ఎంతో భాగ్యంబు/Entho Bhaagyambu

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను
మనకెంతో భాగ్యంబు
వింతైన తన మహిమనంత విడచి మన కొరకై
చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె         ||ఎంతో||

పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె
నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు          ||ఎంతో||

బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే
ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే         ||ఎంతో||

పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు
పరమేశుని దయయందు నరుల కనికరమందు          ||ఎంతో||

Entho Bhaagyambu Shree Yesu Dorikenu
Manakentho Bhaagyambu
Vinthaina Thana Mahimanantha Vidachi Mana Korakai
Chinthalanniyu Baaputakentho Deenudaaye          ||Entho||

Paralokamunu Vidachi Manuja Kumaarudayye
Narula Baandhavudayyaa Karunaa Samudrundu        ||Entho||

Baaludayya Thana Janakuni – Pani Nerigina Vaadayye
Ee Lokapu Jananee Janakulakentho Lobadane         ||Entho||

Perigenu Gnaanamandu – Mariyu Deha Balamandu
Parameshuni Dayayandu Narula Kanikaramandu       ||Entho||

అంతే లేని నీ ప్రేమ ధార / Anthe Leni Nee Prema Dhaara

పాట రచయిత: క్రాంతి చేపూరి

అంతే లేని నీ ప్రేమ ధార
ఎంతో నాపై కురిపించినావు
వింతైన నీ ప్రేమ కొంతైన గాని
కాంతింప కృప నాకు చూపించినావు (2)
ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను
అంతో ఇంతో ఆ ప్రేమను నేను
పంచేటందుకు నీ భాగ్యము పొందాను       ||అంతే||

పరిశుద్ధుడు పరిశుద్ధుడు
అని దూతలతో పొగడబడే దేవా
పదివేలలో అతి సుందరుడా
నీవేగా అతి కాంక్షనీయుడా (2)
నా దోషములకై ఆ కలువరి సిలువలో
బలియాగమైనావ దేవా (2)
సొంతముగా నే చేసిన నా పాపములన్ని
శాంతముతో సహియించి క్షమియించినావు
పంతముతో నిను వీడి నే పారిపోగా
నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు          ||అంతే||

ఏమున్నదీ నాలో దేవా
మంచన్నదే లేనే లేదు
అయినా నీవు నను రక్షించి
నీ సాక్షిగ నిలిపావు ఇలలో (2)
అర్హతయే లేదు నీ పేరు పిలువ
నీ సొత్తుగా నను మార్చినావా (2)
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
నా జీవితమంతయును నీ కొరకే దేవా
నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు         ||అంతే||

Anthe Leni Nee Prema Dhaara
Entho Naapai Kuripinchinaavu
Vinthaina Nee Prema Konthaina Gaani
Kaanthimpa Krupa Naaku Choopinchinaavu (2)
Entho Entho Nee Prema Entho
Pondetanduku Ne Yogyudanu (Yogyuraalu) Kaanu
Antho Intho Aa Premanu Nenu
Panchetanduku Nee Bhaagyamu Pondaanu           ||Anthe||

Parishuddhudu Athi Parishuddhudu
Ani Doothalatho Pogadabade Devaa
Padivelalo Athi Sundarudaa
Neevegaa Athi Kaankshaneeyudaa (2)
Naa Doshamulakai Aa Kaluvari Siluvalo
Baliyaagamainaava Devaa (2)
Sonthamugaa Ne Chesina Naa Paapamulanni
Shaanthamutho Sahiyinchi Kshamiyinchinaavu
Panthamutho Ninu Veedi Ne Paaripogaa
Nee Raajyamunaku Cherchaga Vanthena Ainaavu          ||Anthe||

Emunnadi Naalo Devaa
Manchannade Lene Ledu
Ainaa Neevu Nanu Rakshinchi
Nee Saakshiga Nilipaavu Ilalo (2)
Arhathaye Ledu Nee Peru Piluva
Nee Soththugaa Nanu Maarchinaavaa (2)
Emivvagalanayyaa Nee Premaku Badulu
Naa Jeevithamanthayunu Nee Korake Devaa
Nee Sevalo Nenu Konasaagedanayyaa
Prakatinthu Nee Prema Thudi Shwaasa Varaku         ||Anthe||