చిన్ని బిడ్డ నీ చిన్ని హృదయమును / Chinni Bidda Nee Chinni Hrudayamunu

చిన్ని బిడ్డ నీ చిన్ని హృదయమును

చిన్ని బిడ్డ నీ చిన్ని కానుకను

యేసుకై అప్పగించు దం

సేవకై అర్పించు

యేసు చేత మెప్పుపొందుము

చిన్ని చిన్ని అడుగులు / Chinni Chinni Adugulu

1. చిన్ని చిన్ని అడుగులు

చర్చిలోకి వేతును

చక్కగా కూర్చుందును

చిక్కను సాతానుకు

అడుగులన్ని యేసయ్యకు తెలియును

అలసిన వేళలో తానే నడుపును

అదురు లేక బెదురు లేక

ముందుకే నడుతును

2. చిన్ని చిన్ని పలుకులు

ప్రతి దినము పలుకుతాం

యేసయ్య పలుకులు

పది మందికి తెలుపుతాం

పలుకులన్ని యేసయ్యకు తెలియును

అలసిన వేళలో తానే నడుపును

అదురు లేక బెదురు లేక

ముందుకే సాగెదన్‌

చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం / Chinni Chinni Pillalam Chinnari Pillalam

చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం

యేసునాధునికే ముద్దు బిడ్డలం మేము

యేసునాధునికే ముద్దు బిడ్డలం ?చిన్ని?

1. బాల్యదినములందే

యేసు ప్రభువుని నమ్ముకొని

బైబిల్‌ మాటలు బాలలకు నేర్పెదం

బడిలో గుడిలోన

మాదిరిగా మసలుకొని

అమ్మ నాన్నలకు

మంచి పేరు తెచ్చెదం        ॥చిన్ని॥

2. పరమును వీడి ధరకరుదెంచినాడు

సిలవలోనిలచి ప్రాణమర్పించినాడు

మూడవ దినమున

మృతిని గెల్చి లేచినాడు

పరమునకరుదెంచి          

త్వరగా రానెయుండె       ॥చిన్ని॥

చిన్ని చిన్ని పిల్లల్లారా మీరందరూ / Chinni Chinni Pillalaara Meerandaru

చిన్ని చిన్ని పిల్లల్లారా మీరందరూ

దేవుని స్తుతింప రండి

ఆయన మేలులన్‌ మరవకను

మహిమపరచ రండి యేసుని

మహిమపరచ రండి.

1. భూమి కంటే ఆకాశము

ఎంతో ఉన్నతము

భయభక్తులుగల వారిపై

ఆయన కృప ఎంతో అధికం

2. మనము మంటి వారము

అడవి పువ్వులము

అయినను మన తండ్రి ఎంతో

జాలి చూపించును

నా చిన్ని హృదయం నీకే అంకితం / Naa Chinni Hrudayam Neeke Ankitham

నా చిన్ని హృదయం నీకే అంకితం

నా చిన్ని జీవితం నీకే అంకితం

యేసయ్యా నా యేసయ్యా

1. సాతాను నన్ను శోధించినా

నేన్నెనడు నిన్ను విడవను

నా చిన్ని హృదయంలో / Naa Chinni Hrudayamlo

నా చిన్ని హృదయంలో

యేసు ఉన్నాడు(4)

తన ప్రేమనే నాకు చూపి

తన వారసులుగా మము చేసెను

అ.ప.: నాలో సంతోషం నాలో ఉత్సాహం

యేసయ్యే నింపాడు.

నాలో సంతోషం నాలో ఉత్సాహం

యేసయ్య నింపాడు (2)

1. లాలించును నను పాలించును

ఏ కీడు రాకుండా నను కాపాడును

తన అర చేతిలో నన్ను చెక్కుకొనెను

ముదిమి వచ్చు వరకు

నన్ను ఎత్తుకొనును

2. హత్తుకొనును నను ఓదార్చును

ఎల్లప్పుడు నాకు తోడుండును

ఏ కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా

మన ప్రభు యేసుపై

నీవు ఆనుకొనుము

నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను/ Naa Chinni Kannulu Yesukichanu

1. నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను.

నా చిన్ని చెవులు యేసుకిచ్చాను

నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను.

నేను యేసుకై జీవించెదను

2. నా చిన్ని హృదయము యేసుకిచ్చాను

నా చిన్ని హృదయములో పాపముండదు

అపవాదికి హృదయములో చోటేలేదు

నేను యేసుకై జీవించెదను

ఓ చిన్ని పుష్పమా / O Chinni Pushpama

1. ఓ చిన్ని పుష్పమా

నీ సంతోషమునకు

కారణమేమొ చెప్పుమా

నన్ను చేసినవాడు

అందం ఇచ్చినవాడు

నాకు ఏమి కావాలో

ఆయనే చూసుకుంటాడు

రేపటిని గూర్చి

నాకు దిగులు లేదుగా

సృష్టికర్తను స్తుతించుటయే

నా పనిగా

2. ఓ లేత హృదయమా

నీవు విచారపడుట

తగదని తెలిసికొనుమా

నిన్ను చేసినవాడు

ఎన్నడూ మరువడు

మాట తప్పనివాడు

నీ చేయి విడువడు

పువ్వులను చూసి

నేర్చుకొనుమా

చింత యేసుపై వేసి

సంతోషించుమా

చిన్ని నావ నాది / Chinni Naava Naadi

చిన్ని నావ నాది

సాగిపోవుచున్నది

లోకమనే సంద్రములో

1. నా నావికుడు యేసే

నా నాయకుడు యేసే

నా నావలో యేసు ఉన్నాడు.

నా నావను నడిపించుచున్నాడు.

2. అలలు పైకి లేచినా

గాలి విసిరికొట్టినా

నా నావలో యేసు ఉన్నాడు.

తుఫానును గద్దించుచున్నాడు.

నా చిన్ని హృదయంలో / Naa Chinni Hrudayamlo

పాట రచయిత: షారోన్ ఫిలిప్
Lyricist: Sharon Philip

నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)
తన ప్రేమనే మాకు చూపి
తన వారసులుగా మము చేసెను
నాలో సంతోషం నాలో ఉత్సాహం
యేసయ్య నింపాడు (4)

లాలించును నను పాలించును
ఏ కీడు రాకుండా నను కాపాడును (2)
తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను
ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును         ||నాలో||

హత్తుకొనును నను ఓదార్చును
ఎల్లప్పుడూ నాకు తోడుండును (2)
అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా
మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము         ||నాలో||

పాట రచయిత: షారోన్ ఫిలిప్
Lyricist: Sharon Philip

Naa Chinni Hrudayamlo Yesu Unnaadu (4)
Thana Premane Maaku Choopi
Thana Vaarasulugaa Mamu Chesenu
Naalo Santhosham Naalo Uthsaaham
Yesayye Nimpaadu (4)

Laalinchunu Nanu Paalinchunu
Ae Keedu Raakundaa Nanu Kaapaadunu (2)
Thana Arachethilo Nannu Chekkukonenu
Mudimi Vachchuvaraku Nannu Etthukonunu         ||Naalo||

Hatthukonunu Nanu Odaarchunu
Ellappudu Naaku Thodundunu (2)
Anni Kashtaalu Nashtaalu Edurochchinaa
Mana Prabhu Yesupai Neevu Aanukonumu         ||Naalo||