నమ్మకురా నమ్మకురా / Nammakuraa Nammakuraa

నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా
నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2)
మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా
ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా          ||నమ్మకురా||

ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా
ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2)
వస్తువాహనాల కాధారం
సుఖ సంతోషాలకు బహుదూరం (2)        ||నమ్మకురా||

ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా
ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా (2)
డబ్బును నమ్మకురా
గబ్బు పనులు చేయకురా (2)        ||నమ్మకురా||

ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం తుంచునురా
ధనము పొగరు పెంచునురా – పరువు కాస్త తీయునురా (2)
ధనము కోరిక తీర్చునురా
నరకానికి చేర్చునురా (2)        ||నమ్మకురా||

Nammakuraa Nammakuraa Ee Lokam Nammakuraa
Nammukoraa Nammukoraa Prabhu Yesuni Nammukoraa (2)
Matthunu Nammakuraa Gammatthulu Seyakuraa
Aathmanu Hatthukoraa Aarogyam Pondukoraa       ||Nammakuraa||

Dhanamu Chaduvu Nerpunuraa – Samskaaram Nerpaduraa
Dhanamu Mandulu Konunuraa – Aarogyam Ivvaduraa (2)
Vasthu Vaahanaala Kaadhaaram
Sukha Santhoshaalaku Bahu Dooram (2)         ||Nammakuraa||

Dhanamu Pelli Cheyunuraa – Kaapuramu Kattaduraa
Dhanamu Samaadhi Kattunuraa – Paralokam Cherchduraa (2)
Dabbunu Nammakuraa
Gabbu Panulu Cheyakuraa (2)         ||Nammakuraa||

Dhanamu Aasthini Penchunuraa – Anuraagam Thunchunraa
Dhanamu Pogaru Penchunuraa – Paruvu Kaastha Theeyunuraa (2)
Dhanamu Korika Theerchunuraa
Narakaaniki Cherchunuraa (2)         ||Nammakuraa||

దేవా నీ ఆత్మను / Devaa Nee Aathmanu

పాట రచయిత: డినో
Lyricist: Dino

దేవా నీ ఆత్మను నా నుండి
నువ్వు తీసివేయకుమా
నీ సన్నిధిలో నుండి నన్ను
నువ్వు త్రోసివేయకుమా (2)
నీ దృష్టి యెదుటనే
చెడుతనము చేసియున్నాను
పాపిని అని ఒప్పుకొని
క్షమాపణ కోరుచున్నాను
నీవే నీవే కరుణామయుడవు నీవే
నీవే నీవే ప్రేమామయుడవు నీవే     ||దేవా||

నీ వెలుగుతో నను నింపిననూ
చీకటినే కోరుకున్నాను (2)
నా కళ్ళు నీవు తెరిచిననూ
గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను      ||నీ దృష్టి||

నీ ఆత్మతో నను నింపిననూ
శరీరమునే తృప్తిపరిచాను (2)
ఆత్మచేత నడిపించబడక
శరీరాశలలో మునిగాను       ||నీ దృష్టి||

పాట రచయిత: డినో
Lyricist: Dino

Devaa Nee Aathmanu Naa Nundi
Nuvvu Theesiveyakumaa
Nee Sannidhilo Nundi Nannu
Nuvvu Throsiveyakumaa (2)
Nee Drushti Yedutane
Cheduthanamu Chesiyunnaanu
Paapini Ani Oppukoni
Kshamaapana Koruchunnaanu
Neeve Neeve Karunaamayudavu Neeve
Neeve Neeve Premaamayudavu Neeve      ||Devaa||

Nee Velugutho Nanu Nimpinanu
Cheekatine Korukunnaanu (2)
Naa Kallu Neevu Therichinanu
Gruddivaadilaa Naduchukunnaanu      ||Nee Drushti||

Nee Aathmatho Nanu Nimpinanu
Shareeramune Thrupthiparichaanu (2)
Aathmachetha Nadipinchabadaka
Shareeraashalalo Munigaanu      ||Nee Drushti||

అంత్య దినములయందు ఆత్మను / Anthya Dinamula Yandu Aathmanu

అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (2)      ||అంత్య||

కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము (2)      ||దేవా||

సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా (2)
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము (2)      ||దేవా||

సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా (2)
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము (2)      ||దేవా||

Anthya Dinamulayandu Aathmanu
Manushyulandari Meeda Kummarinchumayaa (2)
Devaa Yavvanulaku Darshanamu Kalugajeyumu (2)     ||Anthya||

Kothentho Visthaaramu
Kosedi Vaaru Leru
Yavvanulaku Nee Pilupunichchi
Sevaku Tharalimpumu (2)      ||Devaa||

Soulu Laanti Yavvanulu
Damasku Maargamu Velluchundagaa (2)
Nee Darshanamu Vaarikichchi
Poulu Vale Maarchumu (2)      ||Devaa||

Samsonu Laanti Yavvanulu
Balamunu Vyardhaparachuchundagaa (2)
Nee Aathma Balamunu Vaarikichchi
Nee Daasulugaa Maarchumu (2)      ||Devaa||