vaadammo
Ee Jagamuna Lene Ledammo (2)      ||Chithra||

Lokamunaku Vachchinaadu
Paapula Rakshinchinaadu (2)
Parishudhdhudochchinaadu
Aa Paramuna Cherchuthaadu (2)        ||Chithra||

Kollu Gorlu Koradata
Kobbarikaayalu Koradata (2)
Dayagala Vaadammo
Ee Jagamuna Lene Ledammo (2)      ||Chithra||

కృపగల దేవా  / Krupagala Devaa

కృపగల దేవా దయగల రాజా

కృపగల దేవా దయగల రాజా
చేరితి నిన్నే బహు ఘనతేగా
నీ చరణములే నే కోరితిని
నీ వరములనే నే వేడితిని (2)
సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2)       ||కృపగల||

త్రోవను చూపే తారవు నీవే
గమ్యము చేర్చే సారథి నీవే (2)
జీవన యాత్రా శుభప్రదమాయే
నా ప్రతి ప్రార్థన పరిమళమాయె
నీ ఉదయకాంతిలో నను నడుపుము
నా హృదిని నీ శాంతితో నింపుము (2)       ||కృపగల||

కృప చూపి నన్ను అభిషేకించి
వాగ్ధానములు నెరవేర్చినావే (2)
బహు వింతగా నను ప్రేమించినావే
బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును
నీ దివ్య మహిమలను ప్రకటింతును (2)       ||కృపగల||

నా యేసురాజా వరుడైన దేవా
మేఘాల మీద దిగి వచ్చు వేళ (2)
ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో
ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో
జీవింతు నీలోనే యుగయుగములు (2)       ||కృపగల||

Krupagala Devaa Dayagala Raajaa

Krupagala Devaa Dayagala Raajaa
Cherithi Ninne Bahu Ghanathegaa
Nee Charanamule Ne Korithini
Nee Varamulane Ne Vedithini (2)
Sarvaadhikaari Neeve Devaa – Naa Sahakaari Neeve Prabhuvaa
Naa Korikale Saphalamu Chesi – Aalochanale Neraverchithivi
Arpinchedanu Naa Sarvamunu Neeke Devaa
Aaraadhinchi Aanandincheda Neelo Devaa (2)       ||Krupagala||

Throvanu Choope Thaaravu Neeve
Gamyamu Cherche Saarathi Neeve (2)
Jeevana Yaathraa Shubhapradamaaye
Naa Prathi Praardana Parimalamaaye
Nee Udayakaanthilo Nanu Nadupumu
Naa Hrudini Nee Shaanthitho Nimpumu (2)       ||Krupagala||

Krupa Choopi Nannu Abhishekinchi
Vaagdhaanamulu Neraverchinaave (2)
Bahu Vinthagaa Nanu Preminchinaave
Balamaina Janamuga Nanu Maarchinaave
Nee Keerthi Jagamantha Vivarinthunu
Nee Divya Mahimalanu Prakatinthunu (2)       ||Krupagala||

Naa Yesuraajaa Varudaina Devaa
Meghaala Meeda Digi Vachchu Vela (2)
Aakaasha Veedhilo Kamaneeya Kaanthilo
Priyamaina Sanghamai Ninu Cheredanu
Nilichedanu Neethone Seeyonulo
Jeevinthu Neelone Yugayugamulu (2)       ||Krupagala||