నీతోనే గడిపేయాలని / Neethone Gadipeyaalani

ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్
ప్రెయిస్ హిం ఇన్ ద నూన్
ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్
ప్రెయిస్ హిం ఆల్ ద టైం

వేకువనే నా దేవుని ఆరాధింతును
ప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2)
నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అని
నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2)

నను నడిపించే దైవమా
నాతో నిలిచే కేడెమా (2)
ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతును
నీ కార్యముల చేత నన్ను
తృప్తి పరచి సంతోషమే         ||నా ప్రాణం||

నను కరుణించు బంధమా
నను బలపరచి ధైర్యమా (2)
కన్నీటి ప్రార్ధనతో నీ చెంత నే చేరెదన్
నిను విడచి క్షణమైనా
నే బ్రతకలేను ఇలలో        ||నా ప్రాణం||

Vekuvane Naa Devuni Aaraadhinthunu
Prathi Samayamuna Parishuddhuni Keerthinchedanu (2)
Naa Dhyaanam Naa Sarvam Naa Praanam Neevegaa Ani
Naa Samayam Anukshanamu Neethone Gadipeyaalani (2)

Nanu Nadipinche Daivamaa
Naatho Niliche Kedemaa (2)
Udayamuna Nee Krupanu Sthuthi Gaanaaltho Keerthinthunu
Nee Kaaryamula Chetha Nannu
Thrupthi Parachi Santhoshame         ||Naa Praanam||

Nanu Karuninchu Bandhamaa
Nanu Balaparache Dhairyamaa (2)
Kanneeti Praardhanatho Nee Chentha Ne Cheredan
Ninu Vidachi Kshanamainaa
Ne Brathakalenu Ilalo          ||Naa Praanam||

నీతోనే ఉండుటయే / Neethone Undutaye

నీతోనే ఉండుటయే
నా జీవిత వాంచయ్యా
నీ చిత్తం నెరవేర్చుటయే
నా హృదయ తపనయ్యా (2)
యేసయ్యా నిన్నే కదా
నా ముందు నిలిపేను (2)        ||నీతోనే||

కరుణయు కృపయు నిరంతరం శాంతి
అన్నియు చేయువాడా (2)
నా జీవితం.. నశియింపగా.. (2)
కాపాడువాడా… నా కాపరి… (2)        ||యేసయ్యా||

నా కొరకు అన్నియు చేయువాడా
చేసి ముగించువాడా (2)
నా బరువు.. నా బాధ్యత.. (2)
నీ పాద చెంత… నుంచితివి… (2)        ||నీతోనే||

Neethone Undutaye
Naa Jeevitha Vaanchayyaa
Nee Chittham Neraverchutaye
Naa Hrudaya Thapanayyaa (2)
Yesayyaa Ninne Kadaa
Naa Mundu Nilipenu (2)        ||Neethone||

Karunayu Krupayu Nirantharam Shaanthi
Anniyu Cheyuvaadaa (2)
Naa Jeevitham.. Nashiyimpagaa.. (2)
Kaapaaduvaadaa… Naa Kaapari… (2)        ||Yesayyaa||

Naa Koraku Anniyu Cheyuvaadaa
Chesi Muginchuvaadaa (2)
Naa Baruvu.. Naa Baadhyatha.. (2)
Nee Paada Chentha… Nunchithivi… (2)      ||Neethone||

నిరంతరం నీతోనే / Nirantharam Neethone

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా     ||నిరంతరం||

చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి (2)
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Nirantharam Neethone Jeevinchaalane
Aasha Nannila Brathikinchuchunnadi (2)
Naa Praaneshwaraa Yesayyaa
Naa Sarvasvamaa Yesayyaa      ||Niranatharam||

Cheekatilo Nenunnappudu
Nee Velugu Naapai Udayinchenu (2)
Neelone Nenu Velagaalani
Nee Mahima Naalo Nilavaalani (2)
Parishuddhaathma Abhishekamutho
Nannu Nimpuchunnaavu Nee Raakadakai      ||Niranatharam||

Nee Roopamu Nenu Kolpyinaa
Nee Rakthamutho Kadigithivi (2)
Neethone Nenu Nadavaalani
Nee Valane Nenu Maaraalani (2)
Parishuddhaathma Varamulatho
Alankarinchuchunnaavu Nee Raakadakai      ||Niranatharam||

Tholakari Varshapu Jallulalo
Nee Polamulone Naatithivi (2)
Neelone Chigurinchaalani
Neelone Pushpinchaalani (2)
Parishuddhaathma Varshamutho
Siddhaparachuchunnaavu Nee Raakadakai      ||Niranatharam||