నీ సన్నిధిలో ఈ ఆరాధనను / Nee Sannidhilo Ee Aaraadhananu

నీ సన్నిధిలో ఈ ఆరాధనను
స్వీకరించుము నా ప్రభువా (2)
నా హృదయములో నీ ఆత్మ బలమును
నింపుము నాపై యేసయ్యా        ||నీ సన్నిధిలో||

ఆవిరివంటి వాడను నేను
మేఘ స్తంభమై నిలిచావు (2)
చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2)
వర్షముగా నను మార్చావు – మార్చావు          ||నీ సన్నిధిలో||

మోడులా మిగిలిన నాకై
సిలువ మ్రానిపై వ్రేళాడి (2)
నీ రక్తముతో నను ప్రోక్షించి (2)
నా మరణ శాపం తొలగించావు – తొలగించావు       ||నీ సన్నిధిలో||

Nee Sannidhilo Ee Aaraadhananu
Sweekarinchumu Naa Prabhuvaa (2)
Naa Hrudayamulo Nee Aathma Balamunu
Nimpumu Naapai Yesayyaa           ||Nee Sannidhilo||

Aavirivanti Vaadanu Nenu
Megha Sthamabhamai Nilichaavu (2)
Challani Nee Prema Gaalini Sokinchi (2)
Varshamugaa Nanu Maarchaavu – Maarchaavu          ||Nee Sannidhilo||

Modulaa Migilina Naakai
Siluva Mraanipai Vrelaadi (2)
Nee Rakthamutho Nanu Prokshinchi (2)
Naa Marana Shaapam Tholaginchaavu – Tholaginchaavu          ||Nee Sannidhilo||

ఎంత చెప్పిన వాక్యమినక పోతివి/Entha Cheppina Vaakyaminaka Pothivi

ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
సాగిపోతివా చింతతో సమాధికి
వాదమాడి.. పంతమాడి (2)
అంతలోనే కన్ను మూసి పోతివా (2)

ధనము ధాన్యము కూడబెట్టి
మేడ మిద్దెలు కట్టబెట్టి (2)
అంత విడచి ఒంటిగానే పోతివా
ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా (2)       ||ఎంత||

కొండలాంటి అండ బలమును
చూచి ఎంతో అదిరి పడితిని (2)
కండ బలము కరిగిపోయే
నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా (2)       ||ఎంత||

Entha Cheppina Vaakyaminaka Pothivi
Saagipothiva Chinthatho Samaadhiki
Vaadamaadi.. Panthamaadi (2)
Anthalone Kannu Moosi Pothivaa (2)

Dhanamu Dhaanyamu Koodabetti
Meda Middelu Kattabetti (2)
Antha Vidachi Ontigaane Pothivaa
Ee Poota Methukula Metivaadani Marachipothivaa (2)        ||Entha||

Kondalaanti Anda Balamunu
Choochi Entho Adiri Padithini (2)
Kanda Balamu Karigipoye
Nee Anda Edi Mantipaalai Povunannaa (2)        ||Entha||

అంత్య దినములయందు ఆత్మను / Anthya Dinamula Yandu Aathmanu

అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (2)      ||అంత్య||

కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము (2)      ||దేవా||

సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా (2)
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము (2)      ||దేవా||

సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా (2)
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము (2)      ||దేవా||

Anthya Dinamulayandu Aathmanu
Manushyulandari Meeda Kummarinchumayaa (2)
Devaa Yavvanulaku Darshanamu Kalugajeyumu (2)     ||Anthya||

Kothentho Visthaaramu
Kosedi Vaaru Leru
Yavvanulaku Nee Pilupunichchi
Sevaku Tharalimpumu (2)      ||Devaa||

Soulu Laanti Yavvanulu
Damasku Maargamu Velluchundagaa (2)
Nee Darshanamu Vaarikichchi
Poulu Vale Maarchumu (2)      ||Devaa||

Samsonu Laanti Yavvanulu
Balamunu Vyardhaparachuchundagaa (2)
Nee Aathma Balamunu Vaarikichchi
Nee Daasulugaa Maarchumu (2)      ||Devaa||