ఆనందించుదాం అన్నివేళలందు / Aanandinchudaam Anni Vellalendu

ఆనందించుదాం అన్నివేళలందు

బలమొందుదాం యేసుక్రీస్తునందు

1. కష్టాలొచ్చినా కలత చెందము

నష్టాలొచ్చినా దిగులు చెందము

ఇమ్మానుయేలు దేవుడున్నాడు.

ఎల్లప్పుడూ మనతో ఉంటాడు

2. చిక్కులన్నీ యేసుకే అప్పగించడం

చింతలన్నీ ఆయనపైనే వేసెదం

ఇమ్మానుయేలు దేవుడున్నాడు.

ఎల్లప్పుడూ మనతో ఉంటాడు