ప్రభు మొర వినవా / Prabhu Mora Vinavaa

పాట రచయిత: జక్కయ్య
Lyricist: Jakkaiah

ప్రభు మొర వినవా
ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా – (2)     ||ప్రభు||

నాదు ప్రాణము తల్లడిల్లాగా
భూదిగంతముల నుండియేగా (2)
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2)      ||నీ కొరకే||

ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2)
చక్కని ప్రభు నీ మోము జూడ (2)      ||నీ కొరకే||

మిత్రుడా నా ఆశ్రయ నీవే
శత్రువుల యెడ నా కోట నీవే (2)
స్తుతికి కారణభూతుడా నీవే (2)      ||నీ కొరకే||

పాట రచయిత: జక్కయ్య
Lyricist: Jakkaiah

Prabhu Mora Vinavaa
Prabhu Mora Vinavaa
Nee Korake Nenu Vedakenu Devaa
Naakokasaari Kanipincha Raavaa – (2)     ||Prabhu||

Naadu Praanamu Thalladillagaa
Bhoodiganthamula Nundiyegaa (2)
Morra Pettuchunti Neekegaa (2)     ||Nee Korake||

Ekkaleni Etthaina Konda
Ekkinchumu Nanu Parishuddha Konda (2)
Chakkani Prabhu Nee Momu Jooda (2)     ||Nee Korake||

Mithrudaa Naa Aashraya Neeve
Shathruvula Yeda Naa Kota Neeve (2)
Sthuthiki Kaaranabhoothuda Neeve (2)     ||Nee Korake||

నిజముగా మొర పెట్టిన / Nijamugaa Mora Pettina

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

నిజముగా మొర పెట్టిన
దేవుడాలకించకుండునా
సహనముతో కనిపెట్టిన
సమాధానమీయకుండునా
జీవముగల దేవుడు మౌనముగా ఉండునా
తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా||

పరలోక తండ్రినడిగిన
మంచి ఈవులీయకుండునా (2)
కరములెత్తి ప్రార్థించినా
దీవెనలు కురియకుండునా (2)       ||జీవముగల||

సృష్టి కర్త అయిన ప్రభువుకు
మన అక్కర తెలియకుండునా (2)
సరి అయిన సమయానికి
దయచేయక ఊరకుండునా (2)         ||జీవముగల||

సర్వశక్తుడైన ప్రభువుకు
సాధ్యము కానిదుండునా (2)
తన మహిమ కనపరచుటకు
దయ చేయక ఊరకుండునా (2)       ||జీవముగల||

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Nijamugaa Mora Pettina
Devudaalakinchakundunaa
Sahanamutho Kanipettina
Samaadhaanameeyakundunaa
Jeevamugala Devudu Mounamugaa Undunaa
Thana Pillalakaayana Melu Cheyakundunaa (2)       ||Nijamugaa||

Paraloka Thandrinadigina
Manchi Eevulueeyakundunaa (2)
Karamuleththi Praarthinchinaa
Deevenalu Kuriyakundunaa (2)        ||Jeevamugala||

Srushti Kartha Aina Prabhuvuku
Mana Akkara Theliyakundunaa (2)
Sari Aina Samayaaniki
Dayacheyaka Oorakundunaa (2)       ||Jeevamugala||

Sarva Shakthudaina Prabhuvuku
Saadhyamu Kaanidundunaa (2)
Thana Mahima Kanaparachutaku
Daya Cheyaka Oorakundunaa (2)      ||Jeevamugala||