సీయోనులో నుండి నీవు / Seeyonulo Nundi Neevu

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)
సమాధానమై – సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)

నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)
నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)
నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు          ||సీయోనులో||

నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)
కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి (2)
నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము          ||సీయోనులో||

నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2)
నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)
నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను          ||సీయోనులో||

Seeyonulo Nundi Neevu – Prakaashinchuchunnaavu Naapai (2)
Samaadhaanamai – Sadaakaalamu Nanu Neetho
Nadipinchuchunnaavu Nee Keerthikai
Seeyonulo Mahonnathudaa Yesayyaa (2)

Nirdoshamaina Maargamulo – Naa Antharangamuna Dhairyamunichchi (2)
Nee Sannidhilo Nanu Nilipi – Unnatha Vijayamunichchithivi (2)
Nee Aashalu Neraverutaku – Nee Chitthamu Jariginchutaku
Viduvavu Nanu Yedabaayavu
Neevu Viduvavu Nanu Yedabaayavu        ||Seeyonulo||

Naayandu Drushti Nilipi – Nee Snehabandhamutho Aakarshinchi (2)
Krupaa Varamulatho Nanu Nimpi – Sathya Saakshigaa Maarchithivi (2)
Nee Manassunu Pondukoni – Nee Premanu Nimpukoni
Keerthinchedanu Prathi Nithyam
Ninu Aaraadhinthunu Anukshanamu          ||Seeyonulo||

Nee Divyamaina Mahimanu – Paralokamandune Choochedanu (2)
Nee Kougililo Cherchukoni – Prathi Bhaashpa Binduvunu Thudichedavu (2)
Nee Maatala Makarandamunu – Marapuraani Anubandhamunu
Maruvanu Ennadu Viduvanu
Nenu Maruvanu Ennadu Viduvanu         ||Seeyonulo||

సీయోనులో స్థిరమైన / Seeyonulo Sthiramaina

నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే

సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)

సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని (2)
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని (2)
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2)
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3)
ఆనందమే పరమానందమే (10)

Neethone Naa Nivaasamu – Nithyamu Aanandame
Soundarya Seeyonulo
Nee Manoharamaina Mukhamu Darshinthunu
Neethone Naa Nivaasamu – Nithyamu Aanandame

Seeyonulo Sthiramaina Punaadi Neevu
Nee Meede Naa Jeevithamu Amarchukunnaanu (2)

Sooryudu Leni Chandrudu Leni
Cheekati Raathrulu Lene Leni (2)
Aa Divya Nagarilo Kaanthulanu
Virajimmedavaa Naa Yesayyaa (2)         ||Seeyonulo||

Kadali Leni Kadagandlu Leni
Kallola Sthithi Gathulu Darike Raani (2)
Suvarna Veedhulalo
Nadipinchedavaa Naa Yesayyaa (2)         ||Seeyonulo||

Sangha Prathiroopamu – Parama Yerushalemu (2)
Soundarya Seeyonulo
Nee Manoharamaina Mukhamu Darshinthunu (2)
Neethone Naa Nivaasamu Nithyamu Aanandame (3)
Aanandame Paramaanandame (10)