నీ కృప చాలును / Nee Krupa Chaalunu

నీ కృప చాలును
నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)
నీవు లేని జీవితం అంధకార బంధురం (2)
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో
నన్ను కృంగదీయు సంకటములెన్నియో (2)
నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2)
నా జీవితాంతము నీలోనే నిలిచెదన్
నా జీవితాంతము నీతోనే నడిచెదన్
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)
నిను పోలి నేను ఈ లోకమందు
నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2)
నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్
నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)

Nee Krupa Chaalunu
Nee Prema Chaalunu
Neevu Naaku Thodunte Chaalunu Yesu (2)
Neevu Leni Jeevitham Andhakaara Bandhuram (2)
Neevu Naaku Thodunte Chaalunu Yesu (2)

Shodhanalu Enniyo Vedhanalu Enniyo
Nannu Krungadeeyu Sankatamulenniyo (2)
Nee Prema Varsham Naa Sthithini Maarchegaa (2)
Naa Jeevithaanthamu Neelone Nilichedhan
Naa Jeevithaanthamu Neethone Nadichedhan
Neevu Naaku Thodunte Chaalunu Yesu (2)

Naa Prema Geetham – Naa Dheena Praardhana
Naa Hrudaya Aalaapana Anduko Devaa (2)
Ninu Poli Nenu Ee Lokamandu
Nee Saakshigaanu Nee Mahima Chaatedhan (2)
Nee Divya Vaakyam Ee Jagaana Chaatedhan
Nee Aathma Abhishekam Naaku Nosagu Devaa (2)

Naa Prema Geetham – Naa Dheena Praardhana
Naa Hrudaya Aalaapana Anduko Devaa (2)

ఆరాధన అందుకో / Aaraadhana Anduko

ఆరాధన అందుకో (2)
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో

అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా
మోషేతో అన్నావు ఉన్నానని (2)
అల్ఫయు నీవే ఓమెగయును (2)
ఆద్యంత రహితుండ నీవేనని
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో

పాపంబున జన్మించి నశియించితిని
లోకంబు నాదనుచు ఆశించితిని (2)
అయినా నీవు రక్షణ నివ్వ (2)
వెలిగించి పంపితివి యేసు ప్రభును
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో

తెలిసికొంటిని నా యేసు నిన్ను
సర్వ శక్తి గల ప్రభువనియు (2)
రానున్నావు మరలా నాకై (2)
ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో          ||ఆరాధన||

Aaraadhana Anduko (2)
Paapa Kshamaapana Jeevamunichchina
Karunaamayaa.. Aaraadhana Anduko

Abrahaamu Issaku Yaakobu Devaa
Moshetho Annaavu Unnaanani (2)
Alphayu Neeve Omegayunu (2)
Aadyantha Rahithunda Neevenani
Ghanathaa Mahimaa Neekeyani
Hallelooyaa Gaanaamu Chesedanu
Paapa Kshamaapana Jeevamunichchina
Karunaamayaa.. Anduko
Aaraadhana Anduko

Paapambuna Janminchi Nashiyinchithini
Lokambu Naadanuchu Aashinchithini (2)
Ainaa Neevu Rakshana Nivva (2)
Veliginchi Pampithivi Yesu Prabhunu
Ghanathaa Mahimaa Neekeyani
Hallelooyaa Gaanaamu Chesedanu
Paapa Kshamaapana Jeevamunichchina
Karunaamayaa.. Anduko
Aaraadhana Anduko

Thelisikontini Naa Yesu Ninnu
Sarva Shakthi Gala Prabhuvaniyu (2)
Raanunnaavu Maralaa Naakai (2)
Aananda Deshamulo Nannunchutakai
Ghanathaa Mahimaa Neekeyani
Hallelooyaa Gaanaamu Chesedanu
Paapa Kshamaapana Jeevamunichchina
Karunaamayaa.. Anduko           ||Aaraadhana||

అందాలు చిందే శుభ వేళ /Andaalu Chinde Shubha Vela

పాట రచయిత: రమేష్

అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2)
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2)       ||అందాలు||

చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా (2)
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం (2)       ||అందాలు||

సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం (2)
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం (2)       ||అందాలు||

యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత (2)
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో (2)       ||అందాలు||

Lyricist: Ramesh

Andaalu Chinde Shubha Vela – Anduko Ee Vela (2)
Korukunnaavu Ee Varuni – Cheriyunnaadu Nee Jathane (2)        ||Andaalu||

Chinanaati Puttinti Nadakaa
Saagaali Atthinti Daakaa (2)
Entha Ghanamaina Bandham
Veyyendla Vivaaha Bandham (2)        ||Andaalu||

Samsaara Saagara Payanam
Thera Chaatu Anubhoothi Vinayam (2)
Saagipovaali Payanam
Cherukovaali Gamyam (2)        ||Andaalu||

Yesayya Paadaala Chentha
Vadalaali Edaloni Chintha (2)
Kreesthu Puttaali Neelo
Cherchukovaali Hrudilo (2)        ||Andaalu||