మనిషి బ్రతుకు రంగుల వలయం / Manishi Brathuku Rangula Valayam

పాట రచయిత: టోనీ ప్రకాష్
Lyricist: Tony Prakash

మనిషి బ్రతుకు రంగుల వలయం
ఆ బ్రతుకే క్షణ భంగురం (2)
మారాలి ప్రతి హృదయం
వెదకాలి క్రీస్తు రాజ్యము (2)        ||మనిషి||

గడ్డి పువ్వురా మనిషి జీవితం
గాలి వీచగా రాలిపోవును (2)
గాలిలో నిలువని దీపమురా ఇది
గాలిలో ఎగిరే గాలిపటం రా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2)        ||మనిషి||

ఆత్మ వెళ్లగా శవమని నిన్ను
ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2)
ఇరుగు పొరుగువారు కూడ కొందరు
వల్లకాటి వరకే వచ్చెదరు (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2)        ||మనిషి||

ధనమున్నదని గర్వించకురా
ధనమే నీకు తోడు రాదురా (2)
లోకమే నీకు అశాశ్వతంబురా
పరలోకమే నీకు శాశ్వతంబురా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2)         ||మనిషి||

పాట రచయిత: టోనీ ప్రకాష్
Lyricist: Tony Prakash

Manishi Brathuku Rangula Valayam
Aa Brathuke Kshana Bhanguram (2)
Maaraali Prathi Hrudayam
Vedakaali Kreesthu Raajyamu (2)         ||Manishi||

Gaddi Puvvuraa Manishi Jeevitham
Gaali Veechagaa Raalipovunu (2)
Gaalilo Niluvani Deepamuraa Idi
Gaalilo Egire Gaalipatam Raa (2)
Thelusuko O Maanavaa
Ee Kshaname Prabhu Yesuni (2)         ||Manishi||

Aathma Vellagaa Shavamani Ninnu
Inta Nuncharu Pancha Cherchedaru (2)
Irugu Poruguvaaru Kooda Kondaru
Vallakaati Varake Vachchedaru (2)
Thelusuko O Maanavaa
Ee Kshaname Prabhu Yesuni (2)         ||Manishi||

Dhanamunnadani Garvinchakuraa
Dhaname Neeku Thodu Raaduraa (2)
Lokame Neeku Ashaashwathamburaa
Paralokame Neeku Shaashwathamburaa (2)
Thelusuko O Maanavaa
Ee Kshaname Prabhu Yesuni (2)         ||Manishi||

నీవు లేని రోజు / Neevu Leni Roju

నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)
నీవే లేకపోతే నేనసలే లేనయా (2)          ||నీవు లేని||

బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)
నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2)           ||నీవే||

ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)
నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2)       ||నీవే||

Neevu Leni Roju Asalu Roje Kaadayaa
Neevu Leni Brathuku Asalu Brathuke Kaadayaa (2)
Neeve Lekapothe Nenasale Lenayaa (2)           ||Neevu Leni||

Baadha Kalugu Velalo Nemmadi Naakichchaavu
Naa Kanneeru Thudachi Naa Cheyi Pattaavu (2)
Nannu Viduvanannavu – Naa Devudainaavu (2)          ||Neeve||

Ee Naati Naa Sthithi Neevu Naaku Ichchinade
Nenu Kaligiyunnavanni Needu Krupaa Bhaagyame (2)
Neevu Naa Sotthannaavu – Krupaa Kshemamichchaavu (2)         ||Neeve||

ఎరుగనయ్యా నిన్నెప్పుడు/Eruganayyaa Ninneppudu

పాట రచయిత: రాజబాబు

ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2)
నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||

నీ ప్రేమ శాశ్వతమేగా (2)
నీ కరుణ సాగరమేగా (2)
నిను కొలువ భాగ్యమే కదా (2)
నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||

నీ పలుకే తీర్చునాకలి (2)
నీ స్మరణము కూర్చు బలిమిని (2)
నీ బ్రతుకే వెలుగు బాట (2)
నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||

వలదయ్యా లోక భ్రాంతి (2)
కడు భారము ఘోర వ్యాధి (2)
నిను చేరిన నాకు మేలు (2)
నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||

Lyricist: Rajababu

Eruganayyaa Ninneppudu (2)
Nanu Vedhakuchuntivaa.. O Prabhuvaa (2)      ||Eruganayyaa||

Nee Prema Shaashwathamegaa (2)
Nee Karuna Saagaramegaa (2)
Ninu Koluva Bhaagyame Kadaa (2)
Nanu Piluva Vachchina.. O Prabhuva (2)      ||Eruganayyaa||

Nee Paluke Theerchunaakali (2)
Nee Smaranamu Koorchu Balimini (2)
Nee Brathuke Velugu Baata (2)
Nanu Koluva Vachchina.. O Prabhuvaa (2)      ||Eruganayyaa||

Valadayyaa Loka Bhraanthi (2)
Kadu Bhaaramu Ghora Vyaadhi (2)
Ninu Cherina Naaku Melu (2)
Nee Rakshana Chaalu Chaalu.. Naa Prabhuvaa (2)      ||Eruganayyaa||