నీవు లేని క్షణమైనా / Neevu Leni Kshanamainaa

నీవు లేని క్షణమైనా ఊహించలేను
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)
నీవే నా కాపరి – నీవే నా ఊపిరి
నీవే నా సర్వము యేసయ్య
నీతోనే జీవితం – నేనే నీకంకితం
గైకొనుమో నన్ను ఓ దేవా…          ||నీవు లేని||

శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా
నను ధైర్యపరిచె నీ వాక్యం
సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా
నను మునగనీయక లేవనెత్తిన (2)
నీవే నా కండగా – నాతో నీవుండగా
భయమన్నదే నాకు లేదూ
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా
అవి నన్ను కాల్చజాలవుగా
దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా
నాకేమాత్రం హాని చేయవుగా (2)
వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన
వేదనలే తొలగించిన యేసయ్యా
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

Neevu Leni Kshanamainaa Oohinchalenu
Nee Krupa Lenide Nenu Brathukalenu (2)
Neeve Naa Kaapari Neeve Naa Oopiri
Neeve Naa Sarvamu Yesayyaa
Neethone Jeevitham Nene Neekankitham
Gaikonumo Nannu O Devaa…              ||Neevu Leni||

Shramalenno Vachchinaa – Shodhanale Bigisinaa
Nanu Dhairyapariche Nee Vaakyam
Sandraale Ponginaa – Alale Egasinaa
Nanu Munaganeeyaka Levanetthina (2)
Neeve Naakandagaa – Naatho Neevundagaa
Bhayamannade Naaku Ledu
Sarvaloka Naathudaa – Kaapaade Devudaa
Vandanamu Neeke O Devaa…              ||Neevu Leni||

Sathruvule Lechinaa – Agnilaa Dahinchinaa
Avi Nannu Kaalchajaalavugaa
Dushtule Vachchinaa – Simhaalai Garjinchinaa
Naakemaathram Haani Cheyavugaa (2)
Vennu Thatti Balaparachina – Cheyi Patti Nadipinchina
Vedhanale Tholaginchina Yesayyaa
Sarvaloka Naathudaa – Kaapaade Devudaa
Vandanamu Neeke O Devaa…              ||Neevu Leni||

నీ కృప నాకు చాలును / Nee Krupa Naaku Chaalunu

నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
నీ కృప లేనిదే నే బ్రతుకలేను

జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2)
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా (2)
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా (2)         ||నీ కృప||

జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే (2)
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను (2)      ||నీ కృప||

Nee Krupa Naaku Chaalunu
Nee Krupa Lenide Ne Brathukalenu (2)
Nee Krupa Lenide Ne Brathukalenu

Jala Raasulanni Eka Raasiga
Nilichipoyene Nee Janula Eduta (2)
Avi Bhoo Kampaale Ainaa
Penu Thuphaanule Ainaa (2)
Nee Krupaye Shaashinchunaa
Avi Anagipovunaa (2)         ||Nee Krupa||

Jagadudpaththiki Mundugaane
Erparachukoni Nannu Pilachithivaa (2)
Nee Pilupe Sthiraparachene
Nee Krupaye Balaparachene (2)
Nee Krupaye Ee Paricharyanu
Naaku Anugrahinchenu (2)     ||Nee Krupa||

కొంత యెడము నీవైనా / Kontha Yedamu Neevainaa

కొంత యెడము నీవైనా నే సాగలేను
నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
కొంత యెడము నీవైనా

మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు (2)
ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)
మరియొక్క మారు మన్నించు విభుడా (2)         ||కొంత యెడము||

కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము (2)
కమ్మిన పొరలు కరిగించుటకు (2)
నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2)         ||కొంత యెడము||

మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2)
నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2)
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2)         ||కొంత యెడము||

మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2)
నను వరియించగ రానున్న ప్రియుడా (2)
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2)         ||కొంత యెడము||

Kontha Yedamu Neevainaa Ne Saagalenu
Nimishamaina Ninnu Vidichi Ne Brathukalenu
Kontha Yedamu Neevainaa

Marachina Velalo Madi Nee Paluku
Sadali Kattadalu Malinamu Thalapulu (2)
Premanu Panche Prema Roopudaa (2)
Mari Yokka Maaru Manninchu Vibhudaa (2)        ||Kontha Yedamu||

Kanulaku Mohamu Kammina Kshanamu
Vinuta Marache Nee Searamunu Hrudayamu (2)
Kammina Poralu Kariginchutaku (2)
Nadupu Nee Vaipuku Hrudi Velugutaku (2)        ||Kontha Yedamu||

Madamu Mathsaramulu Sokina Tharunamu
Paashamu Premaku Vigathamu Praapthamu (2)
Nirathamu Sthiramuga Nunna Akshayudaa (2)
Nilupumu Nee Krupalo Nannu Raksakudaa (2)        ||Kontha Yedamu||

Manuja Roopamuna Mahilo Nilichi
Manishi-kasaadhyamou Maranamu Gelichi (2)
Nanu Variyinchaga Raanunna Priyudaa (2)
Ninnedurukonaga Mathi Niyyu Varudaa (2)        ||Kontha Yedamu||