నీవే నా సర్వము / Neeve Naa Sarvamu

నీవే నా సర్వము నీవే నాకున్నావు
నీవే నా సర్వము అన్నిటిలో
నీ జీవం నా కొరకు ఇచ్చినందున
నీవే నా సర్వము అన్నిటిలో (2)

తేనె కంటే మధురము (2)
యేసయ్యే నాకు మాధుర్యము
రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును
యేసయ్యే నాకు మాధుర్యము            ||తేనె||

నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే కదా నా ఆధారము
నీ పాదములకు మ్రొక్కెదను
నీ నామం పాడి స్తుతించెదను (2)         ||తేనె||

నీవే పరిహార నీవే పరమౌషధం
నీవే నా శక్తివి నా యేసయ్యా
కల్వరి సిలువపై బాలి అయితివే
నే బాగుపడితిని గాయములచే (2)         ||తేనె||

నీవే నా కీర్తివి నీవే నా అతిశయం
నీవే నా మేలులు నా యేసయ్యా
నీ పాద సేవయే చేయుటయే
నా హృదయములున్న వాంఛయేగా (2)         ||తేనె||

Neeve Naa Sarvamu Neeve Naakunnaavu
Neeve Naa Sarvamu Annitilo
Nee Jeevam Naa Koraku Ichchinanduna
Neeve Naa Sarvamu Annitilo (2)

Thene Kante Madhuramu (2)
Yesayye Naaku Maadhuryamu
Ruchi Choochi Erigithini Krupaa Baahulyamunu
Yesayye Naaku Maadhuryamu             ||Thene||

Neeve Naa Rakshana Neeve Nireekshana
Neeve Kadaa Naa Aadhaaramu
Nee Paadamulaku Mrokkedanu
Nee Naamam Paadi Sthuthinchedanu (2)             ||Thene||

Neeve Parihaari Neeve Paramoushadham
Neeve Naa Shakthivi Naa Yesayyaa
Kalvari Siluvapai Bali Aithive
Ne Baagupadithini Gaayamulache (2)             ||Thene||

Neeve Naa Keerthivi Neeve Naa Athishayam
Neeve Naa Melulu Naa Yesayyaa
Nee Paada Sevaye Cheyutaye
Naa Hrudayamulunna Vanchayegaa (2)             ||Thene||

నీ రక్త ధారలే / Nee Raktha Dhaarale

నీ రక్త ధారలే – మా జీవనాధారాము
నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము
ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ
నీతి రాజ – యేసు రాజ (2)

మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే
మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే        ||ఓ సిల్వ||

మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే
పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే       ||ఓ సిల్వ||

నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ
నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై        ||ఓ సిల్వ||

Nee Raktha Dhaarale – Maa Jeevanaadhaaraamu
Nee Silva Maargame – Maa Moksha Bhaagyamu
O Silva Raaja – Kreesthu Raaja
Neethi Raaja – Yesu Raaja (2)

Maalona Palikinchu Jeevana Raagamu Nee Aarthanaadamule
Maalona Veliginchu Jeevana Jyothulu Nee Silva Roopame   (2)      ||O Silva||

Mammunu Nadipinchu Paralokamunaku Nee Sathya Vaakyame
Paapapu Cheekatlu Paaradrolenu Nee Neethi Prabhaavame (2)       ||O Silva||

Nee Siluva Maranamu Manujaalikantha Kaliginche Rakshana
Nee Marana Vijayamu Jagamandu Velugondu Kraisthava Vijayamai (2)    ||O Silva||

నీ పాదాలే నాకు శరణం / Nee Paadaale Naaku Sharanam

నీ పాదాలే నాకు శరణం
యేసయ్యా నీవే ఆధారము (2)
నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2)
నా దాగు చాటు నీవే యేసయ్యా (2)       ||నీ పాదాలే||

అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2)
నా ఆశ్రయుడా నీ కన్నా నాకు
కనిపించదు వేరొక ఆశ్రయము (2)
కనిపించదు వేరొక ఆశ్రయము
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2)       ||నీ పాదాలే||

ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2)
నా పోషకుడా నీ కన్న నాకు
కనిపించరే వేరొక పోషకుడు (2)
కనిపించరే వేరొక పోషకుడు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2)       ||నీ పాదాలే||

సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2)
నా జయశీలుడా నీకన్న నాకు
కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2)
కనిపించరే జయమునిచ్చే వేరొకరు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా (2)       ||నీ పాదాలే||

Nee Paadaale Naaku Sharanam
Yesayyaa Neeve Aadhaaramu (2)
Naa Aashraya Puramu – Etthaina Kotavi Neevenayyaa (2)
Naa Daagu Chaatu Neeve Yesayyaa (2)         ||Nee Paadaale||

