ఆరాధనా నీకే ఆరాధనా / Aaraadhanaa Neeke Aaraadhanaa

పాట రచయిత: జోయెల్ ఎన్ బాబ్

ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా యేసు అన్ని వేళలా (2)
నా కష్టాలలో ఆరాధన
శోక సంద్రములో నీకే ఆరాధన
నా నష్టాలలో ఆరాధన
లోకమే నను విడచినా నీకే ఆరాధన           ||ఆరాధనా||

ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినా
ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన
నా ప్రియులే చేయి విడచినా – సిరులున్నా లేక పోయినా
నను విడువని యేసుని చూస్తూ ఆరాధన (2)
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2)         ||ఆరాధనా||

రోగములే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా
సర్వమును భరించు యేసుకే ఆరాధన
శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా
లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన (2)
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2)         ||ఆరాధనా||

Lyricist: Joel N Bob

Aaraadhanaa Neeke Aaraadhanaa
Aaraadhanaa Yesu Anni Velalaa (2)
Naa Kashtaalalo Aaraadhana
Shoka Sandarmulo Neeke Aaraadhana
Naa Nashtaalalo Aaraadhana
Lokame Nanu Vidachinaa Neeke Aaraadhana        ||Aaraadhanaa||

Otamule Naaku Migilnaa – Kanneeta Ninda Muniginaa
Aadarinchu Yesuni Choosthu Aaraadhana
Naa Priyule Cheyi Vidichinaa – Sirulunnaa Lekapoyinaa
Nanu Viduvani Yesuni Choosthu Aaraadhana (2)
Yesayyaa Neeke Naa Aaraadhana
Yesayyaa Neeke Naa Sthuthi Keerthana (2)          ||Aaraadhanaa||

Rogamule Ksheeninchinaa – Shaanthi Leka Kumilipoyinaa
Sarvamunu Bharinchu Yesuke Aaraadhana
Shodhanale Chuttumuttinaa – Paapamule Raajyamelinaa
Lokaanni Gelichina Yesuke Aaraadhana (2)
Yesayyaa Neeke Naa Aaraadhana
Yesayyaa Neeke Naa Sthuthi Keerthana (2)          ||Aaraadhanaa||

అన్నీ సాధ్యమే యేసుకు / Anni Saadhyame Yesuku

పాట రచయిత: జే సీ కూచిపూడి

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే (2)
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)           ||అన్నీ సాధ్యమే||

మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)           ||అన్నీ సాధ్యమే||

బండనే చీల్చగా – జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)
బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2)           ||అన్నీ సాధ్యమే||

ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)
యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2)           ||అన్నీ సాధ్యమే||

కష్టాల కడలిలో – కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)
కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2)           ||అన్నీ సాధ్యమే||

Lyricist: J C Kuchipudi

Anni Saadhyame
Yesuku Anni Saadhyame (2)
Adbhutha Shakthini Neraputakainaa
Aascharya Kaaryamulosagutakainaa (2)
Aa Yesu Rakthaanike
Saadhyame Saadhyame Saadhyame (2)       ||Anni Saadhyame||

Maadhuryamaina Jalamugaa – Maaraanu Prabhu Maarchenu
Mruthyuvu Nundi Laajarunu – Maahimaardhamukai Lepenu (2)
Mannaanu Kurpinchagaa – Aakaashame Therichenu
Maranaanni Odinchagaa – Mruthyunjudai Lechenu (2)       ||Anni Saadhyame||

Bandane Cheelchagaa – Jalamule Pongenu
Endipoyina Bhoomipai – Aerulai Avi Paarenu (2)
Bandante Kreesthenani – Nee Dandame Thaanani
Mendaina Thana Krupalo – Neekandagaa Nilachunu (2)       ||Anni Saadhyame||

Ekaanthamugaa Mokarilli – Praardhinchute Shreyamu
Aela Naakee Shramalani – Poorna Mansutho Vedumu (2)
Yesayya Nee Vedhana – Aalinchi Manninchunu
Ae Paati Vyadhalainanu – Aa Silvalo Theerchunu (2)       ||Anni Saadhyame||

Kashtaala Kadalilo – Kanneeti Loyalo
Kanikarame Prabhu Choopunu – Kantipaapalaa Kaayunu (2)
Kaliginchu Vishwaasamu – Kaadedi Asaadhyamu
Kreesthesu Naamamulo – Kadagandlake Mokshamu (2)       ||Anni Saadhyame||

అన్ని వేళల వినువాడు / Anni Velala Vinuvaadu

పాట రచయిత: జి ఫీనెహాసు

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో (2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును       ||అన్ని||

కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (2)
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

Lyricist: G Phinehas

Anni Velala Vinuvaadu Nee Praardhanalanniyu
Ae Bedhamu Lekane Aalakimpanaiyunnaadu (2)
Praardhinchumu Alayakane
Kanipettumu Vishwaasamutho (2)
Nee Praardhane Maarchunu Nee Sthithi
Nee Edalo Kanneeru Thudachunu          ||Anni||

Kumilipothu Naligipothu
Emauthundo Ardham Kaaka (2)
Vedana Chenduthu Niraashalo Munigaavaa (2)
Okasaari Yochinchumaa
Nee Morranu Vinuvaadu Yesayye (2)        ||Anni||

Evariki Cheppukoleka
Anthagaa Baadha Enduku (2)
Morrapettina Vaariki Sameepamugaa Yesu Undunu (2)
Okasaari Yochinchumaa
Nee Morranu Vinuvaadu Yesayye (2)        ||Anni||

అన్ని వేళల ఆరాధన / Anni Velala Aaraadhana

అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)       ||అన్ని వేళల||

పరమందు సెరాపులు ఎగురుచున్నారు
పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు (2)       ||అన్ని వేళల||

నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది
సమస్తము మనసారా మ్రొక్కుచున్నది (2)       ||అన్ని వేళల||

ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది
ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది (2)       ||అన్ని వేళల||

Anni Velala Aaraadhana
Kanna Thandri Neeke Mahima (2)
Anni Velala Aaraadhana
Kanna Thandri Neeke Mahima (2)       ||Anni Velala||

Paramandu Seraapulu Eguruchunnaaru
Parishuddhulu Parishuddhudani Pogaduchunnaaru (2)       ||Anni Velala||

Ningi Nela Ninnu Goorchi Paaduchunnadi
Samasthamu Manasaaraa Mrokkuchunnadi (2)       ||Anni Velala||

Ghanamaina Sangha Vadhuvu Koniyaaduchunnadi
Ghanatha Prabhaavamu Yesunake Chellinchuchunnadi (2)       ||Anni

అన్ని నామముల కన్న పై నామము / Anni Naamamula Kanna

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)

పాపముల నుండి విడిపించును
యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2)       ||యేసు నామము ||

సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2)        ||యేసు నామము ||

స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2)            ||యేసు నామము ||

Anni Naamamula Kanna Pai Naamau – Yesuni Naamamu
Enni Tharamulakainaa Ghanaparacha Daginadi – Kreesthesu Naamamu (2)
Yesu Naamamu Jayam Jayamu
Saathaanu Shakthul Layam Layamu (2)
Hallelooya Hosanna Hallelooyaa – Hallelooyaa Aamen (2)

Paapamula Nundi Vidipinchunu
Yesuni Naamamu (2)
Nithya Narakaagnilo Nundi Rakshinchunu
Kreesthesu Naamamu (2)   ||Yesu Naamamu||

Saathaanupai Adhikaaramichchunu
Shakthigala Yesu Naamamu (2)
Shathru Samoohamupai Jayamu Nichchunu
Jayasheeludaina Yesu Naamamu (2)      ||Yesu Naamamu||

Sthuthi Ghana Mahimalu Chellinchuchu
Kroththa Keerthana Paadedamu (2)
Jaya Dhvajamunu Paikeththi Kekalatho
Sthothra Gaanamu Cheyudamu (2)         ||Yesu Naamamu||

అన్ని కాలంబుల నున్న / Anni Kaalambula

పాట రచయిత: బేతాళ జాన్

అన్ని కాలంబుల – నున్న యెహోవా ని
నెన్నదరంబయో – కన్న తండ్రి
వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు
లున్నతమై యుండ – మున్నె నీకు         ||అన్ని||

నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములను
బన్నుగ జేసిన – బలుడ వీవె
ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం
పన్నతతో నేలు – ప్రభుడ వీవె
అన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచు
నున్న సర్వజ్ఞుo – డవు నీవే
ఎన్న శక్యముగాక – ఉన్న లక్షణముల
సన్నుతించుటకు నే – జాలుదునా           ||అన్ని||

పుట్టింప నీవంచు – బోషింప నీవంచు
గిట్టింప నీవంచు – గీర్తింతును
నట్టి పనికి మాలి – నట్టి మానవుల చే
పట్టి రక్షింప బా – ధ్యుండ వంచు
దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి
పట్టయు నిలచియుండు – ప్రభుడ వంచు
గట్టడచే గడ – ముట్టుదనుక నా
పట్టుకొలది నిన్ను – బ్రస్తుతింతు           ||అన్ని||

కారుణ్య నిధి వీవు – కఠినాత్ముడను నేను
భూరి శుద్ధుడ వీవు – పాపి నేను
సార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్న
దారిద్రుడే లేడు – తరచి చూడ
సార సద్గుణముల – సంపన్నుడవు నీవు
ఘోర దుర్గుణ సం – చారి, నేను
ఏ రీతి స్తుతియింతు – నే రీతి సేవింతు
నేర మెన్నక ప్రోవ – నెర నమ్మితి            ||అన్ని||

Lyricist: Bethaala John

Anni Kaalambula – Nunna Yehovaa Ni
Nennadarambayo – Kanna Thandri
Vanne Kekkina Moksha – Vaasaali Sannuthu
Lunnathamai Yunda – Munne Neeku          ||Anni||

Ninnu Brakatana Seya – Nikhila Lokamulanu
Bannuga Jesina – Baluda Veeve
Unna Lokambula – Nudugaka Karunaa Sam
Pannathatho Nelu – Prabhuda Neeve
Anni Jeevula Nerigi – Yaahaara Michchuchu
Nunna Sarvagnun – Davu Neeve
Enna Shakyamugaaka – Unna Lakshanamula
Sannuthinchutaku Ne – Jaaludunaa          ||Anni||

Puttimpa Neevanchu – Boshimpa Neevanchu
Gittimpa Neevanchu – Geerthinthunu
Natti Paniki Maali – Natti Maanavula Che
Patti Rakshimpa Baa – dhyunda Vanchu
Dattamaina Krupanu Dari Jercha Naakichchi
Pattayu Nilachiyundu – Prabhuda Vanchu
Gattadache Gada – Muttudanuka Naa
Pattukoladi Ninnu – Brasthuthinthu        ||Anni||

Kaarunya Nidhi Veevu – Katinaathmudanu Nenu
Bhoori Shudhdhuda Veevu – Paapi Nenu
Saara Bhaagyuda Veevu – Jagathilo Naakanna
Daaridrude Ledu – Tharachi Chooda
Saara Sadgunamula – Sampannudavu Neevu
Ghora Durguna Sam – Chaari, Nenu
Ae Reethi Sthuthiyinthu – Ne Reethi Sevinthu
Nera Mennaka Prova – Nera Nammithi         ||Anni||