నీ వాక్యమే శ్రమ కొలిమిలో / Nee Vaakyame Shrama Kolimilo

నీ వాక్యమే శ్రమ కొలిమిలో
నను బ్రతికించుచున్నది (2)
నా బాధలో అది బహు నెమ్మది
కలిగించుచున్నది (2)       ||నీ వాక్యమే||

శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము
సంతోషమీయని యెడల (2)
బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా
నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ (2) ప్రభు       ||నీ వాక్యమే||

నీ శాసనములే ఆలోచన-
కర్తలై నన్ను నడుపుట వలన (2)
నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా
నీ ఆజ్ఞలను నేను తలదాల్తును (2) ప్రభు       ||నీ వాక్యమే||

వేలాది వెండి బంగారు నాణెముల
విస్తార ధన నిధి కన్నా (2)
నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా
నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం (2) ప్రభు       ||నీ వాక్యమే||

Nee Vaakyame Shrama Kolimilo
Nanu Brathikinchuchunnadi (2)
Naa Baadhalo Adi Bahu Nemmadi
Kaliginchuchunnadi (2)      ||Nee Vaakyame||

Shramayandu Naaku Nee Dharmashaashtramu
Santhoshameeyani Yedala (2)
Bahu Kaalamu Krithame Nenu – Nashiyinchiyundunayyaa
Nee Aagnalanu Batti Aanandinthun (2) Prabhu      ||Nee Vaakyame||

Nee Shaasanamule Aalochana-
Karthalai Nannu Naduputa Valana (2)
Naa Shathruvula Minchina Gnaanamu – Naakilanu Kaligenayyaa
Nee Aagnalanu Nenu Thaladaalthunu (2) Prabhu      ||Nee Vaakyame||

Velaadi Vendi Bangaaru Naanemula
Visthaara Dhana Nidhi Kannaa (2)
Nee Dharmashaasthrame Yentho – Viluvaina Nidhi Prabhuvaa
Nee Aagnalanu Batti Ninu Pogadedan (2) Prabhu      ||Nee Vaakyame||

నీ వాక్యమే నా పాదాలకు / Nee Vaakyame Naa Paadaalaku

పాట రచయిత: క్రాంతి చేపూరి

నీ వాక్యమే నా పాదాలకు దీపము
నీ చిత్తమే నా జీవిత గమనము (2)
కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా (2)
వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యా
స్తోత్రాలయ్యా – కోట్లకొలది స్తోత్రాలయ్యా    ||నీ వాక్యమే||

నీ భారము నాపై వేయుము
ఈ కార్యము నే జరిగింతును (2)
నా కృప నీకు చాలును
అని వాగ్దానమిచ్చావయ్యా (2)        ||వందనాలయ్యా||

పర్వతములు తొలగిననూ
మెట్టలు తత్తరిల్లిననూ (2)
నా కృప నిన్ను వీడదు
అని అభయాన్ని ఇచ్చావయ్యా (2)     ||వందనాలయ్యా||

Lyricist: Kranthi Chepuri

Nee Vaakyame Naa Paadaalaku Deepamu
Nee Chiththame Naa Jeevitha Gamanamu (2)
Krupa Vembadi Krupatho
Nanu Preminchina Devaa (2)
Vandanaalayyaa Neeke – Velakoladi Vandanaalayyaa
Sthothraalayyaa – Kotlakoladi Sthothraalayyaa    ||Nee Vaakyame||

Nee Bhaaramu Naapai Veyumu
Ee Kaaryamu Ne Jariginthunu (2)
Naa Krupa Neeku Chaalunu
Ani Vaagdhaanamichchaavayyaa (2)      ||Vandanaalayyaa||

Parvathamulu Tholaginanu
Mettalu Thaththarillinanu (2)
Naa Krupa Ninnu Veedadu
Ani Abhayaanni Ichchaavayyaa (2)       ||Vandanaalayyaa||

నీ వాక్యమే నన్ను బ్రతికించెను / Nee Vaakyame Nannu Brathikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను (2)
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2)      ||నీ వాక్యమే||

జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)
నా పాదములకు దీపమాయెను (2)
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2)       ||నీ వాక్యమే||

శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)
అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2)       ||నీ వాక్యమే||

పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది (2)
మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)
రత్న రాసులకన్నా కోరతగినది (2)           ||నీ వాక్యమే||

Nee Vaakyame Nannu Brathikinchenu
Baadhalalo Nemmadinichchenu (2)
Krupaa Shakthi Dayaa Sathya Sampoornudaa
Vaakyamai Unna Yesu Vandanamayyaa (2)         ||Nee Vaakyame||

Jigatagala Oobhinundi Levaneththenu
Samathalamagu Bhoomipai Nannu Nilipenu (2)
Naa Paadamulaku Deepamaayenu (2)
Sathyamaina Maargamulo Nadupuchundenu (2)       ||Nee Vaakyame||

Shathruvulanu Edurkone Sarvaanga Kavachamai
Yudhdhamunaku Sidhdha Manasu Ichchuchunnadi (2)
Apavaadi Veyuchunna Agni Baanamulanu (2)
Khadgamu Vale Addukoni Aarpi Veyuchunnadi (2)      ||Nee Vaakyame||

Paalavantidi Junti Thene Vantidi
Naa Jihvaku Mahaa Madhuramainadi (2)
Melimi Bangaaru Kanna Minna Ainadi (2)
Rathna Raasulakannaa Korathaginadi (2)       ||Nee Vaakyame||