Alasina Samayamulo Aashrayinchithi Nee Paada Sannidhi (2)
Naa Aashrayudaa Nee Kanna Naaku
Kanipinchade Veroka Aashrayamu (2)
Kanipinchade Veroka Aashrayamu
Sharanam Sharanam Sharanam
Neeve Sharanam Yesayyaa (2)         ||Nee Paadaale||

Iruku Ibbandulalo Choochuchuntini Nee Vaipu Nenu (2)
Naa Poshakudaa Nee Kanna Naaku
Kanipinchare Veroka Poshakudu (2)
Kanipinchare Veroka Poshakudu
Sharanam Sharanam Sharanam
Neeve Sharanam Yesayyaa (2)         ||Nee Paadaale||

Saathaanu Shodhanalo Parugetthithini Nee Vaakku Koraku (2)
Naa Jayasheeludaa Neekanna Naaku
Kanipinchare Jayamunu Ichche Verokaru (2)
Kanipinchare Jayamunichche Verokaru
Sharanam Sharanam Sharanam
Neeve Sharanam Yesayyaa (2)         ||Nee Paadaale||

నీ దీర్ఘశాంతమే / Nee Deergha Shaanthame

నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము

నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2)

యేసయ్యా… కనిపించరే
నీలాగా ప్రేమించే వారెవరు (2)    ||నీ దీర్ఘ||

కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను

వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2)

(ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో
ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2)

యేసయ్యా… కనిపించరే
నీలాగా దీవించే వారెవరు (2)    ||నీ దీర్ఘ||

ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని

ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2)

తృణీకరింపబడిన నా బ్రతుకును
కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2)

యేసయ్యా… కనిపించరే
నీలాగా కృప చూపే వారెవరు (2)    ||నీ దీర్ఘ||

నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో

జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను (2)

మధురమైన నీ సహవాసముతో
నా జీవ నాథుడా నీ మమతను పంచావు (2)

యేసయ్యా… కనిపించరే
నీలాంటి జీవము గల దేవుడెవ్వరు(2)    ||నీ దీర్ఘ||

Nee Deergha Shaanthame Naa Hrudayaaniki Dhairyamu
Nee Karunaa Kataakshamule Naa Brathukuku Aadhaaramu (2)
Yesayyaa.. Kanipinchare
Neelaagaa Preminche Vaarevvaru (2)       ||Nee Deergha||

Kadu Peda Sthithilone Karuve Naa Bandhuvaayenu
Vayasochchina Tharunamulo Vasthra Heenathe Krungadeesenu (2)
(Ae) Aadhaaramu Kanipinchani Naa Brathukulo
Aishwaryavanthuda Nannaadhukunnaavu (2)
Yesayyaa.. Kanipinchare
Neelaagaa Deevinche Vaarevaru (2)       ||Nee Deergha||

Ee Loka Gnaanuloalo Verrivaanigaa Untini
Ennikaina Vaarilo Vyardhunigaa Migili Untini (2)
Thruneekarimpabadina Naa Brathukunu
Karunaa Sampannudaa Nannennukunnaavu (2)
Yesayyaa.. Kanipinchare
Neelaagaa Krupa Choope Vaarevvaru (2)       ||Nee Deergha||

Naa Praanamu Naalo Krungivunna Samayamulo
Jeevamu Gala Neekai Naa Praanamu Parithapinchenu (2)
Madhuramaina Nee Sahavaasamutho
Naa Jeeva Naathudaa Nee Mamathanu Panchaavu (2)
Yesayyaa.. Kanipinchare
Neelaanti Jeevamu Gala Devudevvaru (2)       ||Nee Deergha||

జీవాధిపతివి నీవే / Jeevaadhipathivi Neeve

జీవాధిపతివి నీవే నా యేసయ్య
నాకున్న ఆధారము నీవేనయ్యా (2)
నీవుంటే చాలు, కీడు కాదా! మేలు
లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2)    ||జీవాధిపతివి||

ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు
అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు (2)
నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము
నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము (2)     ||నీవుంటే||

రాజుల హృదయాలను తిప్పువాడవు
నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు (2)
ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను
నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా (2)    ||నీవుంటే||

Jeevaadhipathivi Neeve Naa Yesayyaa
Naakunna Aadhaaramu Neevenayyaa (2)
Neevunte Chaalu Keedu Kaadaa Melu
Lekkimpaga Tharamaa Ne Pondina Eevulu (2)          ||Jeevaadhipathivi||

Edaarilona Neeti Ootalichchuvaadavu
Ala Sandramulo Rahadaarulu Veyu Velpuvu (2)
Neeku Kaanidedi Saadhyamu – Adugute Aalasyamu
Neevu Cheyu Kaaryamu – Oohinchute Asaadhyamu (2)      ||Neevunte||

Raajula Hrudayaalanu Thippuvaadavu
Ninu Nammu Vaari Pakshamu Poraaduvaadavu (2)
Ae Cheekatiki Bhayapadanu Lokamunaku Longanu
Neevu Thodu Undagaa Naa Venta Saaguthundagaa (2)      ||Neevunte